Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఫ్రెషర్‌డే ఫంక్షన్‌లో సీనియర్ విద్యార్థి విక్రమ్‌....జూనియర్లను ఉద్దేశించి గొప్పగా ప్రసంగిస్తాడు. ర్యాగింగ్‌ గురించి ఎవరూ భయపడొద్దని చెబుతాడు. అందరూ మంచిగా చదువుకుని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడడమే గాక... ఈ కాలేజీ పేరుప్రతిష్ఠలు నిలబెట్టాలని చెబుతాడు.అతని మాటలు శ్రీలక్ష్మీని ఎంతో ప్రభావితం చేస్తాయి. కానీ మ్యాడీ, త్రిషకు మాత్రం అతని మాటలు రుచించవు. తన ప్రసంగం అయిపోయి వెళ్లిపోతుండగా...జూనియర్స్‌లోనూ ఎవరో మాట్లాడతారని పేరు ఇచ్చారని చెప్పడంతో...విక్రమ్ శ్రీలక్ష్మీని పిలుస్తాడు. దీంతో శ్రీలక్ష్మీకి ఏం అర్థంగాక అయోమయంగా చూస్తుంటుంది. ఆమెను ఎలాగైనా అవమానించాలని అనుకున్న మ్యాడీ, త్రిషతోపాటు వాళ్ల ఫ్రెండ్స్‌ అందరూ శ్రీముఖలింగం శ్రీలక్ష్మీ రావాలి అంటూ గట్టిగట్టిగా అరుస్తారు. దీంతో శ్రీలక్ష్మీ స్టేజీమీదకు వస్తుండగా...ఆమెను ఎంతో అవమానిస్తూ గేలీ చేస్తారు. కష్టపడి స్టేజీమీదకు వచ్చిన శ్రీలక్ష్మీ అందరికీ వందనాలు అంటూ తెలుగులో మాట్లాడుతుండగా...మరోసారి మ్యాడీ, త్రిష ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటూ గట్టిగా గట్టిగా అరుస్తూ గొడవ చేస్తారు. ఇప్పుడు చూడు దాని పరువు ఎలా పోతుందోనని త్రిష ఆనందపడుతుంది. అంతే ఒక్కసారిగా శ్రీలక్ష్మీ జూలు విదుల్చుతుంది. షటప్‌ అంటూ గట్టిగా అరిచి ఇంగ్లీష్‌లో స్పీచ్‌ దంచుతుంది. అంతే మ్యాడీ, త్రిష ముఖాలు మాడిపోతాయి. ఈ ఎర్రబస్సుకు ఇంగ్లీష్‌ కూడా వచ్చా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. శ్రీలక్ష్మీ అలాగే పది నిమిషాలపాటు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం చూసి మ్యాడీ నోరుతెరిచి చూస్తూ ఉండిపోతాడు.

విడాకులు పేపర్లు ఇంటికి రావడంతో గోపీ తల్లి సింధూజాక్షిని నిలదీస్తుంది. ఇందులో నీపేరు, గోపీ పేర్లు ఎందుకు ఉన్నాయని మండిపడుతుంది. ఈ హఠత్పరిణామంతో సింధూ ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుండిపోతుంది. దీంతో వాళ్ల అత్తయ్య మరింత రెట్టించి విడాకుల పేపర్లు ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గోపీ ఏం జరుగుతోందని వాళ్ల అమ్మను అడుగుతాడు. సరైన సమయానికి వచ్చావని...ఈ విడాకుల పేపర్లు ఏంటని అడుగుతుంది. దీంతో మంగ అసలు విషయం చెబుతుంది. 

కోటేశ్వరరావు బాబాయి నీకు ఉత్తరం వచ్చిందని తెచ్చి ఇచ్చి వెళ్లాడని..నేను దాన్ని చింపి చూస్తే అందులో మీ పేరిట విడాకుల పేపర్లు ఉన్నాయని చెబుతుంది.వాటిని తీసుకుని చూసిన గోపీ...అవి ఇంగ్లీష్‌లో ఉండటం చూసి హమ్మయ్యా అనుకుంటాడు. మంగకు ఎలాగూ ఇంగ్లీష్‌ సరిగా రాదు కాబట్టి ఈ గండం గట్టెక్కించొచ్చని అనుకుంటాడు. ఇవి విడాకుల పేపర్లు కాదని...డ్రైవింగ్‌ లైసెన్స్‌ పేపర్లని అంటుంది. అందులో డైవర్స్ అని ఉందని..నేను చూశానని అంటుంది. దీంతో వాళ్ల అన్నయ్య కలుగజేసుకుని నీకు ఇంగ్లీష్‌రాదనే నేను పదేపదే నేర్చుకోమన్నానని ఇప్పుడు చూడు నువ్వు డ్రైవింగ్ లైసెన్స్‌ను డైవర్స్ అనుకుని అమ్మను కంగారుపెట్టేశావని అంటాడు. దీంతో వాళ్ల అమ్మ మంగను తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఈ గండం నుంచి గట్టెక్కించినందుకు సింధూ గోపీకి థ్యాంక్స్ చెబుతుంది. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఏమైపోయేదాన్నో అని అంటుంది.

కాలేజీలో శ్రీలక్ష్మీ స్పీచ్‌కు అందరూ చప్పట్లతో అభినందిస్తారు. నాకు ఇంగ్లీష్‌ రాక కాదని.... తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగులోనే మాట్లాడదామనుకున్నాని అంటుంది. తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పి... తెలుగును తక్కువ చేసి చూడొద్దని చెప్పడంతో ఈసారి ఆమె స్పీచ్‌కు అందరూ మళ్లీ చప్పట్లో గట్టిగా అభినందిస్తారు. నన్ను టాక్‌ఆఫ్‌ది కాలేజీ చేసినందుకు థ్యాంక్స్‌ అంటూ శ్రీలక్ష్మీ మ్యాడీని ఉడికించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.