Lakshmi Nivasam Serial Today Episode: ఓ వైపు తులసి జాబ్ ప్రయత్నాల్లో ఉంటుంది. మరోవైపు, జానుకు లవ్ ప్రపోజ్ చేయాలని విశ్వ ప్రయత్నిస్తాడు. అయితే, జానుకు ఓ బుట్టలో లెటర్‌తో పాటు గిఫ్ట్ ఇవ్వాలని చూడగా అది ఎక్కడో మిస్ అయిపోతుంది. దాన్ని వెతికాలని చూడగా.. ఇదే సమయంలో జాను జైతో కారులో వెళ్లిపోతుంది. దీంతో బాధకు గురవుతాడు విశ్వ. మరోవైపు, తులసి ఓ ఆఫీస్‌లో ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. అయితే, ఆ ఆఫీసర్ ఆమెను తప్పుడు దృష్టితో చూస్తూ ఆమె దగ్గరకు వెళ్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

సడన్‌గా సిద్ధు ఎంట్రీ..

తనకు పెన్షన్ ఇప్పించాలని ఓ వృద్ధురాలు అడగ్గా ఆ ఆఫీసర్ కసురుకుంటాడు. ఇంతలో ఆఫీసర్ నిజ స్వరూపం తెలియక తులసి ప్యూన్ సూచన మేరకు అదే ఆఫీస్‌లో వేరే గదిలోకి వెళ్తుంది. ఇంతలో సిద్ధు అదే ఆఫీస్‌కు వచ్చి పెద్దావిడకు పెన్షన్ ఇచ్చేందుకు లంచం ఎందుకు అడుగుతున్నావంటూ ఆఫీసర్‌ను చితక్కొడతాడు. 

తులసి దృష్టిలో విలన్‌గా..

సిద్ధు మంచి చేసేందుకే ఆఫీసర్‌ను కొట్టాడన్న నిజం తెలియని తులసి అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడని ఆఫీసర్‌ను అడుగుతుంది. తన సార్ మంచి చేసినందుకే అతను కొట్టాడని.. దీని వల్ల మీకు ఉద్యోగం రాకుండా పోయిందంటూ తులసితో అంటాడు ప్యూన్. ఆ తర్వాత ఆఫీసర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తాడు. దీంతో తులసి సిద్ధుపై కోపంతో బాధతో అక్కడికి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో జానును జై తన కారులో ఇంటి వద్ద దిగబెడతాడు. తనకు కాంపిటీషన్స్‌లో వచ్చిన గిఫ్ట్స్ గురించి జైకు చెబుతుంది జాను.

లక్ష్మీ, శ్రీనివాస్‌ల ఇంటికి బసవ

మరోవైపు, లక్ష్మీ, శ్రీనివాస్‌ల ఇంటికి బసవ వెళ్తాడు. ఇది చూసి కీర్తి సంబరపడిపోతుంది. వాళ్లను చూసి లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఆశ్చర్యపోతూ వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. యాక్సిడెంట్ గురించి ఏమైనా ఆరా తీస్తున్నారేమో అని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానంటూ బసవ మనసులో అనుకుంటాడు. యాక్సిడెంట్ గురించి తనకు తెలిసిందని.. మీరు బాధలో ఉన్నారనే ఉండలేక వచ్చినట్లు లక్ష్మీ, శ్రీనివాస్‌లతో అంటాడు. 

తాను ఎలాంటివి మనసులో పెట్టుకోలేదని.. ఇక అంతా మర్చిపోదామని లక్ష్మీ, శ్రీనివాస్‌లతో అంటాడు బసవ. దీనికి బసవ అల్లుడితో పాటు అంతా సరే అంటారు. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. తమ పెద్దమ్మాయి అని తులసిని లక్ష్మీ, శ్రీనివాస్‌లు బసవకు పరిచయం చేస్తారు. ఆమెను చూసి సిద్ధు చేసిన యాక్సిడెంట్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందని బసవ అనుకుంటాడు. 

బసవను టెన్షన్ పెట్టిన తులసి

తులసికి మంచి జాబ్ వేయిస్తానని బసవ అంటాడు. అయితే, యాక్సిడెంట్ చేసిన వారు ఎవరో తెలియదని.. వారిని కనిపెట్టాలని తులసి బసవతో అంటుంది. మరోవైపు.. కీర్తి వాళ్ల ఇంటికి వెళ్లాడని తెలుసుకున్న సిద్ధు వారిపై కోపంతో ఉంటాడు. బసవకు ఫోన్ చేయగా కాల్ కట్ చేస్తాడు. వారిని పట్టుకోవాలని లక్ష్మీ ఫ్యామిలీ బసవను కోరుతుంది. 

యాక్సిడెంట్ చేసిన వాడెవడో మనకు తెలియదని.. కోర్టు, కేసులంటూ తిరగడానికి జీవిత కాలం అయిపోతుందని బసవ అంటాడు. తులసికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని బసవ అంటాడు. అయితే, తాను ఉద్యోగం తెచ్చుకుంటానని.. యాక్సిడెంట్ చేసిన వాడిని కచ్చితంగా పట్టుకోవాలని అంటుంది. దీంతో బసవ టెన్షన్‌లో పడతాడు. అసలు సిద్ధుకు నిజం తెలిసిందా?, తులసి భవిష్యత్ ఏంటి? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.