Krishna Mukunda Murari Today Episode: ఆదర్శ్ కిందకి వస్తూ ఈ టైంకి హాల్‌లో అందరూ మీటింగ్ పెట్టాలి ఇంత పొద్దున్న అయినా ఎవరూ లేరు ఏంటా అని అనుకుంటాడు. ఇక రేవతి దగ్గరకు ఆదర్శ్ రావడంతో రేవతి ఆదర్శ్‌ని టిఫిన్ తినమంటుంది. ఆదర్శ్ నవ్వుతూ మురారి తిన్నాడా పిన్ని అని అంటాడు. దానికి రేవతి తినేశాడు అని చెప్తుంది.
ఆదర్శ్: అవునులే పిన్ని మురారిని అయితే పిలిచి మరీ తినిపిస్తారు. నేను వచ్చి అడిగితే మాత్రం దిక్కులేదు కదా.. మురారికి ఇష్టమైన టిఫిన్ చేస్తారు. నేను అదే తినాలి అంతే కదా.. అన్నీ వాడికి నచ్చినవే చేస్తారు కదా..
మధు: పోనీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అదే చేస్తారు.
ఆదర్శ్: వద్దులే మళ్లీ నా మీద ఎందుకు లేని ప్రేమ నటించడం. వాడి ఇష్టమే నా ఇష్టం అన్నాను అదే నేను చేసిన తప్పు. అందుకే వాడు ఇష్ట పడ్డ ముకుందను నాకు అంటగట్టాడు. అయినా ఇప్పుడు అదీ లేకుండా చేశాడు అనుకో.
రేవతి: రేయ్ దోస దగ్గర నుంచి ముకుంద దగ్గరకు వచ్చావా..
ఆదర్శ్: మీరు ఏమైనా అనుకోండి నాకు నిజం అనిపించింది నేను చెప్పాను. ఇంతకీ మా అమ్మ ఏది.
సుమలత: మురారిని సేవ్ చేసి మీరా దగ్గరకు వెళ్లింది.
ఆదర్శ్: ఇప్పుడే కదా మా అమ్మ వచ్చింది రెస్ట్ కూడా తీసుకోనివ్వకుండా మీ వైపునకు తిప్పుకొని ఆ పనికిమాలిన దాని దగ్గరకు పంపించారా..
కృష్ణ: ఆదర్శ్.. ఎవర్ని పనికిమాలింది అంటున్నావ్. ఏసీపీ సార్‌ని కాపాడిన దేవత ఆమె. అత్తయ్య కూడా అలాగే అనుకుంది కాబట్టే కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు. చాలు ఆదర్శ్ ఇప్పటికే ఎక్కువ మాట్లాడావ్ ఇక భరించే ఓపిక మాకు లేదు.
మధు: ఇవే మాటలు పెద్ద పెద్దమ్మ దగ్గర మాట్లాడు పళ్లు రాలగొడుతుంది.
కృష్ణ: మధు ఎక్కడైనా మాట్లాడుకోని. నా దగ్గర మాత్రం మాట్లాడొద్దు అని చెప్పు. కానీ ఇలా పదే పదే రెచ్చగొడితే బాగోదు అని చెప్పు.
సుమలత: మంచి వారితో వార్నింగ్ ఇప్పించుకోవడం అంటే ఇదే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో.
భవాని: ముకుంద ఇంటికి వెళ్లి.. చూడమ్మా ఇక్కడ మీరా అంటే..
మీరా: మనసులో.. నాకు తెలుసు అత్తయ్య మీరు వస్తారు అని మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరు కావాలి మేడం. మీరా అంటే నేనే..
భవాని: రాత్రి నువ్వు కాపాడావే మురారి వాళ్ల పెద్దమ్మని నేను. ముకుంద కావాలనే పేద ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఆ చిన్న ఇళ్లు సాధారణంగా ఉన్న ఆ ఇళ్లు కనీసం కుర్చీ కూడా లేకపోవడం ఆ పరిస్థితిని చూసి భవాని చాలా జాలి పడుతుంది.
మీరా: సారీ మేడమ్ మీలాంటి వాళ్లు ఇక్కడ కూర్చోలేరు. కనీసం నిలబడలేరు కూడా. అయినా మీరు ఎందుకు వచ్చారు మేడం. నేనే వస్తాను అని సార్‌కి చెప్పాను కదా.
