Meghasandesam Serial Today Episode:  డాన్స్‌ అకాడమీలో పిల్లల మధ్య బర్తుడే వేడుకలు సెలబ్రేట్‌ చేసుకుంటుంది శారద. చాటు నుంచి చూస్తూ ఎమోషనల్ అవుతారు కేపీ, భూమి. శారద్‌, గగన్‌ ఇద్దరూ కలిసి పిల్లలతో డాన్స్‌ చేస్తుంటారు.

గగన్: హ్యాపీ బర్తుడే అమ్మా.. ( శారద ఎమోషనల్‌గా ఏడుస్తుంది) అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నావు. సర్‌ఫ్రైజ్‌తో నిన్ను సంతోషపెట్టాలి అనుకుంటే నువ్వే ఏడిస్తే ఎలా అమ్మా..?

శారద: ఇది ఏడుపు కాదు నాన్న నవ్వు.. నవ్వి నవ్వి చచ్చిపోతానేమోనన్న పెద్ద సంతోషపు నవ్వు.. కాకపోతే కన్నీటి రూపంలో బయటకు వస్తుందిరా..? నా బర్తుడే మర్చిపోయావేమో అనుకుని నేను చాలా బాధపడ్డానురా..? దొంగ వెధవలు ఈ శివ పూర్ణి కూడా బాగా యాక్ట్‌ చేశారు.

పూర్ణి: అమ్మా ప్లానంతా అన్నయ్యది. అన్నయ్య ఏం చెబితే అదే చేశాము. సరే అమ్మా వన్స్‌ ఎగైన్‌ హ్యాపీ బర్తుడే..

అని చెప్తారు. తర్వాత పిల్లలు డాన్స్‌ చేస్తుంటారు. శారద చూస్తుంది. ఇంతలో అక్కడ భూమి డాన్స్‌ చేస్తున్నట్టు ఊహించుకుంటుంది శారద.

గగన్‌: అమ్మా.. ఏంటి… అటు చూడు..

శారద: ఏం లేదు.. నాన్న ఏం లేదు.

తర్వాత అందరూ కలిసి కేక్ కట్‌ చేస్తారు. కేపీ, భూమి ఎమోషనల్‌గా ఏడుస్తుంటారు. కేపీ తనకు పెళ్లైన రోజులు గుర్తు చేసుకుంటాడు. శారదతో కలసి గుడికి వెళ్లిన రోజు గుర్తు చేసుకుంటాడు.

గగన్‌: అమ్మా నీకో సర్‌ఫ్రైజ్‌ అమ్మా..

శారద: ఏంటి నాన్నా అది..

అనగానే గగన్‌ తన చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలతో ఒక అల్బమ్‌ చేసి ఇస్తాడు. ఆ ఫోటోలు చూసిన శారద మరింత ఎమోషనల్‌ అవుతుంది.

శారద: గొప్ప గిఫ్టురా.. దీనికి బదులుగా నేను ఏమి ఇవ్వగలనో నాకు అర్థం కావడం లేదు.

గగన్: అమ్మా మళ్లీ నువ్వు నాకు ఇచ్చేదేముంది. నాకు జన్మను ఇచ్చావు కదా..? అంతకంటే గొప్ప గిఫ్ట్‌ నాకు ఎవరైనా ఇవ్వగలరా..? స్టూడెంట్స్‌ మనందరికి తెలిసిన ఒక మాట. అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించాడు. దేవుడు నిజమా, అబద్దమా నాకు తెలియదు కానీ అమ్మ మాత్రం నిజం. ఈరోజు మా అమ్మ గురించి మీ అందరికీ చెప్తాను.

శారద: నేను కూడా నీ గురించి వీళ్లందరికీ చెప్పాలిరా..?

గగన్‌: చెప్పుదువులే.. ముందు నేను చెప్తాను.. నాతో పాటు నువ్వు చెప్పు

అంటూ ఇద్దరూ కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటుంటే దూరంనుంచి చూస్తున్న కేపీ ఎమోషనల్ అవుతాడు. తాను మీరాను పెళ్లి చేసుకున్న రోజుల్లో శారద, పిల్లలు ఎవరో తనకు తెలియదని చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి కూడా వెనకాలే వెళ్లిపోతుంది.

కేపీ: భూమి నా కొడుకు వాళ్ల అమ్మకు బర్తుడే పార్టీ చేయడం వాడు శారదకు సర్‌ప్రైజ్‌ గా ఇచ్చిన గిప్ట్‌. ఇదంతా నేను కళ్లారా చూడటం నువ్వు నాకిచ్చిన గిఫ్ట్‌. చాలా సంతోషంగా ఉంది. ఇక వెళ్తానమ్మా..?

భూమి: మామయ్యా ఆగండి మిమ్మల్ని ఇంతదూరం తీసుకొచ్చింది ఇది చూపించడానికే అనుకుంటున్నారా..? అత్తయ్యతో కలిసి మిమ్మల్ని గుడకి పంపించాలని ప్లాన్‌ చేశాను. మీరు అత్తయ్యకు ఫోన్‌ చేయండి మామయ్య.

అంటుంది. కేపీ వద్దని చెప్తాడు. కానీ భూమి బలవంతంగా ఇద్దరినీ కలిపి గుడికి పంపిస్తుంది. కేపీ తన స్కూటర్‌ మీద శారదను తీసుకుని వెళ్తాడు. తన చేతులతో శారదను ఎత్తుకుని గుడిలోకి వెళ్తుంటే సుజాత చూసి అపూర్వకు ఫోన్‌ చేసి చెప్తుంది. అపూర్వ వెళ్లి శరత్ చంద్రకు చెప్పగానే శరత్‌ చంద్ర గన్ తీసుకుని శారదను చంపేస్తానని వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!