Meghasandesam Serial Today Episode: భూమి శరత్‌చంద్ర దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటే బిందు వచ్చి భూమి అత్తయ్య నిన్ను పిలుస్తుంది అని చెప్తుంది. దీంతో ఎందుకంట అని భూమి అడగ్గానే.. ఏమో తెలియదు భూమి కానీ చాలా సీరియస్‌గా ఉంది అని చెప్తుంది బిందు. దీంతో భూమి సరే పదా అని బయటకు వెళ్తుంది. భూమి బయటకు రాగానే అపూర్వ కోపంగా చూస్తుంది.

Continues below advertisement


అపూర్వ:  ఆ రండి మేడం రండి తమరి గురించే వెయిటింగ్‌.. ఈ ఇంటి పరువు ఏ రోజుకు ఆ రోజు తీసేస్తానని శపథం చేసినట్టు ఉంది.


భూమి: ఇప్పుడు ఏమైంది పిన్ని.


అపూర్వ: ఇంకా ఏం కావాలమ్మా మన ఇంటి పరువు ఏ రూపంలో తీసే అవకాశం వచ్చినా వదులుకోడుగా ఆ గగన్‌ గాడు. ఏదో ప్రెస్‌ మీట్‌ పెట్టి లైవ్‌లో మాట్లాడబోతున్నాడని ఇప్పుడే నాకు ఫోన్‌ వచ్చింది.  ఎలా మన పరువు తీయబోతున్నాడే చూడండి అందరూ చూడండి.


అని చెప్పి టీవీ ఆన్‌ చేస్తుంది అపూర్వ. టీవీలో గగన్‌ ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతుంటాడు.


గగన్‌: పిలవగానే వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీడియా అంటే నాకు చాలా రెస్పెక్ట్‌ ఉంది. కానీ కొన్ని మీడియాలు ఇతరులు గౌరవ మర్యాదలు తీయడానికే ముందు ఉంటాయి. అందుకే అలాంటి వాళ్లను తప్పా మిమ్మల్ని పిలిచాను.


అపూర్వ: అబ్బో వీడేదో మన గౌరవం తీయబోవడం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు.


గగన్‌: ఈరోజు ఈ ప్రెస్‌ మీట్‌ ఎందుకు పెట్టానో ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది.


రిపోర్టర్‌: నిన్న మీ గురించి భూమి గారి గురించి లైవ్‌లో చాలా హల్‌చల్‌ అయింది కదా..? దాని గురించి అనుకుంటున్నాము.


గగన్‌: అవును మీరు కరెక్టు.. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చోట ఉందంటే వాళ్ల మధ్య ఏదో జరిగిపోయిందని మీడియా ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్టు అని అడుగుతున్నాను.


రిపోర్టర్‌: జరిగిపోయిందేదో జరిగిపోయిందని ఆ చానెల్‌ నైజం అంతే అని సరిపెట్టుకోవడం తప్పా.. ఏం చేయగలం. మీరు చెప్పినట్టుగానే మీతో పాటు ఆ భూమి గారి గౌరవం కూడా దెబ్బతింది. దీనికి సొల్యూషన్‌ ఏంటో చెప్పగలరా..?


గగన్‌: ఏముంటుందండి సొల్యూషన్‌.. వాళ్లు అలా ప్రచారం చేశారని ఇప్పుడు నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా..? ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి వాళ్లు చేసిన ప్రచారం అంతా నిజం అని ఒప్పుకున్నట్టే కదా..? నా మీద బ్యాడ్‌గా ప్రచారం చేశారో వాళ్లందరి మీద కోర్టులో వంద కోట్లు పరువునష్టం దావా వేద్దామనుకుంటున్నాను.


అపూర్వ: చూశావా పిన్ని వీడి డబ్బు పిచ్చి. పోయిన మన పరువు మీద వాడు పునాది వేసుకుని సంపాదించాలనుకుంటున్నాడు. లేకి మనుషుల బుద్ది ఇలాగే ఉంటుంది కదా..?


సుజాత: బాగా చెప్పావు అమ్మాయి.


గగన్‌: కోర్టులో వంద కోట్లకు పరువునష్టం దావా వేస్తే మా గురించి ఆ మీడియా చేసింది అబద్దం అని ఆయన అందుకే అంత కాన్ఫిడెంట్‌గా కేసు వేశారని కనీసం సగం మందైనా నమ్మడం మొదలుపెడతారు. కానీ ఇంకో సగం మంది ఉంటారే వారిని ఎలా నమ్మించాలి. నమ్మించలేం. కానీ భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఒకరిద్దరు తప్పా మా నిజాయితీని అందరూ నమ్ముతారు కదా..?


రిపోర్టర్‌: మీరు చెప్పింది నిజమే సార్‌. మీరు ఆ పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ నిజాయితీని ఎవ్వరూ శంకించలేరు.


గగన్‌: కానీ ఇక్కడ ఇంకో  ప్లాబ్లమ్‌ ఉందండి. భూమి ఒక అపరిచత వ్యక్తి అనుకోండి పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తను నా బద్ద శత్రువు కూతురు కదా ఎలా పెళ్లి చేసుకుంటాను.


రిపోర్టర్‌: సార్‌ మరి దీనికి సొల్యూషన్‌ ఏమీ లేదా..?


అని రిపోర్టర్‌ అడగ్గానే.. భూమి నాకు పరిచయం అయినప్పుడు తను శరత్చంద్ర కూతురని తెలియదు. ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఈ రోజు చెప్తున్నాను భూమిని పెళ్లి చేసుకుంటున్నాను. అని చెప్పగానే భూమి, ప్రసాద్‌, మీరా, చెర్రి హ్యాపీగా ఫీలవుతారు. అపూర్వ, నక్షత్ర షాక్‌ అవుతారు. తర్వాత భూమి గగన్‌ ఇంటికి వెళ్తుంది. భూమిని చూసిన పూరి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఏమైందని భూమి అడగ్గానే నీకు కాబోయే ఆయన పేరు చెప్పి అప్పుడు లోపలికి అడుగుపెట్టు అంటుంది. దీంతో భూమి గగన్‌ అంటూ పేరు చెప్పి సిగ్గు పడుతూ పరుగెత్తుకుంటూ గగన్‌ రూంలోకి వెళ్లి గగన్‌కు డాష్‌ ఇస్తుంది. దీంతో ఇద్దరూ బెడ్‌ మీద పడిపోతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!