krishna mukunda murari serial today Episode : రేవతి: ఇదివరకు మా ఇళ్లు బృందావనంలా ఉండేది. ఏ గొడవలు లేకుండా ఆహ్లదకరంగా ఉండేది.
ముకుంద: మా పెళ్లి అయ్యాక అలాగే ఉంటుంది. మీరే దిగులు పడకండి.
రేవతి: ఛీ.. నోర్ముయ్.. ఇంట్లో నువ్వు అడుగు పెట్టి నాశనం చేశావు. నరకాన్ని సృష్టించావు.
ముకుంద: అత్తయ్య స్వర్గం నరకాలు మనం ఏమైనా చూశామా చెప్పండి మన ఆలోచనలే వాటిని సృష్టిస్తాయి. ఎక్కువగా ఆలోచించి నరకాన్ని సృష్టించకండి.
రేవతి: చాల్లే ఆపు. నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వు అన్నీ నువ్వే చేశావు. కృష్ణ అమాయకురాలు అది ఏమీ చేయలేదు. ఈ నిజం ఇవాళ కాకపోతే రేపు అయినా బయట పడుతుంది.
ముకుంద: (మనసులో.. ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతుంది) మంచిది పెద్దపల్లి ప్రభాకర్ మా చిన్నాన్న కదా అందుకే జైల్‌లో ఉన్నాడు. అన్నీ నేనే చేశాను. మురారి చనిపోయాడని బాడీని నేనే తెచ్చాను. ఇలా అన్నీ నేనే చేశాను. హాస్పిటల్‌లో మురారి ఉన్నాడని పాపం కృష్ణ మీకు చెప్పి అక్కడికి తీసుకెళ్లింది కదా.. అక్కడ మురారితో నేను ఉన్నాను కదా అవును అవును ఇలా అన్నీ నేనే చేశాను. ఇవన్నీ చేసింది కృష్ణ. వీటన్నింటికి సమాధానం చెప్పండి అప్పుడు కృష్ణ గురించి మాట్లాడండి వస్తాను.
మురారి: (ఒంటరిగా మెట్ల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు) ఎందుకు రెండు రోజులు. ఈ రెండు రోజుల్లో ఏం జరగనుంది. వేణి గారిని పంపించేస్తారా.. అందుకే రెండు రోజులు గడువు అడిగారా.. వేణి గారిని పంపించేస్తే నేను ఉండగలనా.. అసలు తట్టుకోగలనా.. అసలు బతకగలనా.. (ఇంతలో భవాని అక్కడికి వస్తుంది)రా పెద్దమ్మ నీ గురించే ఆలోచిస్తున్నాను.
భవాని: నా గురించి కాదు మురారి నేను రెండు రోజులు ఆగమన్న విషయం గురించి. ఇలా ఆలోచించి మనసు పాడుచేసుకుంటావనే అదేదో ఇప్పుడే చెప్పేయాలి అని వచ్చాను. ఏం ఆలోచిస్తున్నావ్ నాన్న. నీ గతం గురించి చెప్పొద్దు అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే చెప్పక తప్పదు. నువ్వు ప్రేమలో ఉన్నావు మురారి. (మనసులో.. భగవంతుడా నన్ను క్షమించు మురారికి పెళ్లి అయిన ఆ విషయం దాయక తప్పడం లేదు. వాడి జీవితం బాగుండాలి అంటే ఈ నిజం దాయక తప్పదు.)
మురారి: చెప్పండి పెద్దమ్మ నేను ఎవరి ప్రేమలో ఉన్నాను. ఎవర్ని ప్రేమించాను.
