Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Lakshimi Raave Maa Intiki Serial Today Episode June 4th: గోపాల్ ప్రేమను అర్థం చేసుకుని అతని దగ్గరైన సింధూ..లక్ష్మీని అర్థంచేసుకోమని మ్యాడీకి హితబోధ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రజాధరణతో దూసుకుపోతున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ఈరోజు ట్విస్ట్‌లపై ట్విస్టులతో అదిరిపోయింది. గోపాల్ ప్రేమకు కరిగిపోయిన సింధూజాక్షి అతని గుండెలపైవాలిపోతుంది. వెంటనే మనం మన ఇంటికి వెళ్లిపోదామంటూ హడావుడి చేస్తుంది. ప్రియంవద ఆపే ప్రయత్నం చేసినా వినిపించుకోదు. వెళ్తూవెళ్తూ తమ్ముడు మ్యాడీకి కూడా క్లాస్ పీకడంతో ఈరోజు ఏపీసోడ్ అబ్బా అనిస్తుంది.
గోపాల్ గుండెలపై సింధూ
గోపీని బెదిరించడానికే తాను పురుగుల మందుతాగినట్లు నటించానని సింధూజాక్షి చెప్పడంతో సూర్యనారాయణ ఆమె చెంపపగులగొడతాడు. అసలు మాఇంట్లో ఎలా పుట్టావు అని ఈసడించుకుంటాడు. నన్ను క్షమించండి తాతయ్య అని సింధూ కాళ్లపై పడి వేడుకుంటుంది.అసలు నువ్వు నన్ను అలా పిలవొ ద్దని అంటాడు. ఇప్పటికైనా తెలిసిందా నేను తీసుకున్న నిర్ణయం ఎంత గట్టిదో అని కుటుంబ సభ్యులతో అంటాడు.ప్రపంచం మొత్తం వెతికినా గోపీలాంటి వాడు దొరకడని అంటాడు. ఏమగాడు చేయని పని చేశాడని మెచ్చుకుంటాడు.గోపీ దగ్గరకు వెళ్లి బాబు నన్ను క్షమించమని వేడుకుంటాడు.నా పెంపకంలో ఏలాంటి తప్పు ఉండదని గర్వంగా చెప్పుకునేవాడినని కానీ ఇప్పుడు నా పెంపకంలో కూడా లోపం ఉందని తెలుసుకున్నానని అంటాడు.నీపై చేయిచేసుకున్నందుకు నన్ను క్షమించమని అంటాడు.
సూర్యనారాయణ కొడకులు, కోడళ్లకు కూడా వచ్చి తమను క్షమించమని అడుగుతారు.అరె మీరందరూ అలా మాట్లాడుతున్నారేంటని గోపీ అంటాడు.ఇందులో మీ తప్పు ఏం లేదని అంటాడు. మీ కూతురుపై ఉన్న ప్రేమ మిమ్మల్ని అలా మాట్లాడించిందని అంటాడు. అతని సంస్కారం చూసి అందరూ సిగ్గుపడతారు. మీ అమ్మాయికి నేనంటే ఇష్టంలేదని తొలిరోజే తెలిసిపోయిందని....అందుకే ఆమెను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక దూరంగా ఉన్నానని తనకు నచ్చినట్లు విడాకులు ఇస్తానని వాగ్దానం చేశానని అంటాడు.ఇదంతా తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు కానీ..మిమ్మల్ని మోసం చేయాలని కాదని సూర్యనారాయణతో అంటాడు. మీరు కొరియర్‌లో విడాకుల పత్రాలు పంపండని....నేను సంతకం పెట్టి పంపిస్తానని చెప్పి వెళ్లబోతాడు.
గోపాల్‌కు ఐలయూ చెప్పిన సింధూ
సింధూజాక్షి వద్దకు వెళ్లి మీకు నచ్చినట్లే ఆస్ట్రేలియా వెళ్లి మంచిగా బతకండని గోపీ అంటాడు. ఇక మీ స్వేచ్ఛకు ఎవరూ అడ్డురారని చెబుతాడు.నేను మీకుమాట ఇచ్చినట్లే మీ తాతయ్యగారితో చెప్పే మీకు విడాకులు ఇస్తున్నానని అంటాడు. ఆమాటలు విన్న సింధూ ఏడుస్తూ వెళ్లి గోపీ గుండెలపై వాలిపోతుంది. నన్ను క్షమించు గోపీ నిన్ను సరిగా అర్థం చేసుకోలేదని ఏడుస్తుంది.దీంతో ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడతారు.గోపీకి ఐలయూ చెప్పిన సింధూ ఇప్పుడే మనం ఇక్కడి నుంచి మన ఊరికి వెళ్లిపోదామంటూ హడావుడి చేస్తుంది.
సింధూను ఆపేందుకు ప్రియంవద ప్రయత్నం
సింధూ బట్టలు సర్దుకుంటుంటే అక్కడికి వచ్చిన ప్రియంవద ఆమెను ఆపే ప్రయత్నం చేస్తుంది.నీకు ఆఊరుఅన్నా ఆ మనుషులు అన్నా అసహ్యం కదా అని అంటుంది. నువ్వు కోరితేనే కదా నీ పెళ్లి ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేశామని....ఇప్పుడు మమ్మల్ని పిచ్చివాళ్లను చేసి నువ్వు వాడి వెంట వెళ్లడం ఏంటని అంటుంది. నా కళ్లు తెరుచుకున్నాయి అత్తయ్య...మీరు నన్ను ఆపే ప్రయత్నం చేయకండని చెప్పి బట్టలు సర్దుకుని వెళ్లిపోతుంది.
మ్యాడీకి సింధూ క్లాస్
లక్ష్మీ దగ్గరకు వెళ్లిన సింధూ ఆమెను క్షమించమని కోరుతుంది. నీమీద చాలా కోప్పడ్డానని నీ కాపురం చెడిపోవాలని కోరుకున్నానని అంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకు మీరు అంటే ఎంత ఇష్టమో తెలుసునని అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పెళ్లి జరిగేలా చేశానని అంటుంది. అనవసరంగా శ్రీలక్ష్మీపై ద్వేషం పెంచుకుని తనను దూరం చేసుకోవద్దని మ్యాడీకి చెబుతుంది. నేను నీలాగా వీక్ పర్సన్ కాదని...తనను ఈ జన్మలో నా భార్యగా అంగీకరించేదిలేదన్న సంగతి తనకు కూడా తెలుసునని అంటాడు. ఇంత గట్టిగా ఉండే నేనే వీళ్ల ప్రేమకు పడిపోయానని...ఇక నువ్వెంతలే అని అంటుంది.ఇక వాడి సంగతి నువ్వే చూసుకోవాలని లక్ష్మీకి చెప్పి సింధూ బయలుదేరుతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















