Lakshmi Nivasam Serial Today Episode Review: లక్ష్మి ఇంట్లో తులసి పెళ్లి పనుల హడావుడి జరుగుతుంటుంది. లక్ష్మి, శ్రీనివాస్ తన కోడలు కీర్తి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లగా.. వారిని బసవ, అతని తల్లి అవమానిస్తారు. లక్ష్మి ఎవరో తెలియకుండానే ఆవిడను అక్క అని పిలుస్తోన్న సిద్ధు వారిని చూడడం మిస్ అవుతాడు. మరోవైపు, తన అక్క తులసి పెళ్లికి విశ్వతో పాటు అతని స్నేహితులను సైతం ఆహ్వానిస్తుంది జాను. ఇదే సమయంలో ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు విశ్వ. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
తాత ఇంటికి వెళ్లిన జాను..
తన అక్క తులసి పెళ్లికి ఆహ్వానించేందుకు.. జాను విశ్వ ఇంటికి వెళ్తుంది. విశ్వ తన తండ్రి విజయేంద్ర, తల్లి త్రివేణి, తాతలను పరిచయం చేస్తాడు. అందరినీ పలకరించిన తర్వాత జాను పెళ్లి పత్రికను వారికి అందిస్తుంది. పెద్దల ఆశీర్వాదం బలంగా ఉంటే ఆడపిల్ల కాపురం సంతోషంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారని.. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలని వారిని ఆహ్వానిస్తుంది. ఇదే సమయంలో విజయేంద్ర తండ్రి.. లక్ష్మి గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఈ లోపు కంప్యూటర్ అసైన్‌మెంట్ చేయిస్తానని.. విశ్వతో పాటు వెళ్తుంది జాను. ఇదే సమయంలో ఆ అమ్మాయిని చూస్తుంటే సొంత మనుషులను చూసినట్లే ఉందని త్రివేణి విజయేంద్రతో అంటుంది. ఆమెను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఎవరో అని అంటాడు.
పెళ్లి కార్డు చూడడం మిస్ అయ్యారుగా..
పెళ్లి కార్డును చూస్తే జాను తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోతుందని చెప్పగా.. విజయేంద్ర కార్డ్ ఓపెన్ చేస్తాడు. అదే టైంలో సరిగ్గా కనిపించక కళ్ల జోడు తీసుకురావాలని త్రివేణికి చెప్తాడు విజయేంద్ర. ఆమె వెళ్తుండగా.. కార్డు పొరపాటున నీటిలో పడిపోతుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని విజయేంద్ర ఆమెపై అరుస్తాడు.
మరోవైపు, తులసితో శ్రీ పెళ్లి ఆపేందుకు సుపర్ణిక, ఆమె భర్త భార్గవ్ ప్లాన్ చేస్తారు. పెళ్లి జరగదని.. దానికి తాను ఓ ప్లాన్ వేశానని చెప్తాడు సుపర్ణిక భర్త. ఎవరికో ఫోన్ చేసి తాను ప్లాన్ చేసిన విషయం తన భార్య సుపర్ణికకు కూడా తెలియదని.. ప్లాన్ అప్లై చేయమని చెప్తాడు.
వధూవరులుగా శ్రీ, తులసి..
ఇదే సమయంలో పెళ్లి పనుల్లో లక్ష్మి బిజీగా ఉంటుంది. అన్నీ కష్టాలు తీరిపోయాయని.. తన అమ్మతో శ్రీనివాస్ అంటాడు. ఈలోపు వసు.. శ్రీకు బాసికం కట్టి వరుడిగా రెడీ చేస్తుంది. తానే తన నాన్నకు కాటుక పెడతానంటూ ఖుషీ పట్టుబడుతుంది. సెల్ఫీలు దిగుతూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ముహూర్తానికి టైం అవుతుందంటూ బయల్దేరతారు.
తులసిని సైతం వధువుగా జాను అందంగా రెడీ చేస్తుంది. ఇదే టైంలో తోడికోడళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటుంటారు. ఇదే టైంలో భోజనాల దగ్గర శ్రీనివాస్ పెద్ద కొడుకు కొబ్బరికాయల కోసం కక్కుర్తి పడతాడు.
తులసి పెళ్లికి త్రివేణి
తులసి పెళ్లికి విజయేంద్ర భార్య త్రివేణి వెళ్తుండగా.. ఎక్కడికని అడగకూడదని విజయేంద్ర అంటాడు. లక్ష్మి కూతురు తులసికి ఈ రోజు పెళ్లని.. మీ మేనకోడలి పెళ్లికి తానైనా వెళ్తానని అంటుంది. దీంతో విజయేంద్ర ఆమెపై చేయి చేసుకుంటాడు. 30 ఏళ్ల కిందట లక్ష్మి వేరే పెళ్లి చేసుకుని వచ్చినందుకే తన తండ్రి రెండు కాళ్లు పడిపోయాయని.. ఇప్పుడు నువ్వు ఆ పెళ్లికి వెళ్తే రెండు కాళ్లు విరిచేస్తానని.. విజయేంద్ర త్రివేణికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ త్రివేణి లోపలికి వెళ్లిపోతుంది.
పెళ్లి కోసం శ్రీ బయలుదేరుతుండగా భోరున వర్షం కురుస్తుంటుంది. అందరం ఒకే కారులో వెళ్దామని శ్రీ అనగా.. సుపర్ణిక, భార్గవ్ తాము గిఫ్ట్ కొనాలని.. వేరే కారులో వస్తామని చెప్తారు. దీంతో సరే అంటూ శ్రీ, వసు, ఖుషి కారులో బయల్దేరుతారు. ఆ తులసిని పెళ్లి కూతురిలా చూడాలా అంటూ.? సుపర్ణిక విసుక్కోగా.. ఇది చివరి చూపు సుప్పూ.. అంటూ భార్గవ్ మనసులో అనుకుంటాడు. మరి శ్రీని చంపేందుకు భార్గవ్ ఏమైనా ప్లాన్ చేశాడా..? అసలు శ్రీ, తులసి పెళ్లి జరుగుతుందా.? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.