Karthika Deepam 2 Serial Today March 31st: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి, శౌర్యకి కన్నీటితో శాపం పెట్టిన పెద్దాయన.. ఏడుస్తూ పారిపోయిన దీప!
Karthika Deepam 2 Serial Today Episode పెద్దాయన రెస్టారెంట్ దగ్గరకు వచ్చి జ్యోత్స్న జీవితం నాశనం చేసిందని తిట్టి ఏడుస్తూ తన బాధ చెప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ బాధ పడుతున్న దీప దగ్గరకు అన్నం తీసుకొని వస్తాడు. దీప ఆకలి లేదు అంటే తాను తినిపిస్తా అంటాడు. గౌతమ్ మంచోడు కాదని నిజం చెప్తే ఎవరూ నమ్మడం లేదని దీప అంటుంది. అన్నింటికీ సాక్ష్యాలు అడుగుతున్నారని బాధ పడుతుంది.
కార్తీక్ దీపతో నింద వేస్తే నిరూపించే బాధ్యత కూడా మనదే.. ఆ గౌతమ్ తెలివిగా నింద నీ మీద వేసి రివర్స్ అయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఏదో ఒక రోజు వాళ్లే నిన్ను నమ్ముతారులే అని కార్తీక్ దీపతో చెప్తాడు. తాను,తన తల్లి, అనసూయ మేం ముగ్గురం నువ్వు తప్పు చేయడం లేదని నమ్మతున్నామని చెప్తాడు. నీ కోసం ఇక్కడ చాలా మంది ఉన్నారు మా కోసం నువ్వు ఆలోచించు వాళ్లని వదిలేయ్ అని చెప్పి కార్తీక్ దీపకి గోరు ముద్దలు తినిపిస్తాడు. దీప కన్నీరు తుడుచి ఏడ్వొద్దు దీప నా మీద నీ మమకారం కారిపోతుందని అంటాడు. దీపని నవ్విస్తాడు. నువ్వు నేను ఒకటే అని దీపతో చెప్తాడు. దీప మురిసిపోతుంది.
కార్తీక్, దీపలు రెస్టారెంట్‌లో ఉంటే కాశీ వస్తాడు. స్వప్న గురించి అడిగితే దాసు దగ్గర ఉందని అంటాడు. మా అన్నయ్య, వదినలు బాధ పడుతుంటారు వెళ్లు అని స్వప్న చెప్పిందని కాశీ అంటాడు. ఇక కార్తీక్ దీప, కాశీలను మాట్లాడమని కస్టమర్ దగ్గరకు వెళ్తాను అని హాయ్ సార్ ఏం కావాలి అని అడిగితే అక్కడ కార్తీక్ తాత ఉంటారు. కోపంతో కాస్త విషం కావాలి అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు.
శివన్నారాయణ: మనిషిని ఒక్క చుక్క విషంతో చంపేయడంలో తమరి శ్రీమతి సిద్ధహస్తురాలని విన్నాను. ఆవిడ చేతుల మీదనే విషం తెప్పించు నేను కాస్త తాగి నా మనవరాలికి కాస్త ఇస్తాను.
దీప: తాతయ్య గారు.
శివనారాయణ: ఏమ్మా మా ఇద్దరం సరిపోమా ఇంటిళ్లపాది తాగి చావమంటావా.
కార్తీక్: తాత మనం కాస్త పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం అందరూ మనమే చూసుకుందాం.
శివనారాయణ: అవమానంగా ఉందా. పరువు పోతుందా. ముక్కూ ముఖం తెలియని వాళ్ల ముందు మాట్లాడితే మీకు పరువు పోతే నా ఇంట్లో నా బంధువుల మందు నీ పెళ్లాం నా ఇంటికి కాబోయే అల్లుడిని కొట్టిందిరా. నా మనవరాలి బతుకు మీద కొట్టిందిరా.
కార్తీక్: బతుకు మీద కొట్టిందో బతుకు నిలబెట్టిందో కాస్త కళ్లు తెరిచి చూస్తే తెలుస్తుంది.
శివనారాయణ: అవునురా మాకు కళ్లు మూసుకుపోయాయి. ఈవిడ గారు వచ్చి తెరిపించారు.
కాశీ: ఎవరి మీద ఎవరు ఊరికే నిందలు వేయరు కదా.
