Karthika Deepam Idi Nava Vasantham Serial Episode ఉన్నపళంగా తాళి కట్టకపోతే చనిపోతానని విషం బాటిల్ చూపిస్తుంది జ్యోత్స్న. తాళి కడతావా విషం తాగాలా అని అంటుంది. వద్దు జ్యోత్స్న అని కొత్త సమస్యలు తేవొద్దని కార్తీక్ అంటాడు. కార్తీక్, కాంచన ఎంత చెప్పినా జ్యోత్స్న వినదు.


కాంచన: నీకు దండం పెడతానే ఒక్క గానొక్క మేనకోడలివే ఏం అఘాయిత్యం చేసుకోకే.
కార్తీక్: తాళి కడితే ఏం జరుగుతుందో నాకు తెలుసే. ముందు మనం కూర్చొని మాట్లాడుకుందాం. 
జ్యోత్స్న: ఇంక మాట్లాడుకోవడాలు లేవు చావో బతుకో ఇప్పుడే తేలాలి. 
కార్తీక్: నువ్వు నా మేనత్త కూతురివి నేను నిన్ను చంపుకోలేను ఆ తాళి ఇటివ్వు నీ మెడలో కడతాను. 
జ్యోత్స్న: నిజంగానా బావా.
కార్తీక్: నీకు కావాల్సింది మన పెళ్లి కదా అది ఎప్పుడు జరిగితే ఎక్కడ జరిగితే ఏంటి. తాళి ఇవ్వు.
జ్యోత్స్న: ఇదిగో బావ కట్టు. అంటే తాళి తీసుకొని విషం బాటిల్ పడేసి జ్యోత్స్నని కొడతాడు. తర్వాత తాళి విసిరేస్తాడు. బావా..
కార్తీక్: నోర్ముయ్ మాట్లాడితే రెండో చెంప పగలగొడతా. 
జ్యోత్స్న: నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావ నాకు తాళి కట్టను అన్నావంటే నీ మనసులో నేను లేను. నీ కొడుకు మనసులో నేను లేను అత్త ఎవరు ఉన్నారో నీకు తెలుసా ఆ దీప ఉంది. మేనకోడలికి కాదని మనసులో ఆ వంట మనిషికి ఇచ్చాడు. అందుకే నాకు తాళి కట్టను అంటున్నాడు.
కార్తీక్: నోటి కొచ్చినట్లు వాగావంటే అని కొట్టబోతే కాంచన ఆపుతుంది. వద్దు జ్యోత్స్న ఇక దీన్ని ఇంతటితో ఆపేయ్ ముందు ఇంటికి వెళ్లు.
జ్యోత్స్న: అత్త ముందు నిజం చెప్పానని నన్ను పొమ్మంటున్నావ్. నీ మనసులో దీప లేకపోతే నాకు తాళి కట్టడానికి ఏంటి ప్రాబ్లమ్.
కార్తీక్: మా అమ్మలా నిన్ను కూడా అనాథని చేయడం ఇష్టం లేక. నా తల్లికే ఆ ఇంట్లో స్థానం  లేనప్పుడు నా భార్యకి స్థానం ఉంటుందా. మన పెళ్లి అయిన మరుక్షణమే నీకు ఆ ఇంటితో సంబంధం తెగిపోతుంది. మా పుట్టిళ్లు దూరం అయిందని పడుతున్న బాధ చాలు నీకు ఆ పరిస్థితి వద్దు. మళ్లీ చెప్తున్నా విను మనకి పెళ్లి జరగాలి అని ఉంటే అందరి సమక్షంలోనే జరుగుతుంది లేదంటే లేదు అంతే.
జ్యోత్స్న: లేదు బావ అందరి అంగీకారంతోనే అందరి సమక్షంలోనే మన పెళ్లి అవుతుంది. లాగిపెట్టి కొట్టావ్ కదా బుర్ర స్టడీ అయింది నేను వెళ్తాను. అత్త బాగా ఏడ్చించి ఒక కాఫీ పెట్టి ఇవ్వు. బాయ్ అత్త కాఫీ తాగి రెస్ట్ తీసుకో. 
కార్తీక్: ఏంటమ్మా దీని ఆవేశం పొరపాటున విషం తాగుంటే జ్యోత్స్నకి జాగ్రత్తగా చూసుకోమని అత్తకి చెప్పాలి. తాత ఒకడు ఇప్పుడే సంబంధం చూడాలా.
కాంచన: అది కాదురా..
కార్తీక్: మీ నాన్నని ఏం అనొద్దు కదా అననులే. 
 
