Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూకి ఈ పెళ్లి ఇష్టం లేదని గోపికి చెప్పడానికి లక్ష్మీ ప్రయత్నిస్తుంటుంది. కానీ గుడిలో పూజ హడావుడిలోఉన్న గోపీకి చెప్పడం సాధ్యం కాదు. లక్ష్మీ కంగారు చూసి సూర్యనారాయణ ఆమె వద్దకు వచ్చి ఏంటని అడుగుతాడు. వదినకు ఈపెళ్లి ఇష్టం లేదని అనిపిస్తోందని అంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్లను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని సూచిస్తుంది. ఆ మాటలు విన్న పెద్దాయన....సింధూజాక్షి ప్రవర్తన చూసి నువ్వే కాదు ఎవరైనా అలాగే అనుకుంటారని....కాకపోతే సింధూకు ఇష్టం లేనిది ఈ పెళ్లి కాదని...ఈ పల్లెటూరు, ఈ వాతావరణం మాత్రమేనని సూర్యనారాయణ అంటాడు. సిందూ  ఒంటరిగా బ్రతకలేదని...తనకు ఎప్పుడూ ఎవరో ఒకరు సాయం చేయాలని అంటాడు.  పెళ్లయిన తర్వాత కూడా  ఎవరు సాయం చేస్తారని అంటాడు. గోపి అయితే ఎంతో ఓర్పుతో పనులన్నీ నేర్పిస్తాడనే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటాడు. నా నిర్ణయం ఈరోజు నొప్పించొచ్చే కానీ..మున్ముందు జీవితం చాలా బాగుటుందని అంటాడు. మరి ఇలాంటి ఆడదానితో మా అన్నయ్య ఎలా నెగ్గుకొస్తాడని అంటుంది. మరి నీకు పెళ్లిచూపుల్లో కుర్రాడు నచ్చాడా అని అడుగుతాడు. మా అమ్మానాన్నలు నా మంచి కోరే మంచి సంబంధం తెచ్చి ఉంటారు కదా అని లక్ష్మీ అంటుంది. అలాగే నేను కూడా ఆలోచించాని చెబుతాడు. పైగా గోపికి సిందూజాక్షి అంటే చాలా ఇష్టమని చెబుతాడు. చిన్నప్పటి నుంచే గోపీకి సింధూ అంటే ప్రాణమని నాకు తెలుసని అంటాడు. ఇంతలో ఇంట్లోవాళ్లుపిలవడంతో అందరూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.               లక్ష్మీ గుడి నుంచి నేరుగా గోపిఇంటికి వెళ్లి అతన్ని అడుగుతుంది. నువ్వంటే సింధూజాక్షికి ఇష్టమో లేదో కనుక్కున్నావా అని అడుగుతుంది. వదినను చూస్తుంటే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదేమో అనిపిస్తోందని అంటుంది. పట్నంలో పెరిగిన అమ్మాయి కాబట్టి కొంచెం ఇబ్బందిపడుతోందని...త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని గోపీ అంటాడు. తాను చిన్నప్పటి నుంచి సింధూజాక్షిని ప్రేమిస్తున్నట్లు లక్ష్మీకి చెబుతాడు. చిన్నప్పటి నుంచి  తన వస్తువులు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడో చూపిస్తాడు.నువ్వు సంతోషంగా ఉంటానంటే నాకు సంతోషమేనని చెప్పి లక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.                 సూర్యనారాయణ ఇంట్లో పెళ్లిపనుల హడావుడి పెద్దఎత్తున చేస్తుంటారు. తొలుత పల్లెటూరు సంబంధమేంటని బాధపడ్డారని...కానీ ఇక్కడకి వచ్చిన చూసిన తర్వాత, గోపిని కలిసి తర్వాత అందరూ చాలా ఆనందపడుతున్నారని సూర్యనారాయణ అంటాడు. పెళ్లి పనులను చూసి సింధూ భయపడుతుంది.ఇక నా పెళ్లిని ఎవరూ ఆపలేరని బాధపడుతుంటే మ్యాడీ మాత్రం ఆమెకు ధైర్యం చెబుతుంటాడు. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతుందని అంటాడు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపి తీరతామని ప్రియంవద అంటుంది. ఇంతలో మ్యాడీ కల్పించుకుని  నా ప్రెండ్స్‌ గ్యాంగ్ వస్తోందని...ఖచ్చితంగా వాళ్లతో నిన్ను బయటకు పంపిస్తానని చెబుతాడు. ఆ మాటలకు  సింధూజాక్షి  ఆనందపడుతుంది.