Meghasandesam Serial Today Episode : ఇంకా ప్లాన్‌ పూర్తిగా వర్కవుట్‌ కాలేదని ఇప్పుడే అమలవుతుందని చెప్పి బెల్ట్‌ తీసుకుని అపూర్వను కొడుతుంది.  మళ్లీ అపూర్వ తనను కొడుతున్నట్టు అరుస్తుంది. దీంతో అందరూ రూం దగ్గరకు పరుగెత్తుకొస్తారు. గట్టిగా పిలుస్తుంటారు. దీంతో భూమి మరింత గట్టిగా అయ్యో ఆంటీ కొట్టోద్దు అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఇంతలో తన జుట్టు, బట్టలు నలిపేసుకుని వెళ్లి డోర్‌ తీసుకుని బయటకు వెళ్తుంది.

శరత్: భూమి ఏమైందమ్మా..?

భూమి: ఏమో నాన్నా ఆంటీ పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. కొడుతుంది. అమ్మో ఏదేదో చేస్తుంది. భయమేస్తుంది నాన్నా.. రాత్రి కూడా తనుక పూనింది శోభాచంద్రమ్మ కాదనిపిస్తుంది. ఏదో కొరివి దెయ్యం పట్టినట్టు ఉంది.

సుజాత: నిజమేనా..? అయ్యుండొచ్చు.. ( అని మనసులో అనుకుంటుంది.)

భూమి: ఒకటే కొట్టుడు.. మీరే విన్నారు కదా తన మాటలు.. చూడు నాన్నా ఎలా డోర్‌ కొడుతుందో చూడండి. కచ్చితంగా ఇది కొరివి దెయ్యమే.. కావాలంటే ఎవరైనా వెళ్లి చెక్‌ చేయోచ్చు. చెర్రి నువ్వు వెళ్లి చూడు.

చెర్రి: అమ్మో నేనా.. కలలోకి దెయ్యం వస్తే బెడ్ మీద నుంచి దిగనమ్మా.. మీలో ఎవరైనా వెళ్లండి.

భూమి: పోనీ పిన్ని గారు మీరైనా వెళ్లండి..

సుజాత: అమ్మో నాకంత ధైర్యం లేదమ్మా..?

ప్రసాద్‌: భూమి నేను వెళ్లి చెక్‌ చేస్తాను.

అని ప్రసాద్‌ కూడా లోపలికి వెళ్లి అపూర్వ గారు కొట్టకండి.. ఫ్లీజ్‌ అంటూ రూంలో సామాన్లు చిందరవందర చేస్తూ.. గట్టిగా అరుస్తాడు. దెబ్బలు తగిలినవాడిలా బయటకు వెళ్తాడు. ఏమైందని అడగ్గానే.. అపూర్వ గారికి కొరివి దెయ్యం పట్టింది నేను భూత వైద్యుడిని తీసుకొస్తాను అని వెళ్తాడు ప్రసాద్‌. తర్వాత తానే మాంత్రికుడి వేషం వేసుకుని వచ్చి అపూర్వకు పట్టిన దెయ్యం వదిలిస్తున్న వాడిలా మంత్రాలు వేస్తుంటాడు. అపూర్వను కొడుతుంటాడు. అపూర్వకు మాటలు రావడానికి విరుగుడు మందు తాగిస్తాడు. తర్వాత కొరడా తీసుకుని కొడుతుంటాడు. ఇంతలో అపూర్వకు గొంతు వస్తుంది.

అపూర్వ: నాకేం దెయ్యం పట్టలేదు బావ. ఇదిగో ఈ భూమే నాటకం ఆడుతుంది.

భూమి: నన్ను చంపినంత పని చేసి నేను నాటకాలు ఆడుతున్నాను అంటారేంటి ఆంటీ..

మంత్రగాడు: ఇంకా దెయ్యం దిగలేదు.. కషాయం తాగించాల్సిందే.. ఏయ్‌ కొరివి దెయ్యం నీకిస్తా.. బిష బిష

అపూర్వ: వద్దు నాకేం దెయ్యం పూనలేదు. రాత్రి శోభాచంద్ర అక్క కూడా నాకు పూనలేదు చాలా..?

మంత్రగాడు: రాత్రి జరిగింది చెప్తుందంటే దెయ్యం వదిలిపోయింది సామీ

అంటూ అన్ని తీసుకుని వెళ్లిపోతాడు.

శరత్‌: శోభాచంద్ర పూనలేదా..? పూనినట్టుగా నాటకం ఆడావా..?

అపూర్వ: అవును బావ నాటకం ఆడాను.. నేనే కాదు బావా ఇది కూడా నాటకం ఆడింది బావ..

అని చెప్తుండగానే శరత్‌ చంద్ర కోపంగా అపూర్వను కొడతాడు. నువ్వు నాటకం ఆడిందే కాక భూమిని నాటకం ఆడింది అంటావా..? అనగానే.. ఈ భూమిని దత్తత తీసుకోవడం ఆస్థి ఇవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా ఆడాను అంటుంది. దీంతో అపూర్వను తిడుతూ.. చెర్రి దత్తత కార్యక్రమం జరుగుతుంది. ఆ పనులు మీ నాన్నను చూడమను అని చెప్పి శరత్‌ చంద్ర వెళ్లిపోతాడు.  మరోవైపు హాస్పిటల్ కు వెళ్లిన గగన్‌ ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ జరుగుతున్న నక్షత్రను చూస్తాడు. ఎమోషనల్‌గా తన గతాన్ని చందుకు చెప్తాడు గగన్‌. శరత్‌ చంద్ర ఇంటితో తనకున్న శత్రుత్వాన్ని చెప్తాడు. ఆ శరత్‌ చంద్ర కూతురే ఈ నక్షత్ర అంటూ తన ఫోన్‌ నుంచి మెసెజ్‌ పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేసిన విషయం చెప్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!