మరోవైపు దీప ఏడుస్తుంటుంది. ఇక శౌర్యకి జ్వరం అని ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని అనసూయ చెప్తుంది. కట్టుకున్న వాడు బతికుండగానే తాళి తెంపుకున్న నేను ఏమవుతానని ఏడుస్తుంది. దానికి అనసూయ దేవుడు నీ తలరేతని కొత్తగా రాశాడని ధైర్యం చెప్తాడు. నర్శింహ దగ్గరకు వెళ్లి చేయాల్సిన న్యాయం నీకు చేస్తానని అంటుంది. దీప వెళ్లొద్దని చెప్పినా అనసూయ వినదు. అనసూయ వెళ్తుంది. దీప మనసులో పెళ్లాన్ని చంపాలి అనుకున్న వాడు తల్లిని ఏం చేస్తాడో అని అనుకుంటుంది. ఇక మందులు తీసుకురావడానికి వెళ్తుంది.


జ్యోత్స్న వెళ్తుండగా తనని గతంలో ప్రపోజ్ చేసిన గౌతమ్ వస్తాడు. నీ బావ మనసులో నువ్వు లేవని అందుకే నిన్ను కొట్టాడని అంటాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నానని అంటాడు. పెళ్లి చేసుకుందామని అంటాడు. దానికి జ్యోత్స్న నా మనసులో ఒకరే ఉంటారు. జీవితంలో కూడా ఒకరే ఉంటారని నాకు నా బావకి మధ్యలో ఎవరూ వచ్చినా నలిపేస్తా అంటుంది. పెళ్లి పిలుస్తా రెడీగా ఉండని చెప్పి వెళ్లిపోతుంది. జ్యోత్స్న ఆవేశంగా వెళ్తుంటుంది. ఇంతలో దీపని చూసి కారు ఆపుతుంది. నా బావని నీ భర్తని చేసుకోవాలని అనుకుంటున్నావని అంటుంది. పూజకి వచ్చినప్పుడు నా అత్తావాళ్లని నా వాళ్లు అన్నావు ఇప్పుడు నాకు ఓ చెంప దెబ్బతో క్లారిటీ వచ్చిందని చెప్తుంది. రోడ్డు మీద ఇద్దరూ మాట్లాడుతూ పోట్లాడుకోవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చేస్తారు. 


దీప: నేను ఇంటికి వెళ్లాలి జ్యోత్స్న.
జ్యోత్స్న: ఏ ఇంటికి అంటే నీకు చాలా ఇళ్లులు ఉన్నాయి కదా. ఈ మొగుడు ఇంటికా నా మొగుడు ఇంటికా. నా కంటికి నువ్వు ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావ్ దీప ఏంటి అది తేడా దొరికింది మెడలో తాళి లేదు తెగిపోయిందా తెంచేశావా.
దీప: జ్యోత్స్న.
జ్యోత్స్న:  ఎందుకే అంత రెచ్చిపోతున్నావ్ నీ వేషాలు ఎవరీకీ తెలీదు అనుకుంటున్నావా. నువ్వు చేసేది న్యాయం అనుకుంటున్నావా జనాల్నే అడుగుదాం. అందరూ రండి. మీరే నాకు న్యాయం చేయండి.
దీప: జ్యోత్స్న ఏంటి ఇది నీ స్థాయి మర్చిపోయి మాట్లాడకు.


జ్యోత్స్న అందరికీ దీప తన ఇంట్లో ఉంటుందని ఈవిడ గారి భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు ఈమె కూడా అతన్ని వదిలేసి నా బావని నన్ను దూరం చేసి నా బావని తన చుట్టూ తిప్పుతోందని ఆరేళ్ల కూతుర్ని అడ్డు పెట్టుకొని ఇంత చేస్తుందని అంటుంది. తాళి అడ్డుగా ఉందని మెడలో తాళి కూడా తీసేసిందని మా బావతో తాళి కట్టించుకోవడానికే తయారయ్యావని అంటుంది. నా బావని నీ చుట్టూ తిప్పుకోవడం మానేయ్ అంటుంది.  దాంతో దీప జ్యోత్స్నని కొట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: Nara Rohith Wedding: ప్రేమలో పడిన సంగతి నారా రోహిత్ ముందు ఎవరికి చెప్పారో తెలుసా? పెళ్లి ఎప్పుడంటే?