Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర వాళ్లు టిఫిన్ చేసి అందరూ వెళ్లిపోతుంటే అప్పుడే గగన్ తన కారులో ఉదయ్‌ని డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. ఉదయ్ ఇంట్లోకి వెళ్లి శరత్ చంద్రను విష్ చేస్తాడు. శరత్ చంద్ర కూడా ఉదయ్ ని విష్ చేస్తాడు.
శరత్: ఒకమాట ముందే చెప్పి ఉంటే మీ కోసం వెయిట్ చేసేవాళ్లం కదా అందరం కలిసి టిఫిన్ చేసేవాళ్లం.
ఉదయ్: భూమితో కలిసి టిఫిన్ టైం ఇంకా రాలేనట్టు ఉంది అంకుల్ అందుకే నేను చెప్పలేదు. హాయ్ భూమి మై నేమ్ ఈజ్ ఉదయ్. ఇందాక మీతో ఫోన్‌లో మాట్లాడింది నేనే..
భూమి: నమస్తే అండి..
ఉదయ్: వావ్ ఐయామ్ ఇంప్రెస్డ్. మీరు పెట్టిన నమస్కారంలో మీ సంస్కారం. అంకుల్ గారి పెంపకం నాకు తెలుస్తున్నాయ భూమి. హాయ్ అంటే హాయ్ అనే ఈ రోజుల్లో హాయ్ అటే నమస్కారం పెట్టే నీ లాంటి అమ్మాయి భార్యగా దొరకడం నా అదృష్టం.
శరత్: ఏంటి భూమి అల్లుడు గారు అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడాలి కదా..? ఏదో ఒకటి మాట్లాడు.
ఉదయ్: ఫోర్స్ చేయోద్దు అంకుల్. కల్చర్ ట్రెడిషన్ ఫాలో అయ్యే భూమి లాంటి అమ్మాయి అంత త్వరగా ఎవరితోనూ కలవదని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడేగా జర్నీ స్టార్ట్ చేశాం. కలిసి నడుస్తుంటే నెమ్మదిగా కలిసిపోతుంది.
శరత్: అబ్బా ఎంత బాగా చెప్పావు ఉదయ్. ఒకే ఒక్క చూపుతో మా భూమిని చదివేశారు. ఫ్యూచర్‌లో మీరిద్దరు బెస్ట్ కపుల్ అవుతారు.
ఉదయ్: భూమి అంకుల్ నీకు చెప్పారో లేదో కానీ నేనైతే నీ డాన్స్‌కు పెద్ద ఫ్యాన్‌ను
శరత్: అవును అవును చెప్పడం మర్చిపోయాను.
ఉదయ్: భూమి కాంపిటీషన్‌లో నువ్వు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఫ్రోగ్రాంలో నేను అటెండ్ అయ్యాను. సో ఐయామ్ ఇంప్రెస్డ్.
శరత్: ఉదయ్ నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే.. నిన్ను అంతగా అభిమానిస్తుంటే..కనీసం కర్టసీకైనా థాంక్స్ చెప్పాలి కదా..?
భూమి: థాంక్స్ అండి..
ఉదయ్: మరి నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నాను కదా..? నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వవా..? ఫ్లీజ్.
శరత్: అమ్మా భూమి చేయమ్మా..
ఉదయ్: ప్లీజ్ భూమి..
భూమి: చేతి మీదా..?
ఉదయ్: అవును..
భూమి: ఏదైనా పేపర్ మీద రాసిస్తాను.
ఉదయ్: నో.. నీ చేతి రాత స్పర్శ నా చేతి మీద పడుతున్నప్పుడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో నాకు చెక్ చేయాలని ఉంది.
అపూర్వ: ఏంటి భూమి అంతలా ఆలోచిస్తున్నావు. మన ఇంటకి కాబోయే అల్లుడే కదా..?
అని అపూర్వ చెప్పగానే.. భూమి పెన్ను తీసుకుని భూమి అని రాస్తుంది.
ఉదయ్: అదేంటి ఉత్తి భూమి అనే రాశావు. ఎవరైనా విత్ లవ్ అని చేస్తారు. భూమి నీ పేరుపైన విత్ లవ్ అని రాయి.
శరత్: ఫార్మాలిటీ కదమ్మా రాయి..
భూమి: అంటే.. నాన్నా..
అంటూ విత్ లవ్ అని రాస్తుంది భూమి.
ఉదయ్: థాంక్యూ భూమి నువ్వు రెడీ అయి వస్తే మనం షాపింగ్‌కు వెళ్దాం.
భూమి: అదేంటి ఇప్పుడు షాపింగ్ ఏంటి..?
శరత్: షాపింగ్‌కు వెళ్లమని చెప్పాను కదా భూమి వెళ్లండి.. అపూర్వ నువ్వు ఉదయ్‌కి టిఫిన్ పెట్టు.
అనగానే సరేనని వెళ్తుంది. తర్వాత కావ్య పేపర్‌లో వచ్చిన శోభాచంద్ర నాట్య కళాశాల ప్రారంభం అనే న్యూస్ చూసి కోపంతో రగిలిపోతుంది. ఇంతలో అక్కడకు అపూర్వ వస్తుంది. కావ్య, భూమిని చంపేయాలనుకుంటున్నట్టు చెప్తుంది. అపూర్వ సపోర్టు చేస్తానంటుంది. తర్వాత భూమి, శివతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కావ్య రౌడీలతో వచ్చి కారుతో యాక్సిడెంట్ చేయిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!