Meghasandesam Serial Today Episode: భూమి డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కోసం గగన్‌తో కలిసి వెళ్లడానికి శరత్ చంద్ర ఒప్పుకోడు దీంతో భూమి బాధపడుతుంటే ఉదయ్ కల్పించుకుని శరత్‌చంద్రను ఒప్పిస్తాడు. దీంతో భూమి కొంచెం హ్యాపీగా ఫీలవుతుంది. హాస్పిటల్ బిల్ కట్టి వస్తానని శరత్ చంద్ర వెళ్లిపోతాడు.
భూమి: థాంక్స్ అండి..
ఉదయ్: దేనికి..?
భూమి: మా నాన్నను డాన్స్ అకాడమీ ఓపెనింగ్స్ కు ఒప్పించినందుకు.
ఉదయ్: అంకుల్ వద్దన్నప్పుడు నీ కళ్లల్లో కన్నీళ్లు చూశాను భూమి. ఆ కన్నీళ్లు చూడలేకే అంకుల్‌ను ఒప్పించాను. నువ్వంటే నాకు అంత ఇష్టం భూమి.. చూశావా నీ ఆటోగ్రాఫ్ అలాగే ఉంది.
అంటూ తన చేసి మీద భూమితో చేయించుకున్న ఆటోగ్రాఫ్ చూపిస్తాడు. భూమి ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు గగన్ వర్క్ చేసుకుంటూ భూమిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. భూమి తనకు ఎదురుగా వచ్చినట్టు ఫీలవుతాడు.
గగన్: ఎలా భూమి నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు. మర్చిపోవడానికి నీ దగ్గర ఏదైనా మందు ఉంటే నాకు ఇవ్వు.. నువ్వు అలా నవ్వితే కుదరదు.. నాకు సమాధానం కావాలి. చెప్పు భూమి చెప్పు భూమి
అంటూ ఒక్కడే గట్టిగా అరుస్తుంటాడు. తర్వాత తేరుకుని తనను తాను తిట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గగన్. ఆ పక్కనే సాధన వెయిట్ చేస్తుంటుంది. అపూర్వ, సుజాత వస్తారు.
సుజాత: కంగ్రాచ్యులేషన్స్ సాధన మా భూమిని సక్సెస్‌ఫుల్‌గా చంపేశావు. మా అపూర్వ నీ అంతటిది కాదని నిరూపించావు.
సాధన: ఏంటి పిన్ని గారు వెటకారంగా ఉందా..?
అపూర్వ: పిన్ని వెటకారాన్ని పక్కనబెడితే తమరు మాత్రం ఏం పీకారు…? చెప్పు నేను సీరియస్‌గా అడుగుతున్నాను. ఆ భూమిని చంపేస్తాను.. అవసరం అయితే నా చేతులతో నేను దాని పీక పిసికి చంపేస్తాను అని ఓ మొరిగావు కదా..? ఏం పీకావు..?
సాధన: ఏం చేయమంటారు మేడం పక్కాగా ప్లాన్ చేశాను. గన్‌షాట్‌గా చస్తుందని నమ్మాను. కానీ ఆఖరి నిమిషంలో ఎవడో దాని తమ్ముడు కాపాడేశాడు. టైంకి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. లేదంటే కచ్చితంగా చచ్చేది.
అని చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇన్ని రోజులు ఆ గగన్ గాడు కాపాడాడు.. ఇప్పుడు దాని తమ్ముడు ఉన్నాడా..? అంటుంది. దీంతో సుజాత కూడా అవునమ్మాయి భూమిని కాపాడింది దాని తమ్ముడే అంటుంది. కట్ చేస్తే భూమి ఇంట్లో శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి ఉంటుంది.
భూమి: డాన్స్ అకాడమీ ఓపెనింగ కూడా గగన్ బావ చేతుల మీదుగా జరిగితే బాగా రన్ అవుతుందని నా నమ్మకం అమ్మ.. నీ ఆశీర్వాదం ఉంటే.. బావ తప్పకుండా ఒప్పుకుంటాడమ్మ..
అని మాట్లాడుతుంది. ఇంతలో శోభాచంద్ర ఫోటో మీద నుంచి పువ్వు కింద పడుతుంది. దీంతో భూమి హ్యపీగా పీలవుతుంది. నవ్వుతూ బయటకు వెళ్లి గగన్‌కు కాల్ చేస్తుంది.
గగన్: ఏంటి..? ( కోపంగా..)
భూమి: ఈ రోజు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదా బావ..
గగన్: అయితే ఏంటి..? ( కోపంగా)
భూమి: డాన్స్ అకాడమీని మీరే ఓపెనింగ్ చేయాలి.
గగన్: ఎవరితోనైనా ఓపెన్ చేయించుకో నేను మాత్రం ఓపెన్ చేయను..
భూమి: అలా అనకండి బావ.. ఫ్లీజ్..
అంటూ భూమి రిక్వెస్ట్ చేయగానే.. గగన్‌కు శారద చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దీంతో గగన్ సరే చేస్తాను అని చెప్తాడు. గగన్ సరే చెప్పడంతో భూమి హ్యపీగా ఫీలవుతుంది. అంతా దూరం నుంచి గమనిస్తున్న అపూర్వ.. ఇక అకాడమీ క్లోజ్ అవుతుందని సుజతతో చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!