MeghasandesamSerial Today Episode: రూంలో ఒంటరిగా కూర్చున్న శరత్‌ చంద్ర, శోభాచంద్రను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంటాడు. మరోవైపు అప్పుడే నిద్ర లేచిన కేపీ దగ్గరకు మీరా కాఫీ తీసుకుని వెళ్తుంది. కాఫీ తీసుకున్న కేపీ..

కేపీ: మీరా బావగారు లేచారా..?

మీరా: మీకు తెలుసు కదండి ఈరోజు ఎంత కదిలించినా అన్నయ్య ఈ లోకంలో ఉండరు. మా శోభాచంద్ర వదిన నిన్న మొన్న చనిపోతే ఎలా బాధపడతారో అలాగే ప్రతి సంవత్సరం బాధపడుతూనే ఉంటారండి. అన్నయ్యను అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అండి..

కేపీ: నిజమే ఆ మహా తల్లి బావగారిని అంతలా ప్రేమించింది. నా చెల్లెలిని ప్రేమను మర్చిపోవడం అసాధ్యం. అందరినీ కొట్టక ముందే నా శోభా చంద్రమ్మ ఇంటిని ఆవరించిన చీకటిని కనుక్కోలేకపోయింది. భోగీ పండుగ రోజు ఆమె మంటల్లోకి వెళ్లిపోయి.. మా బావగారిని చీకట్లో వదిలేసింది.

అంటూ చెప్తూ కేపీ శోభా చంద్ర చనిపోయిన విషయం గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంటాడు.

మీరా: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి..

కేపీ: వదిలేసెయ్‌ మీరా..? నీకు అర్థం అయినట్టు చెప్పినా చెప్పింది నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదు. ఈ ఇంటికి తీసుకొచ్చిన మనుషులను బట్టే మన అర్హతలు ఉంటాయని ఆరోజు నేను తెలుసుకోలేకపోయాను.

అంటూ కేపీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. మరోవైపు  సుజాత, నక్షత్ర ఓకే రూంలో పడుకుని ఉంటారు. ఇంతలో అల్లారం మోగగానే.. సుజాత నిద్ర లేస్తుంది. నక్షత్రను నిద్ర లేపుతుంది.

సుజాత: బేబీ బేబీ లేవ్‌ బేబీ.. ఈరోజు భోగీ తలార స్నానం చేసి వెచ్చగా మంటకాగుదాం..  లెగు బెబీ..

నక్షత్ర: అంత అదృష్టం మనకు లేదు గోరింటాకు. ఊరంతా భోగీ పండుగ చేసుకుంటుంటే ఊరి చివర స్మశాన వాటికలా మన ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు పడుకో గోరింటాకు.

సుజాత: ఏంటి బేబీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు.

అపూర్వ: అది చెప్తుంది నిజమే పిన్ని ఈ ఇంటికి భోగీ, సంక్రాంతి పండుగల్లేవు. ఎందుకంటే ఈ రోజు శోభా అక్క చనిపోయిన రోజు కదా..?

సుజాత: అవును కదూ.. మర్చేపోయాను అమ్మాయి. ఈ రోజే కదా నువ్వు శోభా చంద్రను చంపేశావు. నీకు ఈరోజు పండగే పండగ అమ్మాయి.

నక్షత్ర: ఏంటి మమ్మీ శోభా చంద్ర పెద్దమ్మను చంపేసింది నువ్వా..?

సుజాత: ఇప్పటి దాకా నువ్వు చిన్న పిల్లవి అని చెప్పనట్టు ఉంది. ఇప్పుడు నువ్వు కూడా మర్డర్లు చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదా..? చెప్పడంలో తప్పు లేదులే.. అంతే కదూ అమ్మాయి.

అపూర్వ: నువ్వు నోరు మూయ్‌..

నక్షత్ర: ఏంటి మమ్మీ గోరింటాకు నోరు మూసేది. అనవసరంగా నువ్వు శోభాచంద్ర పెద్దమ్మను చంపేశావు కదా..?

సుజాత: మరీ పిచ్చిదానిలా మాట్లాడకే పిచ్చి చుచ్చు బేబీ.. మీ అమ్మ పెద్దమ్మను పైకి పంపించకపోయి ఉంటే నువ్వు ఈ భూమ్మీద ముఖ్యంగా ఈ ఇంటి వారసురాలిగా పడేవా ఏంటి బేబీ

అంటూ సుజాత చెప్పగానే నక్షత్ర షాక్‌ అవుతుంది. కట్‌ చేస్తే మరోవైపు ఇంట్లో భూమి గగన్‌కు డ్రెస్‌ గిప్ట్‌గా ఇస్తుంది. ఆ డ్రెస్‌ చూసిన గగన్‌ ఇదేంటి పంచె తెచ్చావు నాకు కట్టుకోవడానికి రాదు అని చెప్తాడు. నీకు కట్టుకోవడం రాకపోతే నేను కడతాను అంటూ భూమి, గగన్‌కు పంచె కట్టిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్‌ జరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!