Lakshimi Raave Maa Intiki Serial Today May14th: తన వల్లే సింధూ పురుగుల మందు తాగిందని అబద్ధం చెప్పిన గోపీ...ఇంటికి వచ్చినందకు గోపాల్‌పై సింధూ ఆగ్రహం
Lakshimi Raave Maa Intiki Serial Today Episode May14th: తన వల్లే సింధూ పురుగుల మందు తాగిందని అబద్ధం చెప్పిన గోపీ...ఇంటికి వచ్చినందకు గోపాల్‌పై సింధూ ఆగ్రహం

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: గోపాల్ తల్లితోపాటు పెద్దమనుషులను తీసుకుని ఇంటివద్దకు రావడంతో అసలు ఏం జరిగిందో చెప్పాలంటూ సూర్యనారాయణ గోపిని అడుగుతాడు. అసలు నీకు,సింధూకు మధ్య వచ్చిన గొడవ ఏంటని నిలదీస్తాడు. దీంతో గోపాల్ నిజం చేప్పేస్తాడేమోనని సింధూ భయపడుతుంది. ఇదంతా నా వల్లే జరిగిందని గోపీ అబద్ధం చెబుతాడు. మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు మేం హానీమూన్‌కు వెళ్లామని చెప్పాం కదా...అక్కడే చిన్న మనస్పర్థలు వచ్చాయని....దానివల్లే సింధూ పురుగుల మందు తాగిందని చెబుతాడు.
ఇంతలో సరోజ కల్పించుకుని వాళ్లు సరదాగా గడపడానికి వెళ్లగా....ఇక్కడ పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని త్వరగా రమ్మని నేనే ఫోన్ చేశానని...కానీ మీ మనవరాలు ఇంకా నాలుగురోజులు ఉండి వెళ్దామని అన్నదని చెబుతుంది. నేను రమ్మని పిలిచేసరికి తీసుకొచ్చేసరికి అలిగి పురుగుల మందు తాగిందని చెబుతుంది. దీంతో సూర్యనారాయణ సింధూపై కోప్పడతాడు.ఇలాగేనా నేను నిన్ను పెంచిందని నిలదీస్తాడు. మనం ఒకరి ప్రాణాలు కాపాడటానికి మన ప్రాణాలు ఇవ్వాలి కానీ....చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే పిచ్చిపనులు చేసేలా పెంచామా అని అడుగుతాడు. నువ్వు మన ఇంటి పరువు తీశావని మండిపడతాడు. తన మనవరాలు చేసిన తప్పును క్షమించాలని సూర్యనారాయణ కోరతాడు.ఇందులో మా తప్పు కూడా ఉందన్న గోపీ మీరే మమ్మల్ని క్షమించాలని అంటాడు.
Also Read: కేదార్‌ను కొడుకుగా ఒప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చిన వీరశంకర్....సుధాకర్ విషం తాగబోయాడంటూ నాటకం
కోడలిని మాతో పంపిస్తే వెంటనే తీసుకెళ్లిపోతామని సరోజ అంటుంది.ఇంటి వద్ద ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చామని..పెద్దమనుషులు కూడా వచ్చారు కాబట్టి వారిని ఇంటికి వెంటనే తీసుకెళ్లాలని అంటుంది. దీంతో సింధూ వాళ్ల అమ్మ కలుగజేసుకుని అసలే ఇప్పుడు సింధూ ఒట్టి మనిషి కూడా కాదని ఎలా పంపిస్తామని అంటుంది. అయితే కడుపులో బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నమాట అని సరోజ సంతోషపడుతుంది. మీరు కూడా నాలుగురోజులు ఉండి వెళ్లండని హైమావతి అంటుంది. నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయని సరోజ చెప్పగా...అల్లుడిగారినైనా ఉంచి వెళ్లాలని సుకన్య కోరుతుంది.దీంతో గోపిని అక్కడే వదిలేసి సరోజ తిరిగి వెళ్లిపోతుంది.వెళ్తూ వెళ్తూ మా కోడలు మాదిరిగా నువ్వు కూడా మీ అమ్మానాన్నలకు మనవడిని ఇవ్వాలని లక్ష్మీకి చెప్పి వెళ‌్తుంది.దీంతో అందరూ లోపలికి వెళ్లిపోతారు.
Also Read:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారితో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం ఉందని హెచ్చరించిన లక్ష్మీ! అంబిక, సుభాష్‌ల రెక్కీ!
గదిలో మ్యాడీ ఒక్కడే ఉండగా మనవడు కావాలని అంటున్నారు ఇద్దామా అని లక్ష్మీ ఉడికిస్తుంది.అసలు అది ఈ జన్మలో జరగదని అంటాడు.నీతోపాటు డ్యాన్స్ వేసి స్కిట్ చేస్తే ఏదోదో ఊహించుకుంటున్నావా అని మండిపడతాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు...కానీ ఆ శివయ్య చేసేశాడు కదా అని అంటుంది.నేను అడగకుండానే మిమ్మల్ని నాకు ఇచ్చిన వాడు..నేను అడిగితే కొడుకును ఇవ్వడా అని అంటుంది.
Also Read:ఒత్తిడి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుందా? క్షణాల్లో మనసుకు ప్రశాంతతను ఇచ్చే 5 టెక్నిక్స్ ఇవే
ఇంకో జన్మ ఎత్తినా నేను నిన్ను నా భార్యగా అంగీకరించేదిలేదని మ్యాడీ అంటాడు. ఇంతలో సింధూ ప్రియంవద వద్దకు వచ్చి బాధపడుతుంది.మనం ఒకటి తలిస్తే...ఇంకొకటి జరిగిందని అంటుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా గోపీని తీసుకుని సూర్యనారాయణ అక్కడికి వస్తాడు.నీ భర్తను వదిలేసి వచ్చావేంటని సింధూను గట్టిగా తిట్టి గోపిని అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. అసలు మీ అమ్మను తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావని గోపిని సింధూ నిలదీస్తుంది.మీరు రెండురోజుల్లో వస్తామని చెప్పి వచ్చి కనీసం ఫోన్ కూడా లిప్ట్ చేయకపోతే మా అమ్మ కంగారుపడదా అని గోపీ అంటాడు. అందుకే పెద్దమనుషులను తీసుకుని వచ్చిందని చెబుతాడు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















