MeghasandesamSerial Today Episode: బయటి నుంచి శరత్‌ చంద్ర రావడం చూసిన సుజాత లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చి శరత్‌ చంద్ర వస్తున్నాడని చెప్తుంది. దీంతో అన్ని పక్కకు పెట్టేసిన నక్షత్ర ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అపూర్వ ఓదారుస్తున్నట్టు నటిస్తుంది. శరత్‌ లోపలికి వచ్చేస్తాడు.

Continues below advertisement

శరత్: అపూర్వ ఏమైంది ఎందుకు నక్షత్ర ఏడుస్తుంది.

అపూర్వ: ఏం లేదులే బావ అది కాసేపు ఏడ్చి ఊరుకుంటుందిలే..

Continues below advertisement

నక్షత్ర: ఊరుకుంటానో.. ఉరేసుకుంటానో.. నాకేం అవసరం లేదులే.. నా గొంతు కోసి మీరు చేతులు దులిపేసుకున్నారు కదా..

సుజాత: అవేం మాటలే పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా ఏంటి..?

శరత్‌: ఏం జరిగిందో చెప్పండి ముందు ఎందుకు ఏడుస్తున్నావు నక్షత్ర.

అపూర్వ: ఏం లేదులే బావ. అది మన ఇంటి గౌరవానికి సంబంధించింది. నీకు తెలియకపోవడమే మంచిది. ఆ చేదు నిజాన్ని ఈ నాలుగు గోడల మధ్యే సమాధి చేసేద్దాం.

నక్షత్ర: దాని పక్కనే నా శవాన్ని కూడా సమాధి చేయండి. పీడ పోతుంది.

సుజాత: అయ్యయ్యో నువ్వు అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకు. పైన తథాస్తు దేవతలు ఉంటారు.

అపూర్వ: పిన్ని..

శరత్‌: అపూర్వ చెప్తావా..? చెప్పవా..?

అపూర్వ: చెప్పకూడదు అని కాదు బావ. కానీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది కదా అని ఆగిపోతున్నాను.

శరత్‌: ఏంటో చెప్పు..

అపూర్వ: మన అల్లుడు చెర్రి కరెక్ట్‌ కాదు బావ.

శరత్‌: అంటే..

నక్షత్ర: అంటే అంటావేంటి డాడీ. మీ ఫ్రెండ్‌ కూతురు లిల్లీ వచ్చి చెప్పింది కదా..? ఆయన చేసిన ఘనకార్యం గురించి.

శరత్‌: అదంతా నిజమా కాదా త్వరలోనే తేలుస్తాను. నిజమని తేలితే..

నక్షత్ర: నిజం డాడీ.. వాడి బుద్ది నీచపు బుద్ది. చెట్టుకు చీర కట్టినా ముట్టుకుని మురిసిపోయే రకం వాడు.

సుజాత: ఏమిలి అమ్మాయి నువ్వు అనేది.

అపూర్వ: అవును పిన్ని నిజమే వాడు ఆ లిల్లీని ఇబ్బంది పెట్టడం నేను కూడా చాలా సార్లు నా కళ్లారా చూశాను.

నక్షత్ర: వద్దు వద్దు అని చాలా సార్లు చెప్పాను కానీ నన్నే చెప్పుతో కొడతానన్నాడు. ఇప్పుడు గెస్ట్‌ హౌస్‌ చూపిస్తానని తీసుకెళ్లి పాపం ఆ లిల్లీని పాడు చేశాడు.

అపూర్వ: సరే బావ అయిందేదో అయిపోయింది. నక్షత్ర చూడు జైలు నుంచి వచ్చాక మీ డాడీ వాడికి బాగా గడ్డి పెడతాడులే..

నక్షత్ర: ఏమీ అవసరం లేదు. వాడు ఎంత చెప్పినా వినడు.  వాడు కుక్క తోక వంకర టైపు. అప్పుడే నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పాను. మీరే వినలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి నేను సిద్దంగా లేను.

శరత్‌: సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు.

నక్షత్ర: నాకు ఆ చెర్రితో విడాకులు కావాలి.

శరత్‌: విడాకులా..?

నక్షత్ర: అవును నాకు విడాకులు కావాలి.. కావాలి..  

అంటూ నక్షత్ర ఏడుస్తుంటే.. ఏం చెప్పాలో అర్తం కాక శరత్‌ చంద్ర అలాగే చూస్తుండిపోతాడు. అపూర్వ, సుజాత ముసి ముసిగా నవ్వుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!