Meghasandesam Serial Today Episode:  బిందు బాధపడుతూ కూర్చుంటే..  చెర్రి వచ్చి ఈ పిల్ల దెయ్యం ఇక్కడే ఉంది. దీని కంట పడకుండా ఎలాగో డ్రెస్‌ తీసుకెళ్లాలి అనుకుని..మెల్లగా డ్రెస్‌ తీసుకుని వెళ్తుంటే.. బిందు చూసి పిలుస్తుంది. ఇది చూసేసింది అని మనసులో అనుకుంటాడు చెర్రి ఏంట్రా అది అని అడుగుతుంది. ఇది డ్రెస్‌ అని చెర్రి చెప్పగానే నాకు కొన్నావా..? అని అడగ్గానే నీకు కాదు భూమికి కొన్నాను అని చెప్పగానే బిందు కోప్పడుతుంది. డ్రెస్‌ తీసుకుని భూమి దగ్గరకు వెళ్తాడు చెర్రి.


చెర్రి : మువ్వా.. బర్తుడే గిఫ్ట్‌ నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను.


భూమి: ప్రేమగానా..?


చెర్రి: అదే అభిమానంతోనూ ఇష్టం తోనూ అని చెప్తుంటారు కదా..? ఆ మీనింగ్‌ తో చెప్పాను.


భూమి: నువ్వు పొరపాటు పడుతున్నావు చెర్రి బర్తుడే గిఫ్ట్‌ నాకు కాదు నక్షత్రకు ఇవ్వాల్సింది.


చెర్రి: అయ్యో బర్తుడే సందర్భంగా నువ్వు కూడా మంచి డ్రెస్‌ వేసుకోవాలని తీసుకొచ్చాను.


భూమి: అయినా నువ్వెందుకు తీసుకురావాలి.


చెర్రి: అంటే నీకైతే మాత్రం ఎవరున్నారు. నేనే కదా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి.


భూమి: విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి చెర్రి నన్ను చూసుకోవడానికి అంకుల్‌ ఉన్నారు కదా..? ఏమీ అనుకోవద్దు నాకు ఈ గిఫ్ట్‌ వద్దు


 అని భూమి చెప్పగానే చెర్రి నిరాశగా వెళ్లిపోతుంటాడు. ఇంతలో భూమి తనకు మొదటగా పరిచయం అయిన విషయం గుర్తు చేసుకుని చెర్రి తీసుకొచ్చిన డ్రెస్‌ తీసుకుంటుంది భూమి. దీంతో చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత చెర్రి తీసుకొచ్చిన డ్రెస్‌ వేసుకున్న భూమి తనను తాను మిర్రర్‌లో చూసుకుంటుంది. ఇంతలో గగన్‌ వచ్చి డోర్‌ కొడతాడు. డోర్‌ తీసి గగన్‌ చూసిన భూమి షాక్‌ అవుతుంది.


భూమి: మీరా…? మీరెందుకు వచ్చారు.


గగన్‌: నేను ఇలా వచ్చినా నువ్వు గుర్తు పట్టావు అంటే అది ప్రేమే..


భూమి: అయ్యోయ్యో అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీకు అసలు భయం లేదా..?


గగన్‌: ప్రేమ ఉన్న చోట ఏమీ ఉండదు. ప్రేమ మాత్రమే ఉంటుంది.


భూమి: ప్రేమ ప్రేమ అని చెప్పి మీరు నన్ను ఇలా భయపెట్టకండి.


గగన్‌: నిజం చెప్పు నన్ను చూస్తూ నీకు భయంగా ఉందా..? నా నుంచి దూరంగా పారిపోవాలని ఉందా..? నిజంగా నిన్ను బయపెడుతున్నాను అంటే ఇంకెప్పుడు కలవను. బయపెట్టి ప్రేమించే దాన్ని ప్రేమ అనరు బలవంతం అంటారు. బలవంతంగా ఒప్పించాలనుకోవడం లేదు. ఇప్పుడే వెళ్లిపోతాను.


భూమి: అయ్యో.. ఆగండి..


గగన్‌: అంటే ప్రేమ ఉన్నట్టేగా..


భూమి: ఇప్పుడు మీరు పెడుతున్న ప్రేమ బలవంతం కాదు. ఎవరైనా చూస్తే ఏం గొడవలు అవుతాయోనని భయం.


గగన్‌: ఎవరూ చూడకపోతే ఓకే అన్నమాట.


అని గగన్‌ అడగ్గానే ఇద్దరి మధ్య రోమాన్స్ జరుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్‌ సాంగ్‌ వస్తుంది. ఇంతలో ప్రసాద్‌ వచ్చి అమ్మా భూమి అని పిలుస్తాడు. దీంతో కలలోంచి బయటకు వస్తుంది భూమి. మీరేంటి మామయ్య ఇక్కడ ఆయనేరి అని అడుగుతుంది. ఎవరమ్మా అని ప్రసాద్‌ అడుగుతాడు. అదే మీ అబ్బాయి అని చెప్తుంది. ఇంతలో చెర్రి వస్తాడు. వాడు రాలేదమ్మా వచ్చాడనుకుని నువ్వు ఇలా గాలిలో తిరుగుతున్నావు అప్పుడు నేను వచ్చాను అని ప్రసాద్‌ చెప్పగానే అయ్యో ఇదంతా నా కల అని భూమి సిగ్గు పడుతుంది. ఏమ్మా కల కంటున్నావా..? అని ప్రసాద్‌ అడగ్గానే పోండి మామయ్య మీరు ఇలా ఏడిపించకూడదు అంటుంది. ఇదంతా వెనక నుంచి వింటున్న చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు. భూమి తన గురించే మాట్లాడుతుందని సంతోషంగా ఎగిరి గంతేస్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!