Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: అనసూయ కిల్లీకి తింటూ ఉంటే సౌర్య అక్కడికి వస్తుంది. పుస్తకాలు బ్యాగ్ పక్కన పెట్టి నానమ్మ దగ్గర కూర్చొంటుంది సౌర్య. బడి అయిపోయిందా ఇలా తగలబడ్డావ్ అని సౌర్యని అనసూయ అడగితే నువ్వేంటి నా మంచం మీద కూర్చొన్నావ్ అని సౌర్య అనసూయ నానమ్మని ప్రశ్నిస్తుంది. దీప తండ్రి కుభేర్ కూడా చనిపోయి ఉంటాడు.
అనసూయ: ఎంత ధైర్యమే నీకు ఇది నా తమ్ముడు ఇళ్లు. నీ బాబు ఇళ్లు అంతే కానీ తేరగా వచ్చింది కదా అని అడుక్కు తినేవాళ్లది కాదు. (నీ బాబు ఇళ్లు అని అనసూయ సౌర్యను అనడంతో అనసూయ కొడుకు నర్శింహకు దీపకు పెళ్లి జరిగిందని అనిపిస్తుంది.)
సౌర్య: నానమ్మ అమ్మ వైపు చూసి తిడతావేంటి.
అనసూయ: నా ఇష్టమే నా ఇష్టం. ఈ అనసూయకు ముత్యాలమ్మ కూడా గజగజ వణికిపోతుంది. తెలుసా..
దీప: సౌర్య మనం జాతరకు వెళ్తున్నాం కదా వెళ్లి స్నానం చేసిరా పద..
సౌర్య: ఇదిగో నేను జాతరకు వెళ్లి సైకిల్ కొంటున్నాం. నువ్వు సైకిల్ మీద ఎక్కినావనుకో..
దీప: సౌర్య వెళ్లమని చెప్పానా.. తప్పు..
అనసూయ: చిలక పలుకులు పలికే చిలకదేం తప్పే పలికించే వాళ్లని అనాలి.
దీప: నాకు అంత అవసరం లేదు అత్తయ్య.
అనసూయ: ఓయబ్బో.. నువ్వు పలికించకపోతే ఈ మాటలు నన్ను అనే ధైర్యం నాకు ఎక్కడిదే. ఈ మాటలకే నీ మొగుడు ఊరు రావడం మానేశాడు. వాడు ఊరి నిండా చేసిన అప్పులకు నన్ను అడుగుతున్నారు. వాడు ఎక్కడికి వెళ్లాడో ఏంటో అంతా నా ఖర్మ.
దీప: కన్న కొడుకు సంగతి తల్లికి తెలీదా..
అనసూయ: అంటే ఏంటే నాకు తెలిసే వాడిని నేను రానివ్వడం లేదా. ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందే నీ నోరు పడిపోను.
దీప: అరవకు అత్తయ్య ఎవరైనా వింటే...
అనసూయ: అబ్బో పౌరుషం అరుస్తాను అయితే ఏంటే.. ఇక దీప టిఫెన్లు అమ్మిన డబ్బును అనసూయ లాక్కుంటుంది. సౌర్యకు సైకిల్ కొనడానికి ఉంచిన డబ్బు అని అన్నా అనసూయ వినిపించుకోదు. మందులకు కావాలి అని లాక్కొంటుంది.
ఇక కార్తీక్ తల్లిదండ్రులు, జ్యోత్స్న తల్లిదండ్రలు అందరూ జ్యోత్స్న కోసం ఎదురు చూస్తారు. ఇక జ్యోత్స్న తన నానమ్మ ఫ్యాన్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. జ్యోత్స్న రావడమే బావ గురించి అడుగుతుంది. ఏదో బిజినెస్ పనిలో ఉంది అని కార్తీక్ తల్లి చెప్తుంది. ఇక జ్యోత్స్న కార్తీక్‌కి కాల్ చేస్తే తాను బిజీగా ఉన్నాను అని ఆల్ దీ బెస్ట్ అని కార్తీక్ వాయిస్ మెసేజ్ పంపుతాడు. అందరూ బావకి నువ్వే ఇష్టం అని అంటారు.
