Janaki Kalaganaledhu July 28th: గోవిందరాజులు జానకి విషయంలో జ్ఞానంబ పెట్టిన కండిషన్స్ పట్ల నిరాశ చెందుతూ ఉంటాడు. జానకి విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని జ్ఞానంబతో అంటాడు. కానీ ఆమె మాత్రం తన కోడలి మంచి కోసమే అని.. ఈ కుటుంబ గౌరవం కోసమే అలా చేశాను అని చెబుతుంది. గతంలో తన తమ్ముడికి విషయంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటిదే తన కొడుకు విషయంలో జరగకూడదన్న భయంతో మాత్రమే కండిషన్ పెట్టాను అని చెబుతుంది.


ఇక గోవిందరాజులు నువ్వు ప్రమాణం చేయకుండా కూడా జానకి నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అని అంటాడు. జానకి మంచితనం గురించి తనకు తెలుసు అని.. కానీ ఇతరుల వల్ల ఎప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు అందుకే ముందు జాగ్రత్త తోనే ఇలా చేశాను తప్ప తనపై ఎటువంటి ద్వేషం లేదు అని అంటుంది. మరోవైపు జానకి జ్ఞానంబ పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకోవటంతో రామ కూడా తొందర పడ్డావు జానకి అని అంటాడు.


దానితో జానకి అత్తయ్య పెట్టిన కండిషన్లో తొందరపడటం మంచిదే అని కాస్త ఆలస్యమైన తమ మధ్య దూరం పెరిగేది అని.. ఇంట్లో ఉండి కూడా లేనట్లే అని అంటుంది. ఇక ఆ కండిషన్ విషయంలో తనకు ఎటువంటి బాధ లేదని రామకు ధైర్యం ఇస్తుంది. భవిష్యత్తులో ఏదైనా పొరపాటు జరిగితే ఎలా అని రామ భయపడుతూ అడగటంతో.. ఇప్పుడు జరిగేవి మాత్రమే చూసుకుంటాను కానీ భవిష్యత్తులో జరిగే ఆటంకాల గురించి ఇప్పుడు ఎందుకు అని అంటుంది.


తననుండి ఎటువంటి తప్పు రాదు అని ధైర్యం ఇవ్వటంతో రామ కాస్త కుదుట పడినట్లు కనిపిస్తాడు. ఆ తర్వాత జానకి తన టోపి ని తీసి రామకు పెట్టి సెల్యూట్ కొడుతుంది. ఇక రామ జానకిని ప్రేమగా దగ్గరికి తీసుకొని తన కాళ్ళకు పట్టీలు పెడతాడు. ఇక ఇంటి బయట మల్లిక తన అత్త జానకి విషయంలో చేసిన కండిషన్ గురించి నీలావతి తో మాట్లాడుతూ ఉంటుంది. తన అత్త ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు అని.. తన కొడుకు విషయంలో భయపడి జానకికి అలా కండిషన్ పెట్టిందేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు.


ఇక నీలావతి ఇప్పుడు మీ ఇంట్లో బీభత్సం వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అంటుంది. దాంతో మల్లిక ఆ ఆటంకం వచ్చే వరకు ఆగడం ఎందుకు ఇప్పుడే ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది అంటూ ముప్పు పెట్టడానికి ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే మలయాళం తనను భోజనానికి పిలుస్తాడు. రాకపోతే అమ్మగారు తిడతారు అనడంతో భయపడి మళ్ళీ లోపలికి వెళుతుంది.


అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జానకికి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది తన అత్త. భోజనం చేద్దాము అనటంతో వెన్నెల్లో వచ్చాకే జానకితో కలిసి భోజనం చేయాలి అని అంటుంది జ్ఞానంబ. ఈమధ్య వెన్నెల చదువు పట్ల బాగా శ్రద్ధ పెట్టి ఎవరి మాట వినటం లేదు అని అంటుంది. మలయాళం నువ్వు వెళ్ళి పిలుచుకొని రమ్మని అనడంతో తన మాట కూడా వినదు అని అంటాడు మలయాళం. దాంతో జ్ఞానంబ కాస్త అనుమానంగా ముఖం పెడుతూ కనిపిస్తుంది.


also read it : Trinayani July 27th: ‘త్రినయని’ సీరియల్: తిలోత్తమా మరోసారి కొట్టిన షాక్.. నయని ఇచ్చిన కుండను పగలగొట్టిన సుమన


Join Us on Telegram: https://t.me/abpdesamofficial