Krishna Mukunda Murari Today Episode: రేవతి, ముకుంద, శకుంతల పిండి వంటలు చేస్తుంటే మధు వీడియో తీస్తుంటాడు. ఇక ముకుంద చిన్నమ్మ మీరు చిన్నప్పుడు ఎలా సంక్రాంతి పండగ చేసుకున్నారు అని అడుగుతుంది. దానికి శకుంతల ఆరోజుల్లో ఉండే మనుషులే వేరమ్మా.. ఇప్పుడు అందరూ డబ్బు సంపాదన వెనకే తిరుతున్నారు అంటుంది. ఇంతలో కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. ఇక ఐస్‌క్రీమ్ గురించి కృష్ణ, మురారిలు చెప్తారు. అందరూ నవ్వుతారు.
ముకుంద: కృష్ణ అసలు నీకు స్వెటర్ ఎందుకు. కొత్తగా పెళ్లి అయింది కదా..
రేవతి: రేయ్ మురారి పంతులు గారు కాల్ చేశారురా.. అదేరా పండగ అయ్యేవరకు ముహూర్తాలు లేవట.
మధు: పండగ అయినతర్వాత అన్నీ మీ రోజులే కదా బ్రో. ఏమత్తా అంతే కదా.
మురారి: (తమ గదిలో) ఛా నవ్వుకు ఒళ్లు మండుతుంది.
కృష్ణ: ఏంటి కోపమొచ్చిందా.. నిన్నేరా ఏబీసీడీల అబ్బాయి. అదే కోపమొచ్చిందా అని..
మురారి: ఒక్కసారి రా అనవా ప్లీజ్..
కృష్ణ: నిజంగా ముహూర్తం వాయిదా పడింది అనగానే చిన్న పిల్లాడిలా అలిగారు.
మురారి: హలో చిన్న పిల్లాడిలా ఏంటి.. నేను పెద్దొడిలానే హర్ట్ అయ్యాను.
కృష్ణ: ఒక గేమ్ ఆడుదామా ఏసీపీ సార్.. అని దువ్వెన తెస్తుంది. దీంతో మీ వీపు వెనక లెటర్స్ రాస్తాను అది ఏంటో మీరు చెప్పాలి. ఇక ఎమ్, కే అని రాస్తుంది. అది కరెక్ట్‌గా మురారి చెప్పాడు. ఇక ఎమ్ కే అంటే ఏంటి అని అడుగుతాడు.
కృష్ణ: ఎమ్ అంటే మీరు కే అంటే నేను.
మురారి: నేను అంటే ఎన్ ఉంటుంది కదా.. కే ఎలా..
కృష్ణ: కే అంటే కృష్ణ.. అని చెప్పి ఏబీసీడీల అబ్బాయి అని రాయబోతే ముందే మురారి చెప్తేస్తాడు. ఇక కృష్ణ ఇంకేటో రాయబోతుంటే ఇది తెలుగు కాదు అని మురారి అంటాడు. అది చెప్పాల్సింది మీరే అని కృష్ణ అంటుంది.
మురారి కృష్ణని దగ్గరకు తీసుకొని మే తుమ్ సే ప్యార్ కర్‌తే హూ అని రాశావ్ అంటాడు. దానికి కృష్ణ సిగ్గు పడుతుంది. ఇక కృష్ణ పరుగెడితే వెంటపడి పట్టుకుంటాడు. ఇక అన్నీ ముహూర్తం తర్వాతే అని కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శకుంతల: ముకుంద ఇంత మారుతుంది అనుకోలేదు వదినా.. ఏమంటావ్ బిడ్డా. ఈ మధు బాబుకి ఆ ముకుంద మారింది అంటే మనసు రావడం లేదు.
రేవతి: లేదు మధు వాళ్ల శోభనానికి కూడా ముకుంద తొందర చేస్తూనే ఉంది కదా. నాకైతే ఎలాంటి అనుమానం రావడం లేదు.
మధు: దేవ్‌ని చూసి కూడా ఇలాగే అనుకున్నాం కదా.. కానీ ఏమైంది.
నందూ: లేదు మధు నువ్వు ఎన్ని అయినా చెప్పు నాకు అయితే నమ్మ బుద్ధి కావడం లేదు. దేవ్ విషయంలో అయితే నేను ఇంత స్ట్రాంగ్‌గా అపోజ్ చేయలేదు. వాడి యాటిట్యూడ్ నాకు ముందు నుంచే డౌట్ ఉండేది.
