Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నిశ్చితార్థం తనకు ఇష్టం లేదని కార్తీక్ కాంచనతో చెప్పాలి అనుకుంటాడు. కాంచన ఫోన్‌లో తన స్నేహితులతో మాట్లాడుతూ కార్తీక్ నిశ్చితార్థం గురించి చెప్పి తెగ హడావుడి చేస్తుంది. ఇక తండ్రిని వెతుకుతాడు. నాన్న కూడా ఉంటే బాగుండేదని నీకో విషయం చెప్పాలి అంటాడు. ఇక కార్తీక్ తన తల్లితో నిశ్చితార్థాన్ని ఆపాలి అంటాడు. కాంచన రెస్టారెంట్ ఓపెనింగ్‌కి ఈ నిశ్చితార్థానికి సంబంధం పెట్టొద్దని ఇంకా వాయిదాలు వేయడం మా వల్ల కాదు అని నిశ్చితార్థం జరగాల్సింది కరాఖండీగా చెప్పేస్తుంది.
కాంచన: నా ఇన్నాళ్ల అవిటితనం తలచుకొని నేను ఎప్పుడూ బాధ పడలేదురా. ఎందుకో తెలుసా. అని కార్తీక్‌ని దగ్గరకు తీసుకొని.. ఈ కాళ్లే నా మాట విని ఉంటే నా కొడుకు పెళ్లి బాధ్యతలు నా భుజాన వేసుకొని క్షణం తీరిక లేకుండా అన్ని పనులు చేస్తూ హడావుడిగా అటూ తిరిగి పనులు చేసేదాన్ని. కానీ నాకు ఆ దేవుడు ఆ అదృష్టం ఇవ్వలేదురా. కానీ ఏ రోజు కోసం అయితే మీ అమ్మ ఆశగా ఎదురు చూస్తుందో ఆ రోజును మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు. కాళ్లు లేకపోతే ఏం చేతులు ఉన్నాయి కదా. నా ముచ్చట ఎలా తీర్చుకుంటానో చూడు. నేను ఏదీ మిస్ అవ్వకూడదు నా కళ్లతో చూసి సంతోషపడతా.
కార్తీక్: మనసులో.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న నాతల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఎలా చెప్పను. అమ్మతో వద్దు నాన్నతో చెప్తాను.
కాంచన: ఏంట్రా అలా మౌనంగా ఉన్నావ్.
శౌర్య గోడ మీద మళ్లీ కార్తీక్ అని రాసుకొని దాని కిందే దిగులుగా కూర్చొని ఉంటుంది. దీప శౌర్య కోసం పులిహోర చేసి తీసుకెళ్తుంది. తినిపిస్తా అంటే నాకు అవసరం లేదని అనేస్తుంది. నేను అలిగాను అని నాతో మాట్లాడకని అంటుంది. కార్తీక్ దగ్గరకు తీసుకెళ్లవని అంటుంది. కార్తీక్ దగ్గరకు తీసుకెళ్తావా అని అడుగుతుంది. మనకు వాళ్లకి సంబంధం లేదని దీప అంటుంది. దాంతో కార్తీక్‌కి మనకు ఏం సంబంధం లేదా అని శౌర్య అడుగుతుంది. ఇంటికి వెళ్లనివ్వవని రోడ్డు మీద కలిసినా మాట్లాడనివ్వలేదని అంటుంది. వాళ్లంతా మనకు ఏం కాదు అని మనకోసం బాధ పడరని వాళ్లకి మనం సాయం చేశారని మనకు వాళ్లు సాయం చేశారు అయిపోయిందని అంటుంది. ఇక మళ్లీ ఆ కుటుంబంలోకి రాలేను ఎవరి సంతోషాలు దూరం చేయలేనని దీప అనుకుంటుంది.
అనసూయ: అది అసలే నువ్వు చేసిన పనికి పీకల మీద కోపంతో ఉంది. వెళ్లి రెచ్చగొడితే ఊరుకుంటుందా అందుకే రెండు పీకింది.
శోభ: పెళ్లాన్ని తన్నించడమే కాకుండా నువ్వు కూడా తన్నులు తిని వచ్చావ్ నువ్వేం మగాడివయ్యా.
అనసూయ: నువ్వు వీడిని ఇలాగే రెచ్చగొట్టు పోయిన సారి నీ రెండు చెంపలు వాయించింది. ఈ సారి వీధిలో జుట్టు పట్టుకొని లాక్కెళ్లుతుంది.
శోభ: అంత వరకు వస్తే ఊరుకుంటానా మా అమ్మని రంగంలోకి దింపుతా.
అనసూయ: దాని ఆవేశం తెలిసి కూడా ఇలాగే రెచ్చగొడితే నీ మొగుడిని నిజంగానే చంపుతుంది. కూతుర్ని కార్తీక్ గాడికి అప్పగించి జైలుకి పోతుంది. ఇప్పుడు అది అందరినీ వదిలేసి దూరంగా బతుకుతుంది. కొద్ది రోజులు దాని జోలికి వెళ్లొద్దు.
శోభ: అయితే ఇక బిడ్డ రానట్లేనా. సరై అయితే నేను మా చుట్టాల్లో ఎవరో ఒక బిడ్డని పెంచుకుంటా.
అనసూయ: ఎవరి బిడ్డో వాడికి బిడ్డ ఎలా అవుతుందే. వాడికి కూతురుంది. అది నీకు కూతురు అవుతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు.
శోభ: సరే అత్తయ్య మొగుడు మాట నిలబెట్టకోకపోయినా అత్త అయినా నిలబెట్టుకుంటుందేమో చూద్దాం.
జ్యోత్స్న ఇంట్లో అందరూ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటారు. బట్టల గురించి మాట్లాడుకుంటారు. బావకి నేనే డ్రస్ డిజైన్ చేస్తానని జ్యో అంటే వాడికి నీ డిజైన్ నచ్చదని వాడి టేస్ట్ వేరే ఉందని పారు అంటుంది. అందరూ ప్రశ్నించడంతో నాకు నోటి దురద అని తనలో తానే తిట్టుకుంటుంది. కవర్ చేస్తుంది. ఇక శివనారాయణ కోడలితో దీప గురించి అడుగుతాడు. ఇక జ్యోత్స్న దీప ఏదో ప్లాన్ చేస్తుందని అనుకొని తల్లితో తన నిశ్చితార్థానికి దీప ఉండాలని అంటుంది. శౌర్య దీపతో అమ్మమ్మ నీతో ఏం చెప్పిందని అడుగుతుంది. దానికి దీప కార్తీక్‌బాబుకి, జ్యోత్స్నకి పెళ్లి చేస్తారని అంటుంది. మనం కూడా వెళ్తామా అని శౌర్య అడుగుతుంది. మరోవైపు కార్తీక్ పారిజాతం మాటలు తలచుకొని ఆలోచిస్తుంటాడు. నిశ్చితార్థం ఎలా ఆపాలి అని అనుకుంటాడు. ఇక జ్యోత్స్నని చెప్పాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న సూసైడ్ చేసుకుంటానని అనుకున్న మాట గుర్తొచ్చి ఆగిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అవుట్ హౌస్‌లో కార్తీక్.. పారిజాతం బ్లాక్‌మెయిల్ మామూలుగా లేదుగా!