MeghasandesamSerial Today Episode: కర్రసాము పందెంలో గగన్ చేతిలో శరత్ చంద్ర ఓడిపోతాడు. దీంతో గగన్ చెప్పినట్టు వినాలని నిర్వాహకులు చెప్తారు. దీంతో గగన్, శరత్ చంద్రను గుడిలో భూమిని ఆశీర్వదించమని చెప్తాడు. దానికి శరత్ చంద్ర సరే అంటూ బయటకు వెళ్తాడు. వెనకే వెళ్తుంది అపూర్వ.
అపూర్వ: వద్దు బావ నువ్వు ఆ గగన్ మాట వినడం కానీ ప్రాధాన్యత ఇచ్చి పాటించడం కానీ ఏమీ చేయకు.
శరత్: అలా అంటే ఎలా అపూర్వ మనకు
అపూర్వ: బావా ఫ్లీజ్ ఈ పోటీల్లో గత ఇరవై సంవత్సరాలుగా నువ్వు గెలుస్తూ వస్తున్నావు అన్నమాట జగమెరిగిన సత్యం. ఈరోజు వాడు నీతో పోటీ పడి నిన్ను ఓడించాలనుకున్నాడు. నాకు తిరుగు లేదని నువ్వు అనుకుంటుంటే నిన్ను తలకిందులుగా తిప్పేయోచ్చు కదా అని వాడనుకున్నాడు. అయినా ఇష్టం లేకపోయినా ఆయన కూతుర్నే కదా పెళ్లి చేసుకున్నాను. మామే కదా ఆయన గౌరవాన్ని తగ్గనీయకూడదని ఏమైనా అనుకున్నాడా..? లేదే.? సరే బావ ఆ గగన్ గాడిని పక్కన పెట్టు. వాడైతే మనల్ని మొదటి నుంచి శత్రువులుగా చూస్తున్నాడు. భూమిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నాడు. కానీ నువ్వుంటే ప్రాణం నీకోసం ప్రణాలు తీసుకుంటానన్న భూమి ప్రేమ ఏమైంది. తనది అంతా నటనేనా..? నువ్వు ఓడిపోతావన్న భయంతో నేను వెళ్లి భూమిని కలిశాను బావ. గగన్‌ను ఈ పోటీకి రాకుండా ఆపు అని ఈ సంవత్సరం విజయం సాధించాక నా బావ కావాలంటే ఈ పోటీల నుంచి తప్పుకుంటాడని భూమి ముందు చేతులు చాపి ప్రాధేయపడ్డాను. ఈరోజు నా భర్త గగన్ మీద మా నాన్న గెలవడం రెండు ఒక్కటే కాదంది బావ.
శరత్: అనవసరంగా నువ్వు భూమి ముందు మోకరిల్లావు.
అపూర్వ: తనకు తన భర్త గొప్ప అనుకుంటే నాకు నా భర్త గొప్ప కాదా బావ.
శరత్: సరే అయిందేదో అయింది. ఇప్పుడు ఈ ప్రసంగం వల్లన నా ఓటమి ప్రస్థానం వల్లన అయ్యేదేముంది. ఆ భూమిని గుడిలో ఆశీర్వదిస్తానని చెప్పాను కదా పద వెళ్దాం.
అపూర్వ: బావ ఈ నా కంఠశోసంతా ఇదంతా ఆపడానికే. బయటకు ప్రేమ చూపిస్తూ.. ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఆ భూమిని ఆశీర్వదించాల్సిన అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం. వద్దు వాళ్లు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పినట్టు ఉంటుంది. జరిగిన అవమానానికి బదులుగా అవమానించినట్టు ఉంటుంది. బావ ఇంటికి వెళ్దాం పద.
శరత్: నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నలుగురు పెద్ద మనుషుల ముందు మాటిచ్చాను కదా..? పద వెళ్దాం.
అంటూ శరత్ చంద్ర లోపలికి వెళ్లగానే.. వెనకాలే అపూర్వ వెళ్తుంది. గుడిలోకి వెళ్లిన శరత్ చంద్ర అయిష్టంగానే భూమిని ఆశీర్వదిస్తాడు. దీంతో చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన భూమి శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉందని బాధపడుతుంది. గగన్ బావ నాకోసం ఇవాళ చాలా చేసాడని ఫోటో ముందు మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ కూడా ఎమోషనల్ అవుతూ.. భూమికి ఐలవ్యూ చెప్తాడు. దీంతో భూమి, గగన్‌కు లిప్‌కిస్ ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