భవాని: చూడమ్మా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. మురారిని చూసి వెంటనే నిన్ను చూడాలి అని వచ్చాను. నువ్వు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదమ్మ. మా అందరి ప్రాణాన్ని కాపాడావు. మా పరువు కాపాడావు.
మీరా: మనసులో.. నేనే ముకుంద అని తెలిస్తే ఇప్పుడు దండం పెట్టిన ఈ చేతులతోనే నా ఫొటోకి దండ వేస్తారు..
భవాని: హోం మినిస్టర్ కూతురు ఫ్రెండ్‌వి కదా నువ్వు. మరి నువ్వేంటి ఏదో చిన్న జాబ్ చేస్తూ ఇలాంటి ఇంటిలో ఉంటున్నావు.
మీరా: మనసులో.. ఇలా ఉంటే కదా మీకు నాపై జాలి కలిగేది. గొప్పవాళ్ల స్నేహితులం అయినంత మాత్రానా మనం గొప్పవాళ్లు కాలేం కదా మేడమ్. నా స్థాయి తెలిసి కూడా నాతో స్నేహం చేయడం వాళ్ల గొప్పతనం. నేను ఎవరి సాయం కోరను మేడం. కానీ ముకుంద నా పరిస్థితి తెలుసుకొని నాకు ఫీజులు కట్టేది. చాలా సార్లు నన్ను వాళ్ల ఇంటికి వచ్చేయ్ మని ముకుంద అడిగేది. కానీ నేను రాలేదు.
భవాని: నీ సింప్లిసిటీ నీ వ్యక్తిత్వం, అన్నీ నాకు బాగా నచ్చాయ్. నువ్వు మాకు చేసిన మేలుకి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. మాతో మా ఇంట్లో అని భవాని చెప్తుంది. మీరా కావాలనే రాను అని చెప్పడంతో భవాని గతంలో తన ఫ్యామిలీకి ఓ కుటుంబం సాయం చేసిందని ప్రమాదంలో వాళ్ల ఫ్యామిలీ చనిపోతే వాళ్ల ఆరునెలల కొడుకుని తాను తెచ్చుకొని సొంత బిడ్డలా పెంచాను అని తానే తన పెద్ద కొడుకు ఆదర్శ్ అని భవాని రివీల్ చేస్తుంది. మొత్తానికి కన్విస్ అయిన మీరా భవానితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
మరోవైపు శ్రీనివాస్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ వాళ్లు ముకుంద గురించి మాట్లాడుతారు. తన కూతురి చావు గురించి మాట్లాడొద్దు అని శ్రీనివాస్ అంటాడు. ఇక ముకుంద అస్తికలు గంగలో కలపాలి అని తన ఫ్రెండ్స్ చెప్పడంతో శ్రీనివాస్ చిరాకు పడి వాళ్లని వెళ్లిపోమని అంటాడు.
కృష్ణ మురారిని రెడీ చేస్తుంది. మీరా మురారిని కాపాడింది కాబట్టి తాను ఇంటికి రాగానే గిఫ్ట్ ఇద్దామని కృష్ణ అంటుంది. ఇక మురారి తనకి ఓకే కానీ నేను మాత్రం నీకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇద్దామని అంటాడు. ఏంటని కృష్ణ అడిగితే కృష్ణ కడుపు మీద చేయి వేసి ఈ గిఫ్ట్ ఇస్తానని అంటాడు. కృష్ణ సిగ్గు పడుతుంది. ఇక మురారి కృష్ణకు ఐ లవ్ యూ అని చెప్తాడు.
ఇక ఆదర్శ్ ఏక్ నిరంజన్ అంటూ పాటలు పెట్టుకొని బెడ్ మీద పడుకొని వింటూ ఉంటాడు. నందిని వచ్చి తమ తల్లి మీరాని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిందని చెప్తుంది. దీంతో ఆదర్శ్ థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకురావడం ఎందుకు అని తిడతాడు. ఇక నందిని కూడా ఆదర్శ్ తిడతాడు. పెళ్లి అయిన నవ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్ నీ ఇంటికి వెళ్లు అని క్లాస్ పీకుతాడు. ఇంతలో మురారి ఎంట్రీ ఇచ్చి తను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్లాలి అని మురారి ప్రశ్నిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.