MeghasandesamSerial Today Episode: కేపీని హాస్పిటల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చారని భూమి, శారదకు ఫోన్‌ చేసి చెప్తుంది. శారద, కేపీకి మందు పెట్టిందని అందుకు పరిష్కారం సూచించమని ఒక స్వామిజీని ఇంటికి పిలుస్తుంది మీరా. అప్పుడే భూమి వీడియో కాల్ ఓపెన్ చేసి శారదకు చూపిస్తుంది. ఇంటికి వచ్చిన స్వామిజీ శారద ఏం చేయలేదని కేపీకే మృత్యు గండం ఉందని మాంగళ్య వ్రతం చేయాలని మీరాకు చెప్తాడు. ఆ విషయం వినగానే.. శారద షాక్‌ అవుతుంది. భూమి పక్కకు వెళ్తుంది.

Continues below advertisement

భూమి: చూశారా అత్తయ్యా మీరు మామయ్యకు మందు పెట్టారని తీసుకొచ్చిన స్వామిజీ ఏం చెప్పారో ఆ వ్రతం మీరు కూడా చేయాలి అత్తయ్య.

శారద: నేనా..? ఎలా చేయాలి..?

Continues below advertisement

భూమి: అత్తయ్య ప్రేమకు మనసు ముఖ్యం మామయ్య మనసు ఎక్కడుందో మనకు బాగా తెలుసు. ఆ వ్రత ఫలితంతోనైనా నా ఆశ

శారద: మేమిద్దరం కలవడం అనేది జరిగే పనేనా..?

భూమి: ఎందుకు జరగదు. మీ ఇద్దరి ప్రేమ నిజం మధ్యలో ఉన్న వాళ్లు తప్పుకుంటే చాలు.

శారద: అయితే నువ్వు కూడా చేయ్‌ భూమి. నువ్వు గగన్‌ కలిస్తే బాగుంటుంది.

భూమి: మా పరిస్థితి వేరు అత్తయ్యా బావ ఇప్పుడు నన్ను నమ్మటం లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.

శారద: అమ్మ భూమి వాడి కోపం అబద్దం. నీ మీద ప్రేమే నిజం. ఎప్పటికైనా నువ్వు గగన్ కలుస్తారమ్మ ఆ నమ్మకం నాకుంది.

అంటూ భూమితో శారద చెప్తుండగానే.. అప్పుడే వాళ్ల ఇంటికి ధృవ్‌, తార వస్తారు. వాళ్లను చూసి శారద షాక్‌ అవుతుంది.

శారద: ఆ అన్నాచెల్లెలు వచ్చారు భూమి.

భూమి: ఏంటి తార వచ్చిందా..?

శారద: అవును వచ్చారు భూమి..

భూమి: అత్తయ్య నేను లైన్‌ లోనే ఉంటాను మీరు వీడియో చూపించండి..

అనగానే శారద అలాగే అమ్మా అంటూ చూపిస్తుంది. ఇంతలో తార వెళ్లి గగన్ పక్కన కూర్చుటుంది. అది చూసిన భూమి కోపంగా అత్తయ్య దాన్ని బావ పక్కలోంచి లాగేసేయ్‌.. నా బావ పక్కనే కూర్చుంటుందా..? అది అంటూ భూమి తిడుతుంటే.. ఎక్కడో ఉండి వీడియోలో చూస్తున్న నీకే అంతలా ఉంటే నాకెలా ఉంటుంది భూమి అంటూ శారద వాళ్ల దగ్గరకు వెళ్తుంది. అప్పుడే పూర్ణి వస్తుంది.

తార: హాయ్‌ పూరి.. హాయ్‌ అత్తయ్యా.. ఏంటి డల్లుగా ఉన్నావు..?

ధృవ్‌: నువ్వు కూడా వీడియో చూశావా…? అందుకే అలా ఉన్నావా..? ఐ కెన్ అండస్టాండ్‌..

గగన్‌: ఇలా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తే మనకు ఇక ప్రైవసీ ఎక్కడ ఉటుంది. దీనివల్ల నా చెల్లి కాలేజీకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక అవమానం జరుగుతుంటే నా చెల్లి నాలుగు గోడల మధ్య ఉండాల్సి వస్తుంది.

తార: నీ ఎక్స్‌ వైప్‌ పూరి పెళ్లి ఆపితే వాళ్ల తమ్ముడు పూరి కాలేజీకి వెళ్లకుండా చేశాడు. అక్కాతమ్ముళ్లు కలిసి పూరి జీవితంతో ఆడుకుంటున్నారు.

శారద: ఇందులో వాళ్ల తప్పేం లేదురా..?

గగన్‌: తప్పు లేదా..? అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మ..

అంటూ గగన్‌ అడగ్గానే.. అవున్నా పెళ్లి కాబోయే అమ్మాయిని పట్టుకుని అంత మంది ముందు అలా చెబితే ఎలా అంటూ శారద చెప్పగానే.. పెళ్లి చేసుకునే వాళ్లు చెప్పడంలో తప్పేముంది అనగానే శారద, వీడియో చూస్తున్న భూమి షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!