శకుంతల: వదినా పండగ అయిన తర్వాత తొందరగా ముహూర్తం పెట్టించు అప్పుడు ఏ లొల్లి ఉండదు.
మధు: మీరంతా ఎంత చెప్పినా సరే నేను ఈ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. చూద్దాం చివరకు ఏం అవుతుందో.
ఇక రాత్రి మురారి, కృష్ణ హాల్‌లో ఉండగా.. మధు వచ్చి భోగి మంట వేద్దాం అంటాడు. ఇంతలో గౌతమ్ కూడా వస్తాడు. ఇక అందరూ హాల్ దగ్గరకు చేరుకుంటారు. ఇక భవాని భోగిమంటలో వేయడానికి పనికి రాని వస్తువులను తీసుకురమ్మని చెప్తుంది. ఇక రేవతి అక్క మిమల్ని ఇంత సంతోషంగా చూసి ఎన్ని రోజులు అవుతుందో అంటుంది. ఇక భవాని నేను మాత్రం నిన్ను సంతోషంగా ఉండనిచ్చానా అంటుంది. ఇంట్లో అందరూ తమ తమ గదుల్లో పనికి రాని వస్తువులు తీసుకొని వస్తారు. మధు మాత్రం ఖాళీ చేతులతో వస్తాడు. ఏమైందని భవాని అడిగితే నా కంటే పనికిమాలినది ఈ ఇంట్లో ఇంకేం కనిపించడం లేదని అంటాడు.
భవాని: మధు నేను ఏదో సరదాగా అన్నాను రా. నువ్వేందుకు బాధ పడతావు. నీ భాషలోనే చెప్తాను విను. ఒక అద్భుతమైన కథ ఒక హీరోకి చెప్తే హీరోకి నచ్చలేదు. అంతమాత్రానా ఆ డైరెక్టర్ గానీ నిరాశతో నేను పనికిరాను అనుకుంటాడా ఏంటి. ఇంకో హీరోకి చెప్పి ఆ కథని సూపర్ సక్సెస్ చేస్తాడు. అప్పుడు ఆ కథ నచ్చలేదు అన్న హీరో బాధ పడటం తప్ప ఇంకేం చేయలేడు కదా.. సో గో ఎహెడ్.
కృష్ణ: రాడ్ తీసుకొని వచ్చి.. బయట ఇంతకు మించి పనికి రానిది ఏం కనిపించలేదు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు.
మురారి: అది ఐరన్ రాడ్.. మంట్లో చెక్కలు వేస్తారు. ఇనుము కాదు.
కృష్ణ: నిజమే కదా.. పెద్దత్తయ్య పనికి రానిది అన్న మాట ఒక్కటే గుర్తుంది. అందరూ నవ్వుకుంటారు.
భవాని: మీరు తెచ్చిన ఈ వస్తువులు మీకు ఎవరికీ పనికిరాకపోవచ్చు. అదే పేదవాలకి ఇస్తే వాళ్లు వాటిని కొంచెం బాగుచేసుకొని వాడుకుంటారు. కానీ బూడిదలో చేస్తే ఏం వస్తుంది. భోగి మంటల కోసం నేను ఆల్రెడీ కట్టెలు తీసుకురమ్మని చెప్పాను వెళ్లండి.
కృష్ణ: పెద్దత్తయ్య మీరు మాతో పాటు రావాలి. ప్లీజ్ అత్తయ్య రండి..
భవాని: సరే మీరు వెళ్లండి నేను వస్తాను.
శకుంతల: భోగి మంటకు కట్టెలు పేర్చుతూ.. వదినా పెద్దవదిన నాతో మాట్లాడిందని సంతోషంగా చెప్తుంది. ఇక మధు కూడా రేపటి నుంచి తన లైఫ్ మారిపోతుంది అని అంటాడు. మురారి, గౌతమ్‌లు ఆటపట్టిస్తే కృష్ణ మధుని ఎందుకు అలా అంటారు తను పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటుంది. మధు అప్పుడు ఎవర్ని దగ్గరకు రానివ్వకు అని చెప్తుంది. మరోవైపు ముకుంద వాళ్లందరూ ఉన్న దగ్గరకు రాకుండా దూరంగా నిల్చొని చూస్తుంది. ఇక భవానిని కూడా వస్తుంది. ముకుంద దూరంగా ఉండటం చూసిన కృష్ణ భవానికి చెప్పి ముకుందని కూడా పిలుద్దామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి12th: చనిపోయిన మోక్ష - పంచమిని బెదిరించి నాగమణి సొంతం చేసుకున్న కరాళి!