Meghasandesam Serial Today Episode: శరత్‌చంద్ర కేసులో పోలీసులు చెర్రిని తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేస్తారు. అయితే చెర్రి తాను శరత్ చంద్ర దగ్గరకు వెళ్లాక ఏం మాట్లాడింది చెప్తాడు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పగానే పోలీసులు ప్రశ్నార్థకంగా చూస్తుంటారు.
చెర్రి: మామయ్యను చంపేసేంత కోపంతో వెళ్లినా ఆయన్ని చూడగానే నా కోపం ఆవిరైపోయింది మేడం. ఎందుకంటే ఆయనంటే మాకు రెస్పెక్టే కాదు మేడం భయం కూడా.
పోలీస్: ఏం రాజేందర్ మరి చరణ్ మాటలు నమ్మొచ్చు అంటావా..?
రాజేందర్: నాకైతీ ఈయన మాటలు నమ్మొచ్చు అనిపిస్తుంది మేడం.
పోలీస్: చూడండి చరణ్ చంపేసేంత కోపంతో వెళ్లి తర్వాత భయపడిపోయాను అంటున్నారు. అలా కాకుండా కాస్త ధైర్యం చేసి మాట్లాడి ఉండొచ్చు కదా..? మాట మాట పెరిగి మీ మామయ్యను తోసేస్తే ఆయన విరిగిన బాటిల్ మీద యాక్సిడెంటల్‌గా పడి ఉండొచ్చు కదా..? అలా అనుకుంటే మీరే ఈ క్రైం చేసినట్టు అవుతుంది కదా..?
చెర్రి: సరే మేడం మీరు చెప్పినట్టే జరిగింది అనుకుందాం. కానీ యాక్సిడెంటల్‌గా మామయ్య బాటిల్ మీద పడిపోతే బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన్ని నేను ఎలా వదిలేసి వెళ్లిపోతాను మేడం.
పోలీస్: ఓకే మిస్టర్ చరణ్ యు కెన్ గో..
చెర్రి: థాంక్యూ మేడం వస్తాను.
పోలీస్: కానీ నేను పిలిచినప్పుడు రావాలి.
చెర్రి: వస్తాను మేడం..
పోలీస్: ఈ చరణ్ విషయంలో మీ ఒపీనియన్ ఏటి రాజేందర్.
రాజేందర్: ఈ అబ్బాయి కచ్చితంగా మర్డర్ చేయలేదని నాకు బలంగా అనిపిస్తుంది మేడం.
పోలీస్: యాక్సిడెంటల్‌గా జరిగినా కూడా అలా వదిలేసి ఎలా వెళ్లగలను అని అడిగినప్పుడే తన సిన్సియారిటీ ఏంటో అర్థం అవుతుంది. ఇక మనకు మిగిలి ఉన్న సస్పక్ట్ గగన్. శరత్ చంద్ర ఒప్పుకోడు కనక తన ప్రేమ ఫలించదు అన్న కోపం ఉంటుంది. లెట్స్ టార్గెట్ గగన్.
అంటూ ఆఫీసర్ చెప్తుంది. మరోవైపు భూమిని తీసుకుని శరత్ చంద్ర ఇంటికి వస్తాడు గగన్. గగన్ కూడా ఇంట్లోకి వెళ్లబోతుంటే.. భూమి మీరెక్కడికి అన అడుగుతుంది. మళ్లీ అపూర్వ నిన్ను టచ్ చేయాలంటే భయపడేలా చేస్తాను అంటూ గగన్ లోపలికి వెళ్తాడు. భూమితో కలిసి వచ్చిన గగన్‌ను చూసిన అపూర్వ, నక్షత్ర షాక్ అవుతారు.
గగన్: ఏం అపూర్వ చావాల్సిన వాళ్లు నీ చావును వెతుక్కుంటూ వచ్చినట్టు షాక్ అయ్యావా..?
అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు నేను షాక్ అవ్వడం ఏంట్రా.. ఈ అపూర్వను చూసి ఒకరు షాక్ అవ్వాల్సిందే తప్పా నేను షాక్ అవ్వను.
గగన్: ఓకే మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి.
సుజాత: మా అమ్మాయిన పక్కకు తీసుకెళ్లి చంపేస్తావా ఏంటి అబ్బాయి.
గగన్: చీచీ చావు తెలివి తేటలు మీకుంటాయి కానీ నాకు కాదు. ఏం అపూర్వ నువ్వు వస్తావా..? నన్ను పోలీస్ స్టేషన్‌కు వెళ్లమంటావా..?
అపూర్వ: ఆగు ఏం అవసరం లేదు పద..
అని ఇద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు. వెళ్లాక గగన్ తనతో నక్షత్ర వీడియో కాల్‌తో అపూర్వ, భూమిని చంపేస్తుంది అని చెప్పిన వీడియో చూపిస్తాడు. దీంతో అపూర్వ షాక్ అవుతుంది. ఇంకొక్కసారి నువ్వు భూమిని ఏం చేసినా ఈ వీడియో పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. నువ్వు జైల్లో ఉంటావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు గగన్. తర్వాత గగన్, భూమి కోల్డ్ స్టోరేజీలో ఉన్న వీడియో న్యూస్ చానెల్స్‌లో వస్తుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు.
అపూర్వ: ఈ స్థాయిలో మన పరువు బజారుకు ఎక్కితే.. ఇక మన పిల్లల పెళ్లిల్లు అవుతాయా..?
ప్రసాద్: అవుతాయి. ఈ ఇంటి పరువు పోయిందనేగా మీ బాధ. భూమి గగన్‌ల పెళ్లి జరిగితే.. ప్రేమించుకున్న వాళ్లు పెళ్లి చేసుకున్నారు అంటారు. పెళ్లికి ముందే తిరిగారు అన్న ఒక్కమాటతో పోయిన పరువు వాళ్ల పెళ్లితో మళ్లీ భద్రంగా ఈ ఇంటికే తిరిగి వస్తుంది. గగన్‌కు అంతా తెలుసు కదా వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పు
అని ప్రసాద్ భూమికి చెప్పగానే.. భూమి అలాగే ఏడుస్తుంది. అపూర్వ మాత్రం భూమిని ప్రసాద్‌ను తిడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!