భవాని: ముకుంద. అవును నాన్న. ముకుంద నువ్వు ప్రేమించుకున్నారు. అవును నాన్న నీ పెద్దమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
మురారి: నిజమా.. నమ్మలేకపోతున్నాను
భవాని: అదే కదా నా బాధ. నువ్వు నన్ను నమ్మడం మానేసి మనకి నమ్మకం ద్రోహం చేసిన వారిని బాగా నమ్ముతున్నావు. నీకో నిజం చెప్పనా. నువ్వు ఆ వేణి గారి మాయలో పడ్డావు. అది నీ తప్పు కాదమ్మా. నిన్ను వాళ్లు అలా మలచుకున్నారు. నువ్వు గతాన్ని మరచిపోయావు. నీ ఎదురుగా ఉంటూ సేవలు చేస్తూ.. దగ్గరగా ఉన్న ఆ వేణిని ఎవరైనా అలాగే చూస్తారు. కేవలం వర్తమానంలో జరిగినవి మాత్రమే నువ్వు చూస్తున్నావ్. మరి నిన్నే నమ్ముకొని నువ్వే సర్వస్వం అనుకొని నీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ముకుంద సంగతి ఏంటి. నా తర్వాత నువ్వే ఈ ఇంటిని నడిపించారు. ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి
మురారి: పెద్దమ్మ ఇంటి బాధ్యతలు తర్వాత అసలు మీరు చెప్పే ముకుంద ప్రేమ నా మనసు తీసుకోవడం లేదు.
భవాని: మాకు తెలుసు నాన్న నీకు ఆ స్పేస్ కృష్ణ ఇవ్వడం లేదు కదా. ముకుంద గురించే కాదు మా గురించి కూడా నువ్వు ఆలోచించడం లేదు. తనివ్వట్లేదో నువ్వు తీసుకోవడం లేదో మాకు తెలీదు. కానీ ఇదంతా వాళ్లే చేశారు. అందుకే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఏం చేయను దానికి నువ్వు మమల్ని దారుణంగా శిక్షిస్తున్నావు. అయినా నీ మీదే ఆశలు పెట్టుకున్న ముకుందకు న్యాయం చేద్దాం. అర్థమైందని అనుకుంటా. అదే నాన్న పెళ్లి చేయాలి అనుకుంటున్నాను.
మురారి: పెద్దమ్మ అది.
భవాని: వద్దు నాన్న నువ్వు ఏం మాట్లాడకు నా మాట విను. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఆ వేణిని కలవడం మానేయ్.
మరోవైపు కృష్ణ తన పెళ్లి ఫొటో చూసుకుంటూ ఎప్పుడు మురారికి గతం గుర్తొస్తుందా అని బాధపడుతుంటుంది. ఇంతలో ముకుంద వచ్చి ఫొటో లాక్కుంటుంది. మురారి ఆ ఫొటో చూస్తే రిస్క్ అని దాన్ని కాల్చేయాలి అనుకుంటుంది. అగ్గిపెట్టి అడిగి కాల్చేస్తుండగా దాన్ని కృష్ణ లాక్కుంటుంది. ఈ ఫొటో ఏసీపీ సార్‌కి చూపించి ఎవరు కాల్చారు అంటే నీ పేరే చెప్తానంటుంది. దాంతో ముకుంద బయపడుతుంది. మరోవైపు మురారి తన గదిలో దేనికోసమో తెగ వెతుకుతుంటాడు. అక్కడ తన పెళ్లి ఫొటో ఉన్నా చూడడు.
మరోవైపు కృష్ణ దగ్గరకు మురారి తల్లి వస్తుంది ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇక ముకుంద మురారితో తాను లండన్‌లో తీసుకున్న ఫొటోలు తనకి చూపించాలని మురారి కోసం వెతుకుతుంటుంది. కృష్ణ ఇంట్లో మురారి ఉండడం చూసి అక్కడికి వెళ్తుంది. మురారి ముకుంద చేతిలో ఫొటోలు చూసి ఏంటని అడుగుతాడు. ఆ ఫొటోలలో ముకుందతో పాటు మురారి ఉంటాడు. అయితే మురారికి సర్జరీ చేయడం వల్ల అది తన పాత ముఖం అని తెలీక ఎవరు అని అడుగుతాడు. దానికి ముకుంద కృష్ణకు అడగమని చెప్తుంది. దీంతో కృష్ణ అది మీరే అని చెప్తుంది. మురారి షాక్ అయిపోతాడు. దీంతో మురారికి గతం గుర్తొస్తుంది. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*