దశరథ: నీ మనవరాలు మిస్ హైదరాబాద్ పోటీలకు వెళ్తుంది నాన్న.
జ్యోత్స్న: డాడీ తాతయ్యతో నేను చెప్తాను అని అన్నాను కదా.. తాతయ్య నన్ను దివించండి.. డాడీ టైం అవుతుంది మనం వెళ్దామా..
దీప సౌర్యని తీసుకొని జాతరకు వస్తుంది. కూతుర్ని భుజాల మీద కూర్చొపెట్టి జాతరలో తిప్పుతుంది. ఇక జాతరకు అందరూ వస్తారు అని దీప అంటే నాన్న కూడా వస్తారా అని సౌర్య అడుగుతుంది. దీప మెల్లగా మాట మార్చుతుంది. సౌర్య అందరూ తమ తల్లిదండ్రులతో వచ్చారు. నేను మాత్రం నీ ఒక్కదానితో వచ్చాను అంటుంది. ఇక సౌర్య తన తల్లికి సైకిల్ అడుతుంది. దీప అత్త అనసూయ డబ్బులు తీసుకోవడంతో నోట మాటరాక దీప సైలెంట్ అయిపోతుంది.
మరోవైపు అందాల పోటీలు జరుగుతాయి. జ్యోత్స్న పార్టిసిపేట్ చేస్తుంది. శివనారాయణ వాళ్లు ఇంట్లో టీవీలో చూస్తారు. జ్యోత్స్న తల్లిదండ్రులు లైవ్‌లో చూసి మురిసిపోతారు.
దీప సౌర్యని ఇంటికి వెళ్లిపోదామని తన సైకిల్ తీస్తుంది.
సౌర్య: నాన్న ఉంటే నాకు సైకిల్ కొనిచ్చేవాడు ఏమో. ఏం మాట్లాడవు ఏంటి. అమ్మా ఏంటి కళ్లలో నీళ్లు వస్తున్నాయ్. ఏమైనా దెబ్బ తగిలిందా..
దీప: మనసులో నాకు తగిలిన దెబ్బ నీకు కనిపించదు అమ్మ. నా దురదృష్టం కళ్లలో నీళ్లలా బయటకు వస్తుంది. ఏదో దుమ్ము పడింది అమ్మ. ఎదుటివారు నమ్మేదే నిజం కనిపించనిది అంతా అబద్దం.
సౌర్య: అమ్మా ఇలా రా అని ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుస్తుంది. నాకు ఏమీ వద్దమ్మ వెళ్లిపోదాం పద..
ఇంతలో సైకిల్ పోటీలు జరుతాయని అనౌన్స్ మెంట్ వస్తుంది. సైకిల్ పోటీలు అంటే ఏంటి అని సౌర్య అడిగి తన తల్లిని పోటీల్లో పాల్గొనమని చెప్తుంది. దీంతో దీప సైకిల్ పోటీలే కదా మనల్ని ఆపేది ఎవడు పద అని వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న ర్యాంప్ వాక్ చేసి అలరిస్తుంది. ఇక చివరకు మిగిలిన చారుశీల, జ్యోత్స్నలు మిగులుతారు. అందరూ చారుశీల గెలుస్తుంది అని అనుకుంటారు. ఇక జ్యోత్స్న తన రోల్ మోడల్ నేను అని అంటుంది. జ్యోత్స్న చెప్పిన మాటలకు అందరూ ఫిదా అయిపోతారు. అన్ని ప్రశ్నలకు జ్యోత్స్న చక్కగా సమాధానం చెప్తుంది. ఇక దీప అబ్బాయిలతో పాటు సైకిల్ పోటీల్లో పాల్గొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.