MeghasandesamSerial Today Episode: అపూర్వ బాత్రూంలోకి కరెంట్‌ వైరుతో షాక్‌ తగిలేలా చేసి బయటకు వస్తుంది భూమి. బయటకు వచ్చిన భూమిన చూసి కేపీ షాక్‌ అవుతాడు. అపూర్వ రూంలో ఏం చేస్తున్నావమ్మా అంటూ అవతల వాళ్లు వచ్చేసి ఉంటారు. సంబంధం కాయం అయిపోతే మళ్లీ నువ్వు వాణ్ని కలవలేవు అమ్మ అంటాడు.

Continues below advertisement

భూమి: మామయ్య అపూర్వ బాత్రూం టాప్‌ కు కరెంట్ కనెక్షన్‌ ఇచ్చాను. ఇప్పుడు ఆ అపూర్వకు కరెంట్‌ షాక్‌ కొట్టేలా చేయాలి మామయ్య.

కేపీ: ఎలా చేస్తావమ్మా..?

Continues below advertisement

భూమి: నేను చూసుకుంటాను మామయ్య..

అంటూ భూమి వెళ్లిపోతుంది. కింద హాల్లో ఉన్న భూమి దగ్గరకు వెళ్లిన భూమి అపూర్వను చూస్తుంటుంది.

అపూర్వ: ( మనసులో) గగన్‌ గాడి దగ్గరకు వెళ్లి.. తన హెల్ప్‌ తో చెర్రి గాడిని బయటకు తీసుకురావాలనుకుంటున్నావా..?

భూమి: ( మనసులో) ఎంత పని చేశావు అపూర్వ. అవతల మా బావకు మరో సంబంధం కుదురుతుందంటే నన్ను గది కూడా దాటనివ్వలేదు కదా..?

అపూర్వ: ( మనసులో) అడుగు కూడా బయట పెట్టనివ్వనే నేను. ఏం చేస్తావో చూస్తాను.

భూమి: ( మనసులో) నీకు చావు పరిచయం చేసైనా సరే నేను వెళ్లడం ఖాయం.

ఇంతలో జ్యూస్‌ తీసుకుని వస్తుంది సుజాత

సుజాత: అమ్మాయి ఇదిగో చల్లగా జ్యూస్‌ తీసుకుని వచ్చాను తాగు..

నక్షత్ర: నాకు లేదా జ్యూస్‌ గోరింటాకు..

అపూర్వ: దానికే ఇవ్వు..

సుజాత: ఇదిగో తాగు అమ్మాయి.

భూమి: ( మనసులో) చెర్రి అరెస్ట్‌ అయ్యాడన్న బాధే లేదు. అయినా డైవర్స్‌ అవ్వాలని కోరుకునే వాళ్లకు ఏముంది బాధ.

అపూర్వ: బేబీ కూర్చుని తాగు.

అనగానే.. నక్షత్ర సరే అంటూ కూర్చోవడానికి వెళ్తుంటే.. భూమి కాలు అడ్డం పెడుతుంది. నక్షత్ర జ్యూస్‌ గ్లాస్‌తో వెళ్లి అపూర్వ మీద పడుతుంది. అపూర్వ, నక్షత్రను తిడుతుంది.

భూమి: పిన్ని వెళ్లి వాష్‌ చేసుకో

అపూర్వ: నాకు తెలుసులే ( మనసులో నన్ను వాష్‌ రూంకు పంపించి ఇది వెల్లిపోవాలని ప్లాన్‌ చేసిందేమో...?) బేబీ నువ్వు ఇక్కడే కూర్చో.. దీన్ని మాత్రం ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వకు. ఇది మీ డాడీ ఆర్డర్‌.

నక్షత్ర: నేను చూసుకుంటాను మమ్మీ నువ్వు వెళ్లు..

భూమి: సరేలే నేను ఎక్కడికి వెళ్లను నువ్వు వెళ్లి వాష్‌ చేసుకో

అని చెప్పగానే.. అపూర్వ వెళ్లిపోతుంది. భూమి మాత్రం అంకెలు లెక్క పెడుతుంది. వన్‌, టూ అనగానే.. నక్షత్ర కోపంగా ఏంటే నన్ను చూసి కౌంట్‌డౌన్‌ చేస్తున్నావు.. అనగానే.. భూమి త్రీ అంటుంది. వెంటనే అపూర్వకు కరెంట్‌ షాక్‌ తగిలి గట్టిగా అరుస్తుంటుంది. ఆ సౌండ్‌కు నక్షత్ర మమ్మీ అంటూ పైకి పరుగెత్తుకుంటూ వెళ్లి అపూర్వను పట్టుకుంటుంది. నక్షత్ర కూడా కరెంట్‌ షాక్‌తో అల్లాడిపోతుంది. అప్పుడే భూమి పైకి వస్తుంది.

భూమి: అయ్యయ్యో కరెంట్ షాక్‌ కొట్టినట్టు ఉందే..? ఓకే ఓకే మెయిన్‌ ఎక్కడుందో ఆఫ్‌ చేసి వస్తాను.

అంటూ వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత అయ్యో ఇద్దరికి కరెంట్‌ షాక్‌ కొట్టినట్టు ఉంది. కరెంట్‌ షాక్‌ కొట్టినప్పుడు ఏం చేయాలి కర్రతో కొట్టాలి అనుకుంటూ వెళ్లి కర్ర తీసుకొస్తుంది. అప్పుడే భూమి స్విచ్చాప్‌ చేస్తుంది. సుజాత కర్రతో గట్టిగా అపూర్వను కొడుతుంది. అపూర్వ కింద పడిపోతుంది. అందరూ కంగారుపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!