Meghasandesam Serial Today February 20th: ‘మేఘసందేశం’ సీరియల్: చెర్రి చనిపోయాడన్న కేపీ – షాక్‌లో మీరా
Meghasandesam serial today episode February 20th: స్వామిజీ వేషంలో వచ్చిన కేపీ చెర్రి చనిపోయాడని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గుడి నుంచి ఇంటికి వెళ్లిన శరత్ చంద్ర బాధపడుతుంటే అపూర్వ, నక్షత్ర, సుజాత వెళ్తారు. సుజాత మజ్జిగ గ్లాసు పట్టుకుని శరత్ చంద్రకు ఇస్తూ ఓదారుస్తుంది. బావ నువ్వెంత బాధపడినా.. అవమానంతో రగిలిపోయినా జరిగిపోయిన దాన్ని మంన మార్చలేం బావ.. ఇదిగో చల్లగా ఈ మజ్జిగ తాగు బావ అంటుంది.
శరత్: వద్దు అపూర్వ ఇప్పుడు నాకే ఏమీ వద్దు
అపూర్వ: బావ నేను బతికి ఉన్నది నిన్ను ప్రశాంతంగా ఉంచడానకి. నువ్వు మనఃశాంతిగా ఉంటే చూడటానికి ఫ్లీజ్ బావ నాకోసం బావ ఫ్లీజ్ తాగు బావ
(అంటూ మజ్జిగ శరత్ చంద్రతో తాగిస్తుంది అపూర్వ.) చూస్తుంటే ఇంకా నీ ఆవేశం తగ్గినట్టు లేదు.
సుజాత: ఎలా తగ్గుతుంది అమ్మాయి. కర్రసాములో అల్లుడి గారి విజయ పరంపర ఎలాంటిది. పదహారేళ్ల వయసులో పంచె కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లుడు గెలుచుకుంటూనే వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆ గగన్ గాడు అల్లుడి గారిని పిచ్చ కొట్టుడు కొట్టాడు.
అపూర్వ: పిన్ని కాస్త గౌరవంగా మాట్లాడు.
శరత్: అపూర్వ.. అత్తయ్య అన్నదాంట్లో తప్పేం ఉందిలే..? వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇంచు మించుగా నన్ను ఆ గగన్ గాడు అలాగే కొట్టాడు.
అపూర్వ: అయినా ఇందులో వాడి తప్పు ఏం లేదు బావ. నిన్ను వాడి చేతిలో ఓడగొట్టమని చెప్పింది ఆ భూమే. నిన్న దాని పుట్టినరోజు సందర్భంగా నీ ఆశీర్వాదం కోసం అవమానించి పంపించావనే పగ దాని మనసులో పెట్టేసుకుంది బావ. మన భూమిని మన ఇంట్లో అవమానిస్తే.. తను మాత్రం నిన్ను నలుగురిలో అవమానపడేలా చేసింది బావ.
నక్షత్ర: అవును డాడీ గగన్ బావతో భూమి మాట్లాడటం నేను విన్నాను. ఎలాగైనా నిన్ను ఓడించాలని.. నీ ఓటమి చేతులతో నువ్వు భూమిని దీవించేలా చేయాలని భూమి చెప్పడం నేను విన్నాను డాడీ. ఇంకా చాలా చెప్పింది డాడీ.
అపూర్వ: గెలిచిన మాట వరకు ఓకే కూతురు అన్నాక ఆశీర్వాదం తీసుకోవడం కోసం మంచి మనసున్న అమ్మాయిలా అలా చేసింది అనుకోవచ్చు. కేవలం ఓడంచడానికే అనుకున్నా.. లేకపోతే ఏకంగా కర్రసాము పోటీలలో ఆ గగన్ గాడితో బావను చంపించాలనుకుంటుందా..?
సుజాత: ఆ గగన్ గాడు అల్లుడు గారిని కొట్టిన దెబ్బలు నువ్వు చూడలేదా ఏంటి అమ్మాయి. వాడు గెలవడానికి కొడుతున్నట్టు అనిపించిందా.? ఏకంగా మన అల్లుడి గారిని చంపడానికి కొడుతున్నట్టు అనిపించలేదు..
నక్షత్ర: అవును డాడీ గగన్ బావ మీ డాడీని గెలిచేలా కొడతాను అంటే ఆ భూమి చచ్చినా పర్వాలేదు అని చెప్పడం విని నేను షాక్ అయ్యాను.
అపూర్వ: అంటే అసలు ఆ భూమి ఉద్దేవం ఏంటి.? బావను కర్రసాములో చంపించేసి ఈ ఆస్థి అంతా తను కైవసం చేసుకోవాలని చూస్తుందా..? మనల్ని రోడ్డు పాలు చేసి మన అదోగతిని చూడాలనుకుంటుందా..?
సుజాత: అనుకుందా అనుకుందా అని ఇంకా ప్రశ్నిస్తావేంటి అమ్మాయి. నీ ప్రశ్నలే సమాధానాలు మన పతనమే ఆ అమ్మాయి లక్ష్యం.
అంటూ ముగ్గురూ కలిసి రెచ్చగొట్టగానే.. శరత్ చంద్ర కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కేపీ స్వామిజీ వేషం వేసుకుని శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. ఎవరు పిలిపించారని అపూర్వ అడిగితే లోపలి నుంచి వచ్చిన మీరా నేను పిలిపించాను అని చెప్తుంది. ఇంట్లోకి వెళ్లిన కేపీ పూజ చేస్తున్నట్టు నటించి చెర్రి చనిపోయాడని అపూర్వే చెర్రిని చంపేసిందని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























