కార్తీకదీపం మార్చి 28  మంగళవారం ఎపిసోడ్


ఆటోలో ఇంటికి వెళుతున్న జ్వాల...హాస్పిటల్లో నిరుపమ్ అన్న మాటలు గుర్తుచేసుకుంటూ మురిసిపోతుంది. ఫస్ట్ టైం నన్నొకరు పొగిడారు అని పొంగిపోతుంది. అందరూ నన్ను మగరాయుడు అని మొత్తుకునేవారే...అమ్మాయి అంటే నాలా ఉండాలట..నేను అమ్మాయిని అని ఫస్ట్ టైం నాకు ఓ అబ్బాయి గుర్తుచేశాడు అనుకుంటుంది జ్వాల. మరోవైపు నిరుపమ్ కూడా జ్వాల మాటలే గుర్తుచేసుకుంటాడు. హిమ కూడా అదే సమయానికి జ్వాల గురించి ప్రస్తావిస్తుంది.
నిరుపమ్: నేను కూడా ఆమె గురించే ఆలోచిస్తున్నా ... మనసులో ఏమీ లేకపోతే అంత హ్యాపీగా ఉంటారు...నువ్వెందుకు అలా ఉండవు, సిగ్గు, బిడియంతో ఉంటావ్ 
హిమ: అమ్మో నాకు అలా ఉండటం చేతకాదు
ఇంతలో వాళ్ల కారు జ్వాల ఆటోని క్రాస్ చేసుకుంటూ వెళుతుంది. ఆ కారు నన్ను క్రాస్ చేసి వెళుతుంటే నావాళ్లే వెళుతున్నట్టు అనిపిస్తోందని జ్వాల అనుకుంటే.... ఆ ఆటోని క్రాస్ చేసి వెళుతుంటే ఆ అమ్మాయే ఉండి ఉంటుందనుకుంటా అని హిమ అంటుంది. 
నిరుపమ్: నీకు అంతలా ఆ అమ్మాయి గుర్తొస్తోంది ఎందుకు.. నాకో ఐడియా వచ్చింది హిమ...కొన్నాళ్లు నువ్వు తనతో కలసి తిరిగితే సిగ్గు, బిడియం, మొహమాటం పోతుంది                                                                                                                                                          హిమ: ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని శౌర్యని వెతకమని చెప్పాలని అనుకుంటుంది హిమ.  


అదే సమయానికి తన చేతిపై పచ్చబొట్టు చూసుకున్న జ్వాల...యాక్సిడెంట్ విషయం గుర్తుచేసుకుంటుంది. 


Also Read: వసుధారని మళ్లీ అపార్ఠం చేసుకున్న ఈగో మాస్టర్ రిషి, వసు రియాక్షన్ ఏంటి
ఇంటికొచ్చిన తల్లి సౌందర్య ను చూసి స్వప్న చిరాగ్గా బయటకు వస్తుంది...మీ డాడీకి అని సౌందర్య చెప్పబోతుంటే... తెలిసింది కానీ నువ్వు అక్కడ ఉంటావని రాలేదంటుంది స్వప్న. అవసరం అయితే డాడీతో వీడియో కాల్ మాట్లాడుతా
సౌందర్య: కన్న తండ్రిని చూసేందుకు కూడా ఇన్ని లెక్కలు వేసుకుంటావా
స్వప్న: జీవితంలో ఇప్పటికే కొన్ని లెక్కలు తప్పాయ్...ఇకనైనా జాగ్రత్తపడకపోతే ఎలా
సౌందర్య: ఎంతకాల నీకీ కోపం...ఎప్పుడో నీ కూతుర్ని ఏదో అన్నానని
స్వప్న: నువ్వు మాటలు, చేసిన గాయం మరిచిపోయేది కాదు
సౌందర్య: మన మధ్య ఉన్న బంధాలు తెగిపోతాయా
స్వప్న: ఎప్పుడో తెగిపోయాయి...వాటిని నువ్వే కలపాలని తాపత్రయపడుతున్నావ్.. కార్తీక్-దీప చనిపోయిన తర్వాత అందర్నీ కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావ్ కదా... హిమని కావాలని నిరుపమ్ హాస్పిటల్లో డాక్టర్ గా ఎందుకు పెట్టావ్... పిల్లల గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు కానీ అలా జరగదు, జరగనివ్వను...
అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్...అమ్మమ్మా నువ్వెప్పుడు వచ్చావ్ అంటూనే...అమ్మా నీకు కాల్ చేసి చెప్పానుకదా హాస్పిటల్ కి రాలేదేం
స్వప్న: ప్రేమని చూపించాల్సిన అవసరం లేదు..కొందరు వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
నిరుపమ్: ఆకలివేస్తోంది అన్నంపెట్టు..
స్వప్న: ఇంటికొచ్చిన పెద్దమనిషిని వెళ్లనివ్వు


