Krishna Mukunda Murari, October 19, ఈరోజు ఎపిసోడ్ లో ముకుంద అన్న మురారి చెయ్యి పట్టుకొని చూసి ఆనందపడుతూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేస్తాడు.
ముకుంద అన్న : చనిపోవలసిన వాళ్ళు చనిపోయారు ఇక బ్రతికించుకోవాలి అనుకున్న వాళ్ళని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు అని అంబులెన్స్ ని పిలిపిస్తాడు.
మరోవైపు ప్రభాకర్ ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు.
ప్రభాకర్: పెద్దోళ్ళు ఎప్పుడు ఇంతే వాళ్ళ ఇల్లులు పెద్దవి కానీ వాళ్ళ మనసులో చిన్నవి. ఇన్నాళ్లు నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలిగిందో. వాళ్ళ మాటలకి బాధపడి తను ఏమీ చేసుకోలేదు కదా అనుకుంటాడు.
అప్పుడే రోడ్డు పక్కగా మూగి ఉన్న జనాన్ని చూసి తను కూడా అక్కడికి వెళ్తాడు.కొన ఊపిరితో కొట్టుకుంటున్న కృష్ణ ని చూసి కంగారు పడతాడు. ఏడుస్తూ అక్కడున్న వాళ్ళ సాయంతో ఆమెని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు.
ముకుంద అన్న : మురారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వచ్చి చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయండి. లేదంటే ఆ ప్లేస్ లో మీరు ఉంటారు అని బెదిరిస్తాడు.
ముకుంద అన్న ఎందుకు హాస్పిటల్ కి రమ్మన్నాడు అనుకుంటూ హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ వాళ్ళ అన్నయ్యని చూసి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది.
ముకుంద అన్న: నేను వస్తున్న దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఎవరా అని చూస్తే అందులో మురారి ఉన్నాడు. తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను.
ముకుంద : ఆ మాటలకి కంగారు పడిపోతుంది. వాళ్ళ అత్తింటి వాళ్ళకి ఫోన్ చేయబోతుంది.
ముకుంద అన్న : అలాంటి పిచ్చి పని చేయకు అని చెప్పి ఏదో ప్లాన్ చెప్తాడు.
ముకుంద : అంతా బానే ఉంది కానీ ఏమి జరగదు కదా అని భయంగా అడుగుతుంది.
ముకుంద అన్నయ్య : మురారితో నీకు పెళ్లి కావాలంటే ఇలా చేయక తప్పదు. ఇంత చేసిన తర్వాత ఏమి జరగకుండా ఎలా ఉంటుంది. మీ ఇద్దరికీ పెళ్లి అవుతుంది అని చెప్తాడు ముకుంద అన్న.
అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద, యాక్సిడెంట్ జరిగింది అంటేనే ఇంత కంగారు పడిపోతుంది యాక్సిడెంట్ చేయించాను అంటే ఇంకెంత కంగారు పడిపోతుందో అనుకుంటాడు ముకుంద అన్న.
మరోవైపు కృష్ణకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బయట ప్రభాకర్ కంగారుగా తిరుగుతూ ఉంటాడు. భయంగా అక్కడికి వచ్చిన శకుంతల ఏం జరిగింది అని భర్తని అడుగుతుంది.
ప్రభాకర్: యాక్సిడెంట్ అయింది బిడ్డకి ట్రీట్మెంట్ అవుతుంది.
శకుంతల: అల్లుడు ఏడి?
ప్రభాకర్: వాళ్ళు అసలు మనుషులే కాదు అంటూ జరిగిందంతా చెప్తాడు.
డాక్టర్ వచ్చి పేషెంట్ కి బాగానే ఉంది కాసేపట్లో మెలకువ వస్తుంది అని చెప్తుంది.
తర్వాత ప్రభాకర్ కృష్ణ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్తాడు.
శకుంతల: బిడ్డకి బాగా అయ్యాక మన ఇంటికి తీసుకు వెళ్ళిపోదాం.
ప్రభాకర్: మురారి బాబుకి మన బిడ్డ అంటే ప్రాణమని రేవతి చెల్లెమ్మ చెప్పింది. బిడ్డకి మెలకువ వస్తేనే గాని ఏ విషయం తెలియదు.
మరోవైపు ముకుంద అన్న తను చెప్పిన విధంగా ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ని బెదిరిస్తాడు.
డాక్టర్ :నువ్వు చెప్పినట్లుగా చేయడం కుదరదు.
ముకుంద అన్న : ముందు డబ్బుతో కొనాలనుకుంటాడు కుదరకపోవడంతో గన్ చూపించి బెదిరిస్తాడు.
డాక్టర్: ఇక్కడ చేయడం కుదరదు.
ముకుంద అన్న : నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తావో నాకు అనవసరం కానీ నేను చెప్పినట్లు చేయు.
మరోవైపు కృష్ణ దగ్గరికి వెళ్తారు ప్రభాకర్ దంపతులు, అప్పుడే కృష్ణ కోలుకుంటుంది.
తరువాయి భాగంలో మురారి శవం అంటూ ఒక డెడ్ బాడీని ఇంటికి తీసుకురావడంతో రేవతి వాళ్ళందరూ ఏడుస్తారు.