MeghasandesamSerial Today Episode: చేతికి మల్లెపూలు పెట్టుకుని నక్షత్ర కోసం ఎదురుచూస్తుంటాడు చెర్రి. ఎన్నో రోజులు ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను. ఆ క్షణం రానే వచ్చింది అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటాడు. లోపల నేను గడిపే ప్రతిక్షణం లైఫంగా గుర్తుండిపోవాలి కమాన్‌ రా చెర్రిగా అనుకుంటూ ఉంటాడు.  మరోవైపు నక్షత్ర తన గదిలోకి వెళ్తుంటే.. భూమి చూసి వెళ్లి ఆగు అంటుంది. నక్షత్ర ఆగిపోతుంది.

Continues below advertisement

భూమి: నీ గదిలోకి వెళ్తున్నావేంటి..? చెర్రి గదిలోకి కదా.. వెళ్లాలి

నక్షత్ర: చెర్రి గదిలోకి నేనెందుకు వెళ్తాను..

Continues below advertisement

భూమి: ఎందుకంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి.

నక్షత్ర: అయినా నువ్వు చెప్తే నేను వినాలా.? నేను వినను. వెళ్లను

అపూర్వ: ఏంటి ఏమైంది..? ఇప్పుడు..?

నక్షత్ర: చూడు మమ్మీ నన్ను చెర్రి గదిలోకి వెళ్లి పడుకోమంటుంది.

అపూర్వ: చూడు నువ్వు ఎవ్వరి విషయంలోనైనా ఇన్వాల్‌ అవ్వు ఐడోంట్‌ కేర్‌. కానీ నా కూతురు విషయంలో తల దూర్చావంటే మర్యాదగా ఉండదు మరి.

భూమి: ఆహా.. మీరు మాత్రం అందరి జీవితాల్లో తల దూర్చోచ్చు. మేము మాత్రం తల దూర్చకూడదు. ఇప్పుడు నక్షత్ర నీ కూతురు కాదు. చెర్రి భార్య. తన మీద పూర్తి హక్కులు చెర్రికే ఉన్నాయి.

అపూర్వ: నేను ఒప్పుకోను..

భూమి: నీ అరుపులకు భయపడేవారు ఎవ్వరూ లేరిక్కడ. అక్కడ లిల్లీ నోరు తెరిచిందో నీ సీక్రెట్స్‌ అన్ని భయటపడతాయి.

అపూర్వ: ఏయ్‌ ఆపు వింటున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు.  

భూమి: నాన్నా… నాన్నా..

అని పిలవగానే. శరత్‌ చంద్ర వస్తాడు.

శరత్: చెప్పు భూమి ఏంటి పిలుస్తున్నావు..?

భూమి: చూడు నాన్న పాపం నక్షత్ర చెర్రితో ఉండాలని ఆశపడుతుంటే.. పిన్ని అడ్డు పడుతుంది.

నక్షత్ర: ఆ నేనెప్పుడు అన్నాను..

భూమి: అన్నావు కదా..?

శరత్‌: అపూర్వ వాళ్లిద్దరు భార్యాభర్తలు వాళ్లిద్దరి మధ్యలోకి వెళ్లే హక్కు మనకు లేదు. వెళ్లు నత్రక్ష.

భూమి: వెళ్లు నక్షత్ర నీ మనసులో ఉన్న ఫీలింగ్స్‌ మొత్తం చెర్రితో షేర్‌ చేసుకో..

శరత్‌: వాళ్లను ఎవ్వరూ డిస్టర్బ్‌ చేయకండి.

అపూర్వ: అలాగే బావ..

అని అపూర్వ చెప్పగానే.. శరత్‌ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి సరిపోయిందా..? పిన్ని నువ్వు ఎక్కువ డిస్టర్బ్‌ అవ్వకు.. నన్ను ఎక్కువ డిస్టర్బ్‌ చేయకు అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు రూంలోకి వెళ్లిన నక్షత్రను చూసి చెర్రి గట్టిగా హగ్‌ చేసుకుంటాడు.

నక్షత్ర: ఏయ్‌ వదులు.. వదులు..

చెర్రి: వదలడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుంది.

నక్షత్ర: నేను మాత్రం నిన్ను వదిలించుకోవడానికే చూస్తున్నాను.

చెర్రి: ఏయ్‌ ఏమన్నావు.. అంటే నువ్వు లోపలికి ఇష్టపడుతూ రాలేదా..?

నక్షత్ర: ఆ భూమి మా డాడీ వెళ్లమంటే చాలా కష్టంగా వచ్చాను.

చెర్రి: ఓ ఎలాగయితే ఏం లోపలికి అయితే వచ్చావు అన్నమాట. ఈ రాత్రికి మాత్రం తగ్గేదేలేదు

అంటూ నక్షత్రను మళ్లీ గట్టిగా హగ్‌ చేసుకుంటాడు చెర్రి.  దీంతో నక్షత్ర కోపంగా విదిలించుకుని పారిపోతుంది. అయినా చెర్రి విడవకుండా నక్షత్రను గట్టిగా హగ్‌ చేసుకుంటుంటాడు. అప్పుడే బయట అపూర్వ పవర్‌ ఆఫ్‌ చేస్తుంది. దీంతో నక్షత్ర తెలివిగా చెర్రిని బాత్రూంలో వేసి బయటి నుంచి లాక్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!