MeghasandesamSerial Today Episode: అపూర్వ రూంలో కూర్చుని ఆలోచిస్తుంటే సుజాత వెళ్లి అమ్మాయి ఈ ఇంటికి ఎలాగూ సంక్రాంతి పండుగ లేదు కనీసం గుడికి వెళ్లడం అయినా ఉందా..? అని అడగ్గానే.. అపూర్వ ఇరిటేటింగ్ గా ఉంది పిన్ని అని చెప్తుంది. దీంతో వినబడనట్టు సుజాత ఉందా లేదా..? అంటుంది.
అపూర్వ: మనమే కాదు మనతో పాటు బావ కూడా వస్తారు గుడికి .
సుజాత: ఏం రావడమో ఏంటో అమ్మాయి. అల్లుడు గారు నిన్ను నిన్న చంపేస్తారేమోనని నా ఒళ్లంతా వణికిపోయింది. నువ్వు చచ్చి ఉంటే ఈరోజుకు రెండు.. రేపటికి మూడు. అంటే రేపు నీ చిన్న కర్మ అన్నమాట. నీ ఫోటోకు దండేసి దండం పెట్టి మా ఊరు బయలుదేరాల్సి వచ్చేది. ఇంకా నేను తినే ఈ మెతుకుల మీద నా పేరు రాసి ఉంది కాబట్టి నువ్వు బతికి ఉన్నావు అమ్మాయి.
నక్షత్ర: అంత తేలిగ్గా మా మమ్మిని ఎలా చావనిస్తాను గోరింటాకు. టైంకు నేను రెడీ చేసినా ఏఐ ఇమేజనరీని నేను ప్లే చేశాను కదా..?
అపూర్వ: నిజమే బేబీ టైంకి నువ్వు కనక ఆ వీడియో ప్లే చేయకుండా ఉండి ఉంటే . పిన్ని చెప్పినట్టు ఇప్పటికి నేను చచ్చిపోయి ఉండాల్సింది. నేను నీకు జన్మను ఇవ్వడం కాదే ఈ రోజు నువ్వే నాకు మరుజన్మను ఇచ్చావు. అవును నిన్న నువ్వు చేసిన ఏఐ ఇమేజ్ అలాగే ఉందా..? మరి మనమీద డాడీకి తప్పుగా చూపించిన ఆ ఇమేజ్ ఎవరు చేసినట్టు.. మనంతట మనమే చూపించేలా నీ ఫోన్‌లోకి ఆ ఇమేజ్‌ను మార్చింది ఎవరు..?
సుజాత: ఆ ఇంకెవరు ఆ చెర్రి గాడి ఆత్మ అమ్మాయి..
అపూర్వ: చీ నోరు మూయ్..
సుజాత: ఆ నువ్వు ఇలాగే నోరు మూయ్ నోరు మూయ్ అంటావ్.. నీకా ఆ దెయ్యం బండగాడు కనబడడాయో.. మమ్మల్ని వదలడాయో.. ఇది కూడా ఆ చెర్రి గాడి ఆత్మ పనేనమ్మాయి.
అపూర్వ: పిన్ని ఆత్మ లేదు ప్రేతాత్మ లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తుంటే మన వెనకాల ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అసలు అదేంటో తెలుసుకోవాలి. ఏదో ఉంది మిస్టరీ..?
అంటూ అపూర్వ ఆలోచిస్తుంది. నక్షత్ర, సుజాత కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. తర్వాత గుడి దగ్గర సంక్రాతి సంబరాలు జరుగుతుంటాయి. అక్కడ సంబరాల్లో భాగంగా కర్రసాము పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కర్రసాము పోటీలలో విజేతగా నిలుస్తున్న శరత్‌చంద్రను మెచ్చుకుంటూ ఫ్లెక్సీలు ఉంటాయి. అప్పుడే అక్కడకు శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర, సుజాత వెళ్తారు. వాళ్ల వెనకాలే కేపీ, మీరా వెళ్తారు. అదే గుడికి గగన్ కూడా కుటుంబంతో వెళ్తాడు. గగన్ వాళ్లను చూసిన శరత్ చంద్ర కోపంతో రగిలిపోతుంటాడు. అపూర్వ కోపంగా చూస్తుంది. భూమి మాత్రం శరత్ చంద్ర వైపు బాధగా చూస్తుంది. శారద చూస్తుందని మీరా, కేపీని దగ్గరకు తీసుకుని చేయి పట్టుకుంటుంది.
సుజాత: ఇక్కడ అందరికీ రియాక్షన్స్ ఉన్నాయి. క్యామెడీ క్యారెక్టర్‌ను నాకే ఏ రియాక్షన్స్ లేవు. ఈ సమ్మర్‌లో అయినా నాకు తాళి కట్టే జోడీ దొరికితే నేను కూడా ఒక మంచి రొమాంటిక్ రియాక్షన్ ఇవ్వాలి
అని మనసులో అనుకుంటుంది. శరత్ చంద్ర అందరినీ తీసుకుని గుడిలోకి వెళ్తాడు. వాళ్ల వెనకాలే గగన్ ఫ్యామిలీ వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
