Lakshmi Nivasam Serial Today Episode Review: ఖుషీని ఇంట్లోకి తీసుకురావడంపై తులసి అన్న, వదినలు ఆమెపై చిందులు తొక్కుతుంటారు. ఖుషీ బాధ్యత తాను తీసుకుంటానని తులసి వారికి కచ్చితంగా చెబుతుంది. ఆ యాక్సిడెంట్ చేసిన వారిని వదిలిపెట్టనని తులసి జానుతో అంటుంది. ఖుషీ రాకతో తులసి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని లక్ష్మి, శ్రీనివాస్ బాధ పడుతుంటారు. ఇదే సమయంలో యాక్సిడెంట్ కప్పిపుచ్చేందుకు ఎస్సై, డాక్టర్‌కు బసవ లంచం ఇస్తాడు. ఇది గమనించిన బసవ కోడలు సిద్ధుకు ఈ విషయం చెబుతుంది. దీంతో సిద్ధు ఆలోచనలో పడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
తులసి పెళ్లి కోసం లక్ష్మీ, శ్రీనివాస్ వేదన
ఖుషీ ఇంటి బయట బాధతో కూర్చుండగా.. రామం తులసికి చెప్తాడు. తులసి వచ్చి ఖుషీని అడగ్గా.. తనతో అమ్మ, నాన్న ఇద్దరూ ఎప్పుడూ ఉండరని.. చిన్నప్పుడు నాన్న ఉంటే అమ్మ ఉండేది కాదని బాధ పడుతుంది. ఈ మాటలు విన్న తులసి వేదనకు గురవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మీ, శ్రీనివాస్.. ఖుషీకి నాన్న తోడు కావాలని పెళ్లి కోసం ఆలోచించాలని తులసికి చెప్తారు. అయితే, ఖుషీని చూసుకునేందుకు తులసికి సాయం చేద్దామని జాను అంటుంది. అక్క చేయి పట్టుకునేందుకు ఏ దేవుడు వస్తాడో చూద్దామని చెప్తుంది. దీంతో అంతా ఆలోచనలో పడతారు.
మరోవైపు, సుపర్ణిక, భార్గవ్.. శ్రీకాంత్, వసుంధర కార్యక్రమాలు చేస్తుంటారు. భార్గవ్ ఏడుస్తున్నట్లు నటించి తాను అనుకున్నది నెరవేరిందని.. ఈ ఆస్తి మొత్తం ఇక తనదేనని మనసులో అనుకుంటాడు.
భార్గవ్ దొరికిపోతాడా..
ఇదే సమయంలో భార్గవ్ యాక్సిడెంట్‌కు సహాయం చేసిన వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన భార్గవ్ ఒక్కసారిగా షాక్‌కు గురై అతన్ని 'ఇంటి వరకూ వచ్చావేంటి?' అని ప్రశ్నిస్తాడు. బ్యాలెన్స్ డబ్బులివ్వాలని భార్గవ్‌ను అడుగుతాడు. డబ్బులు తర్వాత ఇస్తానని అతనికి చెప్తాడు. బ్యాలెన్స్ సెటిల్ చేయకపోతే యాక్సిడెంట్ విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు. ఇదే టైంలో సుపర్ణిక అక్కడకు వస్తుంది. అయితే, కారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వచ్చాడని సద్ది చెప్పేస్తాడు భార్గవ్.
బాధలో జాను.. ధైర్యం చెప్పిన విశ్వ
కాలేజీకి వెళ్లిన జాను.. తన అక్క గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంది. అదే సమయంలో అక్కడికి విశ్వ, అతని ఫ్రెండ్స్ వస్తారు. తులసిది చాలా మంది మనసని.. బెటర్ లైఫ్ ఉంటుందని ధైర్యం చెప్తాడు. కాలేజీ కల్చరల్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుదామని జానుతో అంటాడు విశ్వ. ఈ పరిస్థితిలో రాలేనని జాను అనడంతో ఆమెకు నచ్చచెప్పి తీసుకువెళ్తాడు.
తులసి కోసం లక్ష్మి మొక్కులు
తులసి జీవితం బాగుపడాలని లక్ష్మీ శివాలయంలో అభిషేకం చేస్తుంది. తులసికి శ్రీతో ఎంగేజ్మెంట్ జరగడం, పెళ్లిపీటల వరకూ వచ్చి వారికి ప్రమాదం జరిగి శ్రీ, వసుంధర చనిపోవడం గురించి ఆలోచిస్తుంది. ఇదే సమయంలో పూజారి ఎందుకమ్మా అలా నీళ్లు ఎక్కువ అభిషేకం చేస్తున్నావంటూ లక్ష్మిని ప్రశ్నిస్తాడు. ఓర్పుతో ఉండాలని కష్టాలు గట్టెక్కుతాయని పూజారి లక్ష్మికి ధైర్యం చెప్తాడు. లక్ష్మి అలా అభిషేకం చేస్తూనే సొమ్మసిల్లి పడిబోతుండగా.. సిద్ధు అక్కడికి వస్తాడు. అక్క అంటూ ఆమెను పట్టుకుంటాడు. తులసి లక్ష్మి కూతురే అని సిద్ధుకు తెలుస్తుందా.?, తాను చేసిన యాక్సిడెంట్ వల్లే ఇలా జరిగిందని తెలుసుకుంటాడా.?, సిద్ధు రాకతో సిద్ధు జీవితం మళ్లీ గాడిన పడుతుందా.? అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.