Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప జ్యోత్స్న కొట్టడంతో పారిజాతం కోపంగా కొట్టవే కొట్టు మొగుడు వదిలేసిన దానివి రెండో పెళ్లి దానివి నీకు నా మనవడు కావాల్సి వచ్చిందా అని అంటుంది. ఇంతలో ఫంక్షన్‌కి వచ్చిన సరోజిని పారిజాతంతో ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా అని అడుగుతుంది. దీపకి అండగా నేను ఉంటానని అంటుంది.
సరోజిని: నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తిని వేరే ఒకరు పెళ్లి చేసుకోవడం నువ్వు భరించలేని విషయమే కానీ వాళ్ల ఇష్టం మీద కూడా ఉంటుంది కదా. నేను ఇష్టపడి తాళి కట్టాను అని మీ బావే చెప్తున్నాడు కదా ఇంకా ఇందులో నువ్వు పడిన మోసం ఏముంది. ఐదారేళ్లు కూతురున్న దీపని పెళ్లి చేసుకున్న కార్తీక్ గొప్పోడు. కార్తీక్‌కి పాపని ఇచ్చిన దీప కూడా గొప్పదే మర్యాదగా మీరు ఇక్కడి నుంచి పోండి. మిమల్ని గెంటేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు.
జ్యోత్స్న: నిన్ను అయితే వదిలపెట్టను బావ ఎవరినీ వదిలిపెట్టను.
పారిజాతం దీపని తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న వెళ్లిపోవడంతో అందరూ కలిసి ఫ్యామిలీ ఫొటో తీసుకొని రిసెప్షన్‌ని సంతోషంగా ముగిస్తారు. ఇక జ్యోత్స్న వాళ్లు ఇంటికి వస్తారు. హాల్‌లో శివనారాయణ ఉంటే పారిజాతం దగ్గు హాస్పిటల్ అని కవర్ చేస్తుంది. శివనారాయణ రిపోర్ట్ అడిగి ఏ డాక్టర్‌ని కలిశారు అని అడిగితే పారిజాతం షాక్ అయిపోతుంది. ఎవర్ని కలిశారు మీరు డాక్టర్ కార్తీక్ గారినా లేక డాక్టర్ దీపగారినా లేక డాక్టర్ కాంచన గారినా అని తిడతాడు. తెలిసిన వాడు ఫోన్ చేసి రిసెప్షన్‌కి మీ భార్య, మనవరాలు వచ్చారు మీరు ఎందుకు రాలేదని అడుగుతాడు.
రిసెప్షన్‌కి వెళ్లొద్దు అన్నా ఎందుకు వెళ్లారని నా పరువు ఎందుకు తీశారని శివన్నారాయణ ఇద్దరినీ తిడతాడు. ఇక జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడితే జ్యోత్స్న పెళ్లి చేసుకోను అని అంటుంది. మనవరాలి పద్ధతి బాలేదని మార్చమని శివనారాయణ సుమిత్రకు చెప్తాడు. మరోవైపు దీప రిసెప్షన్‌లో జరిగిన గొడవ కార్తీక్ తనకు గులాబి ఇచ్చి పెట్టడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అనసూయ అక్కడికి వస్తుంది.
దీప: అత్తయ్య నా కన్న తల్లి ఎలా ఉంటుందో ఫోటోలో చూడటం తప్ప నాకు తెలీదు. కష్టాల్లో ఉన్న నాకు నువ్వు అండగా ఉంటే నువ్వే తల్లి అనుకున్నా అందుకే నువ్వు చెప్పిన ప్రతీదానికి ఒకే చెప్పాను.
అనసూయ: అంటే ఇప్పుడు నేను నీ జీవితం నాశనం చేశాను అంటున్నావా
దీప: అవును అత్తయ్యా. నువ్వు జీవితం నాశనం చేశావు నా జీవితం కాదు కార్తీక్ బాబు జీవితాన్ని. కార్తీక్ బాబు ఆవేశంలో నా మెడలో తాళి కట్టారు. అందుకే భార్యని అయ్యాను. వ్రతంలో అయిన వాళ్లు అవమానించారు. ఇప్పుడు రిసెప్షన్‌లో నేను సుమిత్రమ్మ కూతుర్ని కొట్టాల్సి వచ్చింది.
