MeghasandesamSerial Today Episode: గుడి దగ్గర పూజలు చేస్తున్న శారదను చూసిన మీరా దగ్గరకు వెళ్లి తిడుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదా..? ఇంటికి తీసుకెళ్లి ఎంత అవమానించినా నీకు సిగ్గు రాలేదా..? రోజు రోజుకు ఇంత దిగజారిపోతున్నావు ఎందుకు అంటూ తిట్టగానే.. శారద కోపంగా

Continues below advertisement

శారద: మీరా నోరు అదుపులో పెట్టుకో.. నేను నీకు ఏం అన్యాయం చేశాను. ఎందుకు అవమానిస్తున్నావు. చెప్తున్నాను కదా నేను ఆయన్ని రమ్మనలేదు. నేను వచ్చింది కూడా ఆయన కోసం కాదు. దేవుడి దగ్గర కూడా నాకు మనఃశాంతి లేకుండా చేస్తున్నావు. ఇంకా మాట్లాడాలి అంటే ముందు ఆయన నాకు తాళి కట్టారు. ధర్మంగా ఆలోచిస్తే నేనే ఆయన భార్యను కానీ నువ్వు ఆయన్ని నాకు దూరం చేసి ఇప్పుడు నన్నే అంటున్నావు. ఇది నీకు న్యాయంగా అనిపిస్తుంది.

మీరా: ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆయన నీ భర్త కాదు నా భర్త.

Continues below advertisement

అంటూ కోపంగా తన చేతిలో ఉన్న కొబ్బరికాయను శారద మీదకు వేస్తుంది. వెంటనే కేపీ అడ్డుగా వెళ్తాడు. దీంతో కేపీ తలకు గాయం అయి కింద పడిపోతాడు. మీరా షాక్‌ అవుతుంది.

శారద: ఏవండి.. ఏవండి..

మీరా: వద్దు నా భర్తను మీరు ముట్టుకోవద్దు.. మీరు ముట్టుకోవద్దు..

శారద: హాస్పిటల్‌ కు తీసుకెళ్దాం ఎవరైనా సాయం చేయండి..

మీరా: ఏయ్‌ నీ సహాయం నాకు అవసరం లేదు. ఎవరైనా రండి సాయం చేయండి.

అంటూ పిలవగానే.. అక్కడున్న వాళ్లు కేపీని తీసుకుని హాస్పిటల్‌ వెళ్తారు. మరోవైపు గగన్‌, భూమి హాస్పిటల్‌ లో కూర్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి ఇందు వస్తుంది.

ఇందు: అరే అన్నయ్య కూడా వచ్చాడా వదిన అయితే నేను నెల తప్పానని అన్నయ్యకు చెప్పావా..?

భూమి: చెప్పలేదు..

ఇందు: సరే అయితే నేను చెప్పేస్తాను ఉండు..

భూమి: వద్దు.. చంపేస్తాడు..

ఇందు: గుడ్‌ న్యూస్‌ చెబితే ఎందుకు చంపుతాడు.

భూమి: నిన్ను కాదు నన్ను..

ఇందు: ఏంటి ఎందుకు చంపుతాడు.

భూమి: ఈ రిపోర్ట్స్‌ నావి నేను నెల తప్పాను అని మీ అన్నయ్యకు చెప్పాను.

ఇందు: ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నేను నెల తప్పితే నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పావా..?

భూమి: మరేం చేయను.. పూరి పెళ్లి చేయడం కోసం ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్‌ అయిపోయాడు. అందుకే.. నా దగ్గర ఏ ఫ్రూప్‌ లేవు. ఈ రిపోర్ట్స్‌ చూపించి అలా చెప్పాను. ఇందు ఫ్లీజ్‌ నువ్వు కూడా అలాగే మెయింటెన్‌ చేయవా.?

అని చెప్పగానే ఇందు సరే వదిన అంటుంది. ఇద్దరు కలిసి గగన్‌ దగ్గరకు వెళ్తారు. గగన్‌ ఇందును చూసి పలకరిస్తాడు.

గగన్‌: ఇందు నువ్వేంటి ఇక్కడ..?

భూమి: నేను చెకప్‌ చేయించుకోవడానికి తోడుగా ఇందును తీసుకొచ్చాను బావ. పద బావ.. అందరికీ చెప్పాలి కదా అత్తయ్యతో కూడా చెప్పాలి రా బావ. రా

అంటూ గగన్‌ను తీసుకుని బయటకు వెళ్తుంటారు. అక్కడే వంశీ స్వీట్లు పంచుతుంటాడు. గగన్‌, భూమి రాగానే గగన్‌కు కూడా స్వీట్లు ఇస్తాడు. దీంతో భూమి, ఇందు షాక్‌ అవుతారు.

గగన్‌: ఇట్స్ ఓకే వంశీ నేను ఇప్పుడు తినేంత సంతోషంగా లేను.

వంశీ: అదేంటి బావగారు నేను తండ్రిని కాబోతున్నానని స్వీట్లు పంచుతుంటే మీరు అలా ఉంటే ఎలా..?

గగన్: వాట్‌ నువ్వు తండ్రివి కాబోతున్నావా..?

వంశీ: చెప్పు ఇందు మీ అన్నయ్యకు చెప్పలేదా..? బావ మీ చెల్లికి మూడో నెల ఇప్పుడే డాక్టర్‌ కన్ఫం చేశారు. రిపోర్ట్స్‌ కూడా ఉన్నాయి. ఇవిగో..

గగన్‌: ఇవి ఇందు రిపోర్ట్సా..?

వంశీ: అవును..

అనగానే.. గగన్‌ డాక్టర్‌ను పిలిచి ఈ రిపోర్ట్స్‌ ఎవరివి అని అడగ్గానే.. ఇవి మీ రిపోర్ట్సే కదా ఆల్‌ రెడీ చెప్పాను కదా అంటూ డాక్టర్‌ వెళ్లిపోతుంది. దీంతో గగన్ కోపంగా భూమిని చూస్తుంటాడు. భూమి ఏదో చెప్పబోతుంటే.. గగన్‌ కోట్టబోతుంటే ఇందు ఆపేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!