Krishna mukunda Murari  Serial Today Episode: ముకుంద శోభనం ఎలాగైనా ఆపేయాలని ఆలోచిస్తుంది. తన ఫోన్‌లో మురారి  నెంబర్‌ నా మొగుడు అని సేవ్‌ చేసుకోవడం కృష్ణ చూసిందని ఇంకా తనకు డౌట్‌ రాలేదని ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి అని అనుకుంటుండగానే కృష్ణ వస్తుంది. ముకుందను చీరలు చూశావా అని అడుగుతుంది లేదని ముకుంద చెప్పగానే మామూలుగా చూడటం కాదు కట్టుకుని చూస్తే ఒకవేళ బాగాలేకపోతే ఎక్సేంజ్‌ చేయొచ్చని చెప్పి బట్టలిచ్చి ముకుందను పంపించి కట్టుకునిరాపో అని చెప్పగానే ముకుంద వెళ్లగానే కృష్ణ మురారి ఫోన్‌ నుంచి మిస్‌డ్‌ కాల్‌ ఇస్తుంది. అందులో  మురారి అని రావడంతో కృష్ణ హ్యాపీగా ఫీలవుతూ వెళ్లిపోతుంది. శారీ కట్టుకుని వచ్చిన ముకుంద.. కృష్ణ ఎక్కడని చూస్తుంది. తన ఫోన్‌ తీసుకుని చెక్‌ చేసుకుని ముకుంద ఊపిరి పీల్చుకుంటుంది. కృష్ణకు అనుమానం వచ్చి చెక్‌ చేసకుందని మురారి అని పేరు మార్చడం మంచిదయ్యిందని అనుకుంటుంది ముకుంద. మరోవైపు రూంలో కూర్చున్న కృష్ణ దగ్గరకు మురారి వచ్చి కాఫీ ఏమైందని అడుగుతాడు.


కృష్ణ: మీకు కాఫీ ఇవ్వడానికి రాలేదు. క్వశ్చన్‌ చేయడానికి వచ్చాను.


మురారి: నువ్వెంత ట్రై చేసినా ఈ సీరియస్‌  ఫేస్‌ నీకు నప్పదు తింగరి. సరే ఏదో అడగాలని గట్టిగా ఫిక్స్‌ అయినట్లున్నావుగా అడుగు.


కృష్ణ: ఇందాకా ముకుందకు కాల్‌ చేశావు కదా నాకోసం నా ఫోన్‌కు కాల్‌ చేయాలి ముకుంద ఫోన్‌కు ఎందుకు  కాల్‌ చేశారు. ఏసీపీ సర్‌ అడిగేది మిమ్మల్నే.. ఎందుకు ముకుందకు కాల్‌ చేశారు.


మురారి: అది ఎందుకంటే ఏదో అలవాటు ప్రకారం చేశాను. నీకు  ఇంతవరకు తెలిశాక మొత్తం నిజం చేప్పేస్తాను. నేను ముకుందను  మర్చిపోలేకపోతున్నాను.


కృష్ణ: ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సర్‌.


మురారి: ఆదర్శ్‌ను పెళ్లి చేసుకున్నాక ముకుందని మర్చిపోయాను అనుకున్నాను కానీ మొదటి ప్రేమ కృష్ణ మర్చిపోలేకపోతున్నాను. అసలు నువ్వు పక్కన ఉన్నా నీలో కూడా ముకుందే కనిపిస్తుంది.


అంటూ మురారి చెప్పగానే కృష్ణ ఏడుస్తుంది. ఇంతలో మురారి ఒసేయ్‌ తింగరి నామీదే అనుమానమా? ముందు నీకే కాల్‌ చేశాను. నీ ఫోన్‌ ఇక్కడే పెట్టి వెళ్లావు నువ్వు ముకుంద రూంకి వెళ్లావు కాబట్టి ముకుందకు కాల్‌ చేశాను. అని చెప్పగానే కృష్ణ సారీ చెప్పి  కాఫీ తెస్తాను ఏసీపీ సార్‌ అని బయటకు వెళ్తుంది. తర్వాత వాకింగ్‌కు  బయటకు వెళ్లిన మురారికి ముకుంద ఎదురువస్తుంది. ముకుంద నువ్వొక్కదానివే వచ్చావా? ఆదర్శ్‌ రాలేదా? అని అడుగుతాడు మురారి. దీంతో ముకుంద ఏడుస్తూ..


ముకుంద: ఆదర్శ్‌ అనే పేరు నా జీవితంలో ఉండకూడదు అసలు నా ఎదురుగా ఉండకూడదు.


మురారి: ఏం మాట్లాడుతున్నావు.. ఆదర్శ్‌ ఇష్టమే అని మనసు మార్చుకున్నావు కదా ముకుంద


ముకుంద: లేదు. నేను నా మనసు మార్చుకోలేదు. మనసు చంపుకుని బతుకుతున్న.. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నా మనసులో ఉన్నది నువ్వే మురారి. నేను ప్రేమించేది నిన్నే.


 అంటూ ముకుంద బాంబ్‌ పేల్చడంతో మురారి షాక్‌ అవుతాడు. ఇక నావల్ల కాదు మురారి. నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆదర్శ్‌ నా కళ్ల ముందు ఉండకూడదు. అతన్ని నువ్వే పంపించాలి. నేను ప్రేమించింది నిన్ను. నేను చెప్పింది చేయకుండా ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే నేను ప్రాణాలతో ఉండను. నీ కళ్లెదుటగానే నా ఊపిరి వదిలేస్తా.. రేపు శోభనం గదిలోకి నేను పాలతో వెళ్లితే తిరిగి ప్రాణాలతో రాను అని చెప్పి ముకుంద వెళ్లిపోతుంది. మరోవైపు కాఫీ తీసుకొచ్చిన కృష్ణ, మురారి ఇంకా ఇంటికి రాలేదేంటి? అని ఎదురుచూస్తుంది. మరోవైపు ముకుంద చెప్పిన మాటలు  గుర్తుచేసుకుంటూ గ్రౌండ్‌ లోనే ఉండిపోతాడు మురారి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: బాలకృష్ణ డైలాగ్ చెప్పిన చైతన్య కృష్ణ.