శివనారాయణ: మధ్యలో మాట్లాడటానికి నువ్వు ఎవడ్రా. మీలో ఒక్కరి బతుకు అయినా తిన్నగా ఉండుంటే మీకు గౌరవం విలువ తెలిసేది. మీ తండ్రులే తిన్నగా ఉండుంటే మీకు జీవితం విలువ తెలిసేది.
దీప: తాతయ్య గారు మీకు ఏమైనా కోపం ఉంటే నన్ను అనండి. వీళ్లకి ఏం సంబంధం లేదు.
శివనారాయణ: అవునమ్మా ఎవరికీ ఏం సంబంధం లేదు మొత్తం నీకే సంబంధం. నువ్వు వేరు నీ భర్త వేరు కాదు కదా.
కార్తీక్: నేనే అంటున్నా. బిజినెస్ జరిగే చోట ఇలా గొడవలు చేయడం ఏంటి. ఆ మాత్రం ఈ పెద్ద మనిషికి తెలీదా.
శివనారాయణ: వెనకా ముందు ఆలోచించే స్థితిలో ఉంచలేదురా మీరు మమల్ని. నిన్ను ఇష్టపడిన పాపానికి నీ మరదలి జీవితంతో నువ్వు ఆడుకున్నావు. నిన్ను చేరదీసిన కారణంతో నువ్వు నా మనవరాలి బతుకుతో ఆడుకున్నావు. అసలు నువ్వు జ్యోత్స్నకి ఏ పెళ్లి జరగనివ్వవు. ఛీ.. దాని బతుకుకు ఏలిన నాటి శనిలా తయారయ్యావ్. దాన్ని ఏడిపించి ఏడిపించి చంపుతున్నావ్.
దీప: గౌతమ్ మంచోడు కాదు తాతయ్య గారు.
శివనారాయణ: సాక్ష్యం ఉందా.. ఆధారం ఏది. కనీసం వాడు వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉన్న ఒక్క ఫొటో చూపించు. ఏం లేవు. నువ్వు ఎక్కడో చూశావు మేం అది నమ్మాలి. అనుకున్న వాడితో దాని పెళ్లి జరగకుండా అపేశావ్ ఇప్పుడు మేం ఎవరో ఒకర్ని తెచ్చి చేస్తే ఆపేశావ్. ఎలా తట్టుకోవాలి. నువ్వు నిజంగా నా మనవరాలి మంచి కోసం ఈ పెళ్లి ఆపుంటే సాక్ష్యం చూపించి లేదంటే అప్పుడు నువ్వు మంచి ఉద్దేశంతో చేశావని అనుకుంటా. అసలు ఎంత మంది ఉసురు పోసుకుంటావ్ దీప. నీకు ఓ కూతురు ఉంది ఆ పాపం నీ కూతురికి తగలదా. నువ్వు ఒక ఆడదానివే అయినా ఇంకో ఆడదాని జీవితం ఎలా నాశనం చేయాలి అనిపించింది. అది ఇష్టపడ్డ వాడు పోయాడు. దాన్ని ఇష్టపడ్డ వాడు పోయాడు. ఇంక అది ఎవరిని చేసుకుంటుంది. ఒక్కగానొక్క మనవరాలు దాని భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నాం అన్నీ బూడిద చేసేశావ్. మేమంతా ఏడుస్తుంటా మీరు మాత్రం హాయిగా వ్యాపారాలు చేసుకొని మా మీద గెలిచేసి హాయిగా ఉండండి సుఖంగా ఉండండి. కానీ చేసిన పాపం ఎవరినీ ఎప్పుడూ వదిలిపెట్టదు దీప. అది నీడలా బతికినంత కాలం వెంటాడుతుంది. అది నిన్ను ఎప్పుడూ వదలదు. ఈ రోజు కన్నీరు నా మనవరాలి కంట్లో ఉన్నాయి. రేపు నీ దాక వస్తాయి. రెడీగా ఉండు.
తాతయ్య ఏడుస్తూ వెళ్లిపోయిన తర్వాత దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. కార్తీక్ కాశీని వెళ్లిపోమని చెప్తాడు. దీప కోసం కార్తీక్ హోటల్ మొత్తం వెతుకుతాడు. ఇక దీప బయటకు వెళ్లి గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య అడ్రస్ పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!