Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ తన ఫ్రెండ్స్‌తో దీప తన భార్య అని శౌర్య కూతురని చెప్తాడు. దీపకి కార్తీక్‌ ఫ్రెండ్స్ ఇద్దరూ సారీ చెప్తారు. తర్వాత దీప కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. కార్తీక్‌తో సిరి దీప నీ భార్య అని ఎవరూ అనుకోరని నీ స్థాయి బట్టి అలా అనుకోరని నీ పక్కన దీప భార్యగా సరిపోదని అంటాడు. దీపని మనసుతో చూస్తే అర్థమవుతుందని నా భార్యగా దీపకి అన్ని అర్హతలు అని తనకు ఉన్నాయన కార్తీక్ అంటాడు. ఇక వాళ్లు దీపని పాపని భోజనానికి రండి అని చెప్పి వెళ్లిపోతారు.


అదంతా విన్న అనసూయ, కాంచనలు ఇద్దరి మధ్య చాలా దూరం ఉందని ఇద్దరినీ ఒకటి చేయాలని అంటుంది. ఇక జోత్స్న వాళ్లిద్దరూ ఎప్పటికీ ఒకటి కాకూడదని అంటుంది. బావ ఎప్పటికైనా నాకే సొంతం అని పారిజాతంతో చెప్తుంది. దానికి పారిజాతం నీకు నా అనవాయితీ వచ్చినట్లు ఉంది. జరిగేది చూస్తుంటే నువ్వు కార్తీక్‌కి రెండో భార్యగా నువ్వు వెళ్లాలి అనుకుంటున్నావ్ అని అంటే జ్యోత్స్న దానికి ఒప్పుకోదు. దీప ఉన్న స్థానం నాది నాకు నెంబర్లు ఇవ్వను ఎప్పటికీ నేను ఒక్కదాన్నే బావకి భార్యని అని చెప్తుంది. దీపని చంపి అయినా బావని పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అంటే ఆవేశంతో ఎవరైనా అదే మాట అంటారని పారిజాతం అంటుంది.


పారిజాతం: నువ్వు కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలి ఈ ఆస్తికి వారసురాలివి అవ్వాలి. నీకు పెళ్లి అవ్వకపోయినా ఇది నీ ఆస్తే కానీ బావ నీకు కావాలి. బావ దీపని వదలడు. కాబట్టి మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ల మనసు గెలుచుకోవాలి. జ్యోత్స్న కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు అనేలా చేయాలి. అందుకు మీ తాత కాళ్ల మీద పడు. ఇది నీకు నచ్చని పని అని తెలుసు కానీ మనం శివన్నారయణని ఆపాల్సిందే.
జ్యోత్స్న: సారీ గ్రానీ నేను తాత కాలు పట్టుకోలేను.
పారిజాతం: అయితే వెళ్లి దాసు కూతురిలా బతుకు. 
జ్యోత్స్న: దాని కంటే చావడం బెటర్.
పారిజాతం:  అయితే కాళ్లు పట్టుకో. దీన్ని లౌక్యం అంటారు. అందులో దీప తోపు. కార్తీక్ కావాలి అంటే నువ్వు కాళ్ల మీద పడక తప్పదు.
జ్యోత్స్న: ఏంటీ గ్రానీ నాకీ ఖర్మ.
పారిజాతం: ఇదంతా ఆ దరిద్రపు దీప వల్లేనే. అది కార్తీక్ జీవితం నుంచి పోతే బాగుండు.


మీ స్నేహితులే దీప మీ దగ్గర సెట్ అవ్వదని అంటున్నారు నాకు అది నచ్చడం లేదని దీప అంటుంది. మీ మర్యాద మీద బురద జల్లుకోవద్దని దీప అంటుంది నా కోసం అందర్ని వదులు కుంటారా అని దీప అంటే వదులు కుంటానని కార్తీక్ అంటాడు. కాంచన, అనసూయలు కూడా దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. నువ్వు నాకు రక్తం ఇచ్చి కాపాడావు అప్పుడు లేని స్థాయి ఇప్పుడు నాతో కలిసి బతకడానికి సరిపోదా అని కార్తీక్ అంటే కాంచన కార్తీక్‌తో బాగా చెప్పావురా దీప సంఘర్షణకి ఇది సరిపోతుందని అంటుంది. తొందర్లోనే నా భార్య కూతురి గురించి అందరికీ తెలిసేలా చేస్తానని కార్తీక్ అంటాడు. కార్తీక్ భార్యగా నీ స్థాయి పెరిగిందని అనసూయ అంటే దానికి దీప కార్తీక్ బాబు నా భర్త అని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఆయన్ని దేవుడిలానే చూస్తాను అంటుంది. 
 
