Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప అందరికీ టిఫిన్ వడ్డిస్తుంటే శౌర్య వచ్చి స్కూల్‌కి టైం అయింది తనని తీసుకెళ్లమని అడుగుతుంది. ఇక దశరథ్ పాపని కారులో తీసుకెళ్లమంటే దీప ఆటోలో తీసుకెళ్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. బయటకు వచ్చేసరికి అక్కడ శ్రీధర్ టెన్షన్‌గా కనిపిస్తాడు. దాంతో దీప శౌర్య పంపించి ఆయన దగ్గరకు వెళ్తుంది. 


శ్రీధర్: ఏంటి దీప నన్ను రమ్మని పిలిచారా.


దీప: ఇంకా లేదు అండి. పిలుస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే జరుగుతుందని భయపడుతున్నారో అది అడగటానికి తొందర్లోనే పిలుస్తారు. ఈ లోపు మీరు ఎలా సరిదిద్దుకుంటారో మీరు సరిదిద్దుకోండి. మీరు కాంచన గారికి అన్యాయం చేయకండి. నిజం తెలిస్తే అది ఆవిడ బతికే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడు ఈ కుటుంబం చాలా అందంగా ఉందండి కానీ మీ గురించి నిజం తెలిస్తే అలా ఉండదు. మీరు అంత పెద్ద తప్పు చేశారు. లోపల అందరూ నా భర్తను తిట్టారు కదా అవి మీకు కూడా వర్తిస్తాయి అని మన ఇద్దరికే తెలుసు. అలా తిట్టించుకొనే పరిస్థితి మీరు తెచ్చుకోకండి. 


దీప హోటల్‌కి వెళ్తుంది. కడియం తనను మళ్లీ నిలబెట్టినందుకు దీపకు థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇస్తాడు. దీప కార్తీక్‌కి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని చీటి పాట వేసేవాళ్లు ఉంటే చెప్పమని అంటుంది. ఇక స్కూల్‌కి వెళ్లి శౌర్యకి లంచ్ బాక్స్ ఇస్తా అని దీప వెళ్తుంది.    


శౌర్య దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శౌర్యని నర్శింహ చూసి తానే తండ్రి అని చెప్తాను అనుకుంటాడు. శౌర్యని పిలుస్తాడు. శౌర్య  బూచోడు అనుకొని దాక్కోవడానికి పరుగెడుతుంది. ప్లే జోన్‌లోకి వెళ్తుంది. నర్శింహ కూడా వెంట వెళ్తాడు. ఇంతలో దీప వస్తుంది. నర్శింహ కారు చూసి తన మీద కోపంతో నర్శింహ పాపను ఏమైనా చేస్తాడని భయంతో పరుగులు తీస్తుంది. నర్శింహ పాప వెంట పరుగులు తీస్తుండగా దీప చూస్తుంది. శౌర్య తనని కొట్టొద్దని నర్శింహతో చెప్తుంది. అమ్మా అని గట్టిగా అరుస్తుంది దాంతో దీప వెళ్లి పాపని అక్కున చేర్చుకుంటుంది. శౌర్య అమ్మా బూచోడు వచ్చాడు. మనల్ని ఏమైనా చేస్తాడు వెళ్లిపోదాం అంటుంది. నర్శింహతో నేను పువ్వులు కోయను మమల్ని ఏం చేయకు మా అమ్మను కొట్టకు అని ఏడుస్తుంది. దాంతో నర్శింహ షాక్ అయి తనని విలన్‌ని చేసేశావ్ అని అంటాడు. శౌర్యకి బాక్స్ ఇచ్చి లోపలికి పంపేస్తుంది. 


నర్శింహ: అది నన్ను చూసి ఎందుకు పారిపోతుందో నాకు అర్థం కావడం లేదు. పైగా నన్ను బూచోడు అంటుంది ఏంటి. నేను తండ్రిని అని ఎలాగూ చెప్పలేదు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిని అని చెప్పావా. మొత్తం మీద నా కూతుర్ని నా దగ్గరకు రానివ్వకుండా దాని దృష్టిలో నన్ను విలన్‌ని చేశావ్.


