Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఇంట్లో నుంచి హడావుడిగా బయటకు వెళ్తున్న లక్ష్మీని సూర్యానారాయణ ఎక్కడికమ్మా ఇంత హడావుడిగా వెళ్తున్నావని అడుగుతాడు. నేను కాపాడి ట్రీట్‌మెంట్ చేయిస్తున్న అతనికి ఇవాళ ఆపరేషన్ చేస్తున్నారని...దానికి సంబంధించిన పేపర్లపై సంతకాలు పెట్టాలని నర్సు ఫోన్ చేస్తే వెళ్తున్నానని అంటుంది. వెంటనే మధుబాబును పిలిచి లక్ష్మీని తీసుకెళ్లి పని పూర్తయిన తర్వాత మళ్లీ ఇంటికి తీసుకుని రమ్మని చెబుతాడు. నాకు వేరే పని ఉందని చెప్పగా....సూర్యనారాయణ గట్టిగా అరిచి చెప్పింది చేయమని చెబుతాడు. దీంతో లక్ష్మీని తీసుకుని మ్యాడీ బయటకు వెళ్తాడు. ఇదే ఛాన్స్‌కోసం ప్రియంవద ఎదురుచూస్తుంటుంది. బయటకు వెళ్లిన తర్వాత మ్యాడీ నాకు ఆడిషన్ ఉందని...నువ్వు ఆటోలో వెళ్లిపొమ్మని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ప్రియంవద ఊపిరి పీల్చుకుంటుంది. మ్యాడీ బైక్‌పై తీసుకెళ్తే....నేను ఫాలో అవ్వడం కష్టమయ్యేదని,కానీ ఇప్పుడు ఆటోలో వెళ్తుంది కాబట్టి వెనకే వెళ్తానని అనుకుంటుంది                       శ్రీలక్ష్మీ ఆటోలో వెళ్తుండగా....వెనకే ప్రియంవద కారులో ఫాలో అవుతుంది. దారిలోనే రౌడీలకు ఫోన్‌చేసి మనకు కావాల్సినవాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందని...లైవ్‌ లొకేషన్ పెడతాను రమ్మని చెప్పి లక్ష్మీనే ఫాలో అవుతూ వెళ్తుంది. లక్ష్మీ ఓ ఆస్పత్రి వద్ద ఆగడంతో ఇక్కడ దాచిపెట్టావా అని అనుకుటుంది. నువ్వు ఊరికి కొత్త అయినప్పటికీ బాగానే దాచిపెట్టావని ప్రియంవద అనుకుంటుంది. వెంటనే లోపలికి వెళ్లి కాగితాలపై సంతకం పెట్టి ఆపరేషన్ చేయమని చెబుతుంది.వెంటనే వైద్యులు ఆపరేషన్ చేస్తారు. అతను కోమాలో నుంచి బయటకు రాగానే లక్ష్మీ లోపలికి వెళ్లి మాట్లాడుతుంది. మీరు ఎవరని..మీ పేరు ఏంటని అడుగుతుంది.అతను మత్తులో నా కూతురు నాకూతురు అంటుండటంతో ఇతనికి కూతురు ఉందేమోనని లక్ష్మీ అనుకుంటుంది. మీ కూతురు పేరు ఏంటని....భార్య పేరేంటని అడుగుతుంది. అతను భార్య పేరు చెప్పేలోగా మత్తులోకి జారుకుంటాడు.                      ఇంతలో ప్రియంవద పిలిపించిన రౌడీలు అక్కడికి రాగానే...ప్రియంవద వాళ్లకు అన్ని విషయాలు చెబుతుంది. మనం కిడ్నాప్ చేయాల్సిన మనిషి ఇక్కడే ఉన్నాడని చెబుతుంది. వాడిని కాపాడిన అమ్మాయి కూడా ఇక్కడే ఉందని చెప్పగా...ఆ రాక్షాసి ఉండగా వాడిని కిడ్నాప్ చేయడం కుదరదని రౌడీలు అంటారు. దాన్ని ఇక్కడ నుంచి నేను పంపిస్తానని చెప్పి..లక్ష్మీకి కాల్‌ చేసి నాన్నగారు నీకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారని అబద్ధం చెబుతుంది. త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో లక్ష్మీ ఇంటికి బయలుదేరుతుంది. లక్ష్మీ వచ్చేసరికి ఇంట్లో ఉండాలని ప్రియంవద కూడా వెళ్లిపోతుంది.  ఇంతలో రౌడీలు స్పృహలో లేని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. నర్సు కంగారుపడి శ్రీలక్ష్మీకి ఫోన్ చేస్తుంది. అతను ఇక్కడ కనిపించడం లేదని...మీ దగ్గరకు వచ్చారా అని అడుగుతుంది.లేదని అతనికి మా ఇల్లు తెలియదని చెబుతుంది.రౌడీలు తీసుకెళ్తుండగా  అతని స్పృహ వస్తుంది. వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. 

Continues below advertisement

 

Continues below advertisement