అనసూయ: నువ్వు ఎందుకు ఆమెని కొట్టావే
దీప: కార్తీక్ బాబుని అంటే చూస్తూ ఊరుకోవాలా నా వల్ల ఆయన మాటలు పడాలా.
అనసూయ: ఇది నికార్సైన ఆడదాని మాట అంటే. నలుగురిలో ఆయన అవమాన పడుతుంటే నువ్వు ఎలా చూడలేకపోయావో నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్లిపోతా అంటే ఆయన అలాగే చూడలేకపోయారు. నీ మెడలో తాళి కట్టారు.
దీప: నా బతుకు నేనే బతికేదాన్ని శౌర్య కోసం శౌర్య కోసం అని నన్ను ఇంటి నుంచి వెళ్లనివ్వలేదు ఇప్పుడు కూడా శౌర్య కోసం ఆయన భార్యగా చేశారు. నేను ఆయన పక్కన ఉంటే ఆయన విలువ పాతాళంలోకి పడిపోతుంది.
అనసూయ: ఇదంతా ప్రేమ కాదే నాటకం. అవునే అందరూ అనే మాటలు కంటే నీ చేతలకే కార్తీక్ బాబు ఎక్కువ బాధ పడుతున్నాడు. నీ కార్తీక్ బాబు మొగుడు అయ్యాడు అలా అనుకోలేక గింజుకుంటున్నావ్. నీ మెడలో మూడు ముళ్లు వేసిన మనిషి గురించి ఆలోచించావా. నీకు ఏం అన్యాయం జరిగింది అని ఇంత బాధ. నీ కోసం నీ బిడ్డ కోసం తన జీవితాన్ని ఇచ్చిన ఆయనకు నువ్వు ఎంత రుణపడి ఉండాలి. నీకు ఇంతకు ముందు చెప్పాను తను కేవలం శౌర్య కోసమే నీకు తాళి కట్టలేదు నీకు అన్ని అర్హతలు ఉన్నాయని నీ మెడలో తాళి కట్టారు. అతను నిన్ను భార్యగా దగ్గరకు తీసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే నీకు గదిలోకి రానిచ్చారు. మంచం మీదకు రానిచ్చారు. అతను చనువు ఇస్తున్నారు కానీ నువ్వు తీసుకోలేకపోతున్నావు. మీ నాన్నతో మీ అమ్మ ఉన్నట్లు నువ్వు అతనితో ఉండవే ఇది బూతు కదా అలా అని తప్పు కాదు. నువ్వు మారాలి దీప. నువ్వు అతనికి దూరంగా ఉంటే నీ భవిష్యత్ దూరం అయిపోతుంది. నువ్వు మారి కార్తీక్ బాబుతో భార్యగా నడుచుకుంటానని నాకు మాట ఇవ్వు నీ తల్లిలా అడుగుతున్నాను మాట ఇవ్వు. ముందు మీరు ఇద్దరూ ఒకటైపోవాలే. లేదంటే ఈ సమస్య పరిష్కారం కాదే.
దీప: ఎలా ఉన్నా భార్యనే కదా
అనసూయ: పెళ్లాం మొగుడుతో ఎలా ఉండాలో నీకు తెలీదా నీకు నేను చెప్పాలా. కాసేపు గదిలో ఉంటేనే తప్పు అన్నట్లు వచ్చేస్తున్నావ్. అది మాకు తెలుస్తుందే. సరే నీకు నచ్చినట్లు నువ్వు ఉండు నా దారి నేను చూసుకుంటా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ కోసం హాస్పిటల్‌కి పరుగులు తీసిన సత్య.. కిడ్నాపర్ల డిమాండ్‌కి షాక్‌లో హర్ష!