దీప: నీతో కానీ నీ కూతురుతో కానీ మాకు ఏ సంబంధం లేదు అని ఆ రోజు ఇంటి దగ్గర చెప్పారు కదా. మరి ఏ సంబంధంతో ఇప్పుడు వచ్చావ్. 


నర్శింహ: మరి ఏ సంబంధంతో నా మీద కేసు పెట్టించావే. ఎంగిలి చేతితో ఒంటి మీద బనియన్‌తో ఉన్న నన్ను పోలీస్ స్టేషన్‌కు లాక్కెలేలా చేశావ్. ఆ ఎస్‌ఐ గాడు కార్తీక్‌కు ఫ్రెండ్ అంట. ఆ కార్తీక్‌కు నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ ఎస్‌ఐ నన్ను అంతలా కొడతాడు. పోలీస్‌ స్టేషన్‌లో తగిలిన దెబ్బలకు నొప్పి తగ్గలేదు. అందుకే నేను నీకు దెబ్బ కొట్టాలి కదా. ఈ రోజు నువ్వు ఆపినా రేపు నేనే నీ తండ్రిని అని పాపకు చెప్పేస్తాను.


దీప: నర్శింహ.. 


నర్శింహ: నువ్వు ఎలా కాపాడుకుంటావో చూస్తాను.


దీప:  నర్శింహ నీలాంటి వాడు నా కూతురుకి తండ్రి అని చెప్పను.


నర్శింహ: అయితే మరెందుకు ఆ కార్తీక్‌ నే నీ కూతురికి తండ్రి అని చెప్పు. 


దీప: పళ్లు రాలిపోతాయ్ జాగ్రత్తగా మాట్లాడకపోతే. నా జోలికి వచ్చినా పర్లేదు. నా కూతురి జోలికి రాకు.


నర్శింహ: నీ కూతురి జోలికి రాకూడదు  అంతే కదా. ఇన్ని రోజులు నిన్ను ఏం చేస్తే భయపడతావా అనుకున్నా ఇప్పుడు తెలిసింది నీ బలహీనత నీ కూతురు అని. ఈ సారి నీతో ఎలా ఆడుకుంటానో చూడు. నిన్ను ప్రశాంతంగా తిననివ్వను. తిరగనివ్వను. ప్రశాంతంగా పడుకోనివ్వను.  ప్రశాంతంగా బతకనివ్వను. నన్ను చూస్తేనే భయపడేలా చేస్తాను. కాదు కాదు నా పేరు వింటేనే భయపడేలా చేస్తా. 


దీప: నర్శింహ నీకు మర్యాదగా చెప్తున్నా విను. మా బతుకుల జోలికి వచ్చావో చూడు. ఇక్కడితో ఆపేయ్. 


నర్శింహ: దూరంగా పోవే అంటే ఇదేమో పనిలో చేరింది. కూతుర్ని బడిలో చేర్పించి ముందు దీన్ని అక్కడి నుంచే తరిమేయాలి. వస్తా.. వచ్చి పెంట పెంట చేస్తా. నా ఒంటి మీద పడిన ప్రతీ దెబ్బకి నీకు బదులు ఇస్తానే. నన్ను రెచ్చ గొడితే ఎలా ఉంటుందో నీకు ఆడికి చూపిస్తా..


శ్రీధర్ దీప మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమతి కాఫీ తీసుకొని వస్తే వద్దు కావేరి అనేస్తాడు. దీంతో సుమతి, కాంచన, దశరథ్‌లు కావేరి ఎవరు అని అడుగుతారు. శ్రీధర్ కవర్ చేయలేక తెగ కంగారు పడతాడు. ఇక కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు - నన్ను ఇన్‌స్పరేషన్‌గా తీసుకోవద్దని చెప్పా...