అమ్మమ్మా మీకు తెలుసుకదా మమ్మీ మారదని...మీరిలా వచ్చి బాధపడడం నాకు ఇష్టంలేదన్న నిరుపమ్ తో...వెళ్లొస్తానని చెబుతుంది సౌందర్య. మళ్లీ రాకపోతే చాలా మంచిది అన్న స్వప్న నీ మనవరాలిని వీలైనంత త్వరగా హాస్పిటల్ మార్పించెయ్ ఆ మహాతల్లి నిరుపమ్ హాస్పిటల్లో ఉండడం నాకు ఇష్టం లేదంటుంది. హిమ ఎక్కడికీ వెళ్లదు అక్కడే ఉంటుందని క్లారిటీ ఇచ్చిన నిరుపమ్.. నేను నీలా హార్ష్ గా మాట్లాడలేను, నీలా బంధాలు తెంచుకోలేను, నాకు అందరూ కావాలి అందుకే నువ్వు వద్దన్నా అందర్నీ కలుస్తాను...హిమ విషయంలో కూడా అంతే అంటాడు నిరుపమ్. అమ్మమ్మా మీరేమీ అనుకోపోతే ఓ మాట చెప్పనా...మీరిక్కడు రాకండి, మమ్మీ మారదు తను ఇంతే...వచ్చి అనవసరంగా మాటలు పడకండి, తన గోల తనదే ఎవరేం చెప్పినా వినదు, తన కొడుకు ప్రేమ్ డాడీ దగ్గరున్నాడని తల్లిగా బాధపడుతోంది కానీ తన తల్లి ఎంత బాధపడుతోందో తెలుసుకోవడం లేదంటాడు. అందరూ బావుండాలని కోరుకోండి ఇకపై ఇక్కడకు రాకండి అని మళ్లీ చెప్పిన నిరుపమ్ నన్ను చూడాలి అనిపిస్తే కాల్ చేయండి వచ్చేస్తానని క్లారిటీ ఇస్తాడు. (హిమని నిరుపమ్ అయితేనే బాగా చూసుకోగలడేమో అనుకుంటుంది సౌందర్య) . (ఈవిడగారు మనవరాలి గురించి ఏవో కలలు కంటోంది కానీ అవేమీ జరగనివ్వను అనుకుంటుంది స్వప్న)


Also Read: హిమ-నిరుపమ్ ఎవరో జ్వాల(శౌర్య)కి తెలిసిపోయిందా, ఇప్పుడేం చేయబోతోంది
తన పిన్ని ( చంద్రమ్మ) ని డాక్టర్ నిరుపమ్ దగ్గరకు తీసుకెళుతుంది జ్వాల. ఇప్పుడేం చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేసేవారని అడిగితే...గతంలో చేసిన పనిగురించి చెప్పడం చాలా కష్టంమా జ్వాలే పని మాన్పించిందని చెబుతుంది. డాక్టర్ గారికి ఫీజు ఇవ్వమ్మా అని చంద్రమ్మ అంటే..ఫీజు వద్దంటే నాకు హెల్ప్ చేయండి అంటాడు నిరుపమ్. ఏం చేయాలని జ్వాల అడిగితే..మా డాక్టర్ హిమ భయస్తురాలు..తన భయం పోగొట్టాలి, ధైర్యంగా ఉండడం నేర్పించాలి అదే నాకిచ్చే ఫీజు అంటాడు. తింగరిని ఎలా మారుస్తానో మీరే చూడండి అన్న జ్వాలతో... నువ్వైతేనే మా తింగరిని కరెక్ట్ గా మార్చగలవు అంటాడు. అదేంటి అంటే...నీ బిహేవియర్, నీ స్టైల్ నాకు నచ్చుతుందని అంటాడు. అవే మాటలు పదే పదే గుర్తుచేసుకుంటూ మురిసిపోతుంది జ్వాల(శౌర్య).  


చంద్రమ్మ, ఇంద్రుడు ఆటోని పట్టుకుంటే జ్వాల రిపేర్ చేస్తుంటుంది. అమ్మో కష్టపడడం ఇంత కష్టమా అనుకుంటారిద్దరూ. మరోవైపు జ్వాల...చిన్నప్పుడు హిమతో కలసి ఆడుకున్న సందర్భాలన్నీ గుర్తుచేసుకుంటుంది. చిన్నప్పుడు హిమ అమాయకంగా ఉండేది, ప్రతిదానికీ భయపడేది..అలాంటి హిమ ఆ డ్రైవింగ్ పిచ్చితో అమ్మానాన్నని దూరం చేసింది అనుకుంటుంది. అయ్యిందా జ్వాలా అని ఇంద్రుడు, చంద్రమ్మ అడగడంతో అయ్యిందని సమాధానం చెబుతుంది. కష్టపడడం ఇంత కష్టమా అంటే..ఇకపై దొంగతనాలు బంద్ వళ్లొంచి పనిచేయాలి అంటుంది. 


రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
ఈ ఆటో అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నాకు పదే పదే గుర్తొస్తోందని హిమ అనుకుంటే... ఆ ఆటో అమ్మాయిని చూస్తే శౌర్యని చూసినట్టు అనిపిస్తోందని నిరుపమ్ అంటాడు. నా మనసులో ఉన్నమాటే నువ్వు చెప్పావ్ బావా అంటుంది. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన జ్వాల మొత్తం వినేసినట్టే ఉంది.....