Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode అనసూయ ఇంటికి వచ్చేస్తుంది. కాంచన, శౌర్యలు చూసి చాలా సంతోషిస్తారు. ఇళ్లు బేరం పెట్టానని మంచి బేరం వస్తే అమ్మేద్దామని అంటుంది. కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లారని అడిగితే పని మీద బయటకు వెళ్లారని చిన్న సమస్య అని చెప్తుంది. ఇక కార్తీక్, దీపలు ఉద్యోగాల నుంచి తొలగించిన వారితో కలిసి ధర్నా చేస్తారు. జ్యోత్స్న బయటకు వస్తుంది. కార్తీక్, దీపలు సీఈఓ డౌన్ డౌన్ అనడం చూసి షాక్ అయిపోతుంది. జ్యోత్స్నని చూసి వాళ్లు స్లోగన్స్ ఆపేస్తారు. కార్తీక్ చెప్పి అరవమని అంటాడు.
జ్యోత్స్న: ఈ రకంగా పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా బావ.
కార్తీక్: జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి వీళ్లూ కారణమే.
జ్యోత్స్న: వీళ్లంతా అవుట్ డేటెడ్ బావ 50 ఏళ్లు దాటిన వారిని అందుకే తీసేశా.
దీప: వయసు పెరిగిన వాళ్లు అంటే జ్ఞానం ఉన్నవాళ్లు.
కార్తీక్: మాకు చట్టం తెలుసు న్యాయం తెలుసు. కంపెనీ వాళ్లని తీసేయాలి అంటే 3 నెలల ముందు చెప్పి 3 నెలల జీతం ఇవ్వాలి. అన్నీ అధిగమించి వీళ్లకి న్యాయం చేస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడుతాం. చివరకు నీ కంపెనీ మూత పడుతుంది.
జ్యోత్స్న: బెదిరిస్తున్నావా బావ.
కార్తీక్: బెదిరింపు కాదు హెచ్చరిక.
జ్యోత్స్న: అలిసి పోయి మీరు పడిపోవాలి కానీ జ్యోత్స్న తగ్గేదేలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి.
దీప: కార్తీక్ బాబు జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న ఇంటికి వెళ్లి తాతయ్య గారికి చెప్తే ఆయన ఏమనుకుంటారో.
కార్తీక్, దీప ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు అని దశరథ్ ఇంట్లో చెప్తాడు. ఎంప్లాయిస్‌ని నోటిస్ ఇవ్వకుండా తీసేశారని సమస్య పరిష్కరించాలిని అంటాడు. జ్యోత్స్న చెప్పాలి అనుకున్నది కార్తీక్ చెప్పాలి అనుకున్నది ఇదే అని అనుకుంటారు. ఇంతలో జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఎందుకు ఇలా చేశావో తర్వాత అడుగుతా ముందు దీన్ని ఎలా ఆపుతావో చెప్పు అని అడుగుతాడు. రెస్టారెంట్ అంటే శివనారయణ ఇళ్లు తన నమ్మకాల్ని ఒమ్ము చేస్తే మనవరాలు అని కూడా చూడను అని చెప్తాడు. నా పరువు నడిరోడ్డు మీద పోయేలా ఉందని అంటాడు. దాంతో దశరథ్ పోనివ్వను అని ఉద్యోగులకు సారీ చెప్పడానికి జ్యోత్స్నని తీసుకెళ్తానంటాడు. జ్యోత్స్న రాను అంటుంది. చెప్పింది చేయ్ అని జ్యోత్స్నని తీసుకెళ్తాడు. మరోవైపు స్వప్న ధర్నా గురించి కాశీ వాళ్లకి చెప్పి ఆఫీస్‌కి వెళ్దామంటుంది. దాసు కూడా ఆవేశంతో జ్యోత్స్న చెంప వాయించి చెప్తా అంటే కాశీ నువ్వు తనకి బుద్ధి చెప్పడం ఏంటి వాళ్ల అమ్మానాన్న చూసుకుంటారని కాశీ అంటాడు. కాశీ మనం వెళ్లొద్దని అంటాడు.
దశరథ్ ధర్నా దగ్గరకు వెళ్తాడు. అందరికీ చేతులు జోడించి దండం పెడతాడు. క్షమాపణ చెప్తాడు. జ్యోత్స్న చాలా ఫీలవుతుంది. జ్యోత్స్న కూడా అందరికీ సారీ చెప్తుంది. అందరూ ఎప్పటిలా మీ పోస్ట్‌లో చేరండి అని చెప్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. కార్తీక్ సార్ జిందాబాద్ అంటూ పూల దండ వేసి ఎత్తేస్తారు. దీప లాంటి వైఫ్ మీ జీవితంలో ఉండటం చాలా సంతోషంగా ఉందని అంటారు. కార్తీక్ కావాలనే జ్యోత్స్నని ఉడికిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!