జ్యోత్స్న: తాత కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతుంది. నేను నిన్న వ్రతం దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది తాత.
శివనారాయణ: నువ్వు ఏమైనా నా శత్రువువా నువ్వు బాధ పడితే చూడాలి అని గానీ నువ్వు ఏడిస్తే ఆనంద పడాలి అని నేను అనుకుంటానా. నాకు ఏమైనా పది మంది మనవళ్లు ఉన్నారు అనుకున్నావా ఉన్నది నువ్వు ఒక్కర్తివే కదా. మేం సంపాదించినదంతా నీకే చెందుతుంది. అలాగే మా గౌరవ మర్యాదలు కూడా నీకే చెందుతాయి. నీ జీవితం నువ్వు పాడు చేసుకుంటాను అంటే మేం ఊరుకుంటామా.
జ్యోత్స్న: సారీ తాత ఇంకెప్పుడు మిమల్ని బాధ పెట్టను. 
శివనారాయణ: ముందు నువ్వు ఆ పారిజాతం మాట వినడం మానేయ్. 
పారిజాతం: రేయ్ ముసలోడా అది నేను చెప్పగానే నీ దగ్గరకు వచ్చిందిరా.
శివనారాయణ: రేపు నేను తెచ్చిన పెళ్లి చూపుల్లో కూర్చొ.
జ్యోత్స్న: తాత నేను బావని తప్పు ఇంకెవరినీ పెళ్లి చేసుకోను.
శివనారాయణ: నువ్వు నా గురించి కాకపోయినా మీ అమ్మానాన్నల గురించి అయినా ఆలోచించు.
పారిజాతం: దీనికి నేను ఏం చెప్పాను ఇది ఏం చేస్తుంది. 


జ్యోత్స్న తాతతో గొడవ పడుతుంది. కార్తీక్ తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను అంటుంది. మీరు మారి నా దారికి రావాలి తప్ప నేను నా నిర్ణయం మార్చుకోను అని అంటుంది. పరువు పోయే పనులు మాత్రం చస్తే చేయను అని శివనారాయణ అనుకుంటాడు. పారిజాతం ఇవన్నీంటికి దాసు కారణం అనుకొని అక్కడికి బయల్దేరుతుంది. కాశీ, స్వప్నలు సరదాగా మాట్లాడుకుంటారు. అత్తకు కోడలు నచ్చదు కానీ మామయ్య కోడలు ఫ్రెండ్స్ అని నేను మామయ్యని బాగా చూసుకుంటా అని అంటుంది. ఇంతలో పారిజాతం వస్తుంది.


దాసు కూడా అక్కడికి వస్తాడు. ఇక పారిజాతం కాశీని స్వప్నని తిడుతుంది. వ్రతానికి ఎందుకు వెళ్లారురా అని తిడుతుంది. మా అక్కా బావ మా ఇష్టం అని కాశీ అంటే అదో అక్క వాడో బావ వాళ్లదో పెళ్లి అని అంటుంది. మా అన్నయ్యని ఏమైనా అంటే ఊరుకోను అని స్వప్న అంటే మా అక్కని ఏమైనా అంటే ఊరుకోను అని కాశీ అంటాడు. దానికి దాసుతో పిల్లలతో నీ గొడవ ఏంటి అని అంటాడు. వీళ్ల పెళ్లి తోనే అన్ని అనర్థాలు వచ్చాయని పారిజాతం అంటుంది. పెళ్లాన్ని తీసుకొని బయటకు వెళ్తే జనాలు ఛీ కొడతారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అర్చనకు సుమతి ఫోన్.. తొలిరేయి ఆపడానికి మహాలక్ష్మీ కొత్త ప్లాన్!