Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ డాక్టర్‌ని కలుస్తాడు. పాపని వెంటనే అడ్మిట్ చేయమని డాక్టర్ చెప్తాడు. కార్తీక్ ఇంటికి వచ్చి శౌర్యని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాలని బ్యాగ్ రెడీ చేయమని దీపతో చెప్తాడు. దీప బ్యాగ్ రెడీ చేస్తూనే కార్తీక్‌ని ప్రశ్నిస్తుంది. కార్తీక్ డబ్బు సర్దుకుంటాడు. డబ్బు ఎందుకు అని అడుగుతుంది. శౌర్యని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేసి తర్వాత డబ్బు వేరే వ్యక్తికి ఇవ్వాలని అంటాడు. దీప చాలా కంగారు పడుతుంది. శౌర్య ఎక్కడికి రాదు అని ఏడుస్తుంది. శౌర్య వెళ్లకూడదని ఏడుస్తుంది.
దీప: నేను అడిగిన దానికి సమాధానం చెప్పి శౌర్యని తీసుకెళ్లండి.
కార్తీక్: శౌర్య నా కూతురు నా కూతురికి మంచి జరుగుతుంది అంటే తండ్రిగా నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంది నీకు అర్థం కాకపోతే మళ్లీ వచ్చి చెప్తా. ఇప్పుడు అంత టైం లేదు. రౌడీ అమ్మకి బాయ్ చెప్పు
దీప: శౌర్యని నేను పంపను. నేను అమ్మతోనే ఉంటానని చెప్పు శౌర్య.
శౌర్య: దీపని హగ్ చేసుకొని బాయ్ అమ్మ.
దీప: అమ్మని వదిలి ఎలా ఉంటావే.
శౌర్య: నాన్న చెప్పారు కదా ఉంటానమ్మా. నువ్వు ఏడిస్తే నేను బాధ పడతాను ఏడ్వకు అమ్మ.
కార్తీక్: మనసులో నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి అయినా నిన్ను బతికించుకుంటా రౌడీ.
దీప వస్తాను అని ఎంత చెప్పినా కార్తీక్ దీపని ఆపి శౌర్యని తీసుకెళ్తాడు. దీప చాలా ఏడుస్తుంది. శౌర్య ఇద్దరు నానమ్మలని హగ్ చేసుకొని బాయ్ చెప్పి బయల్దేరుతుంది. దీప శౌర్య వాళ్ల వెంట వెళ్తుంది. ఇక కార్తీక్ సైకిల్ మీద ఎక్కించుకొని పాపని తీసుకెళ్తాడు. దీప డల్ అయిపోతుంది. కార్తీక్ మధ్యలో సైకిల్ ఆపి రోడ్డు చివర ఉన్న అమ్మవారి దగ్గరకి తీసుకెళ్లి దండం పెట్టిస్తాడు. ఇక శౌర్య తండ్రితో నాన్న నేను నిన్ను వదిలేసి ఎక్కడా ఉండలేను అంటుంది. ఆ మాటతో కార్తీక్ కన్నీరు పెట్టుకొని పాపని హగ్ చేసుకుంటాడు. నాన్న ఏం చెప్పినా సరే అనమన్నావ్ అందుకే సరే అన్నాను కానీ నాకు ఎవరి ఇంటికి వెళ్లాలి అని లేదు అని శౌర్య అంటుంది. శౌర్య మాటలకు కార్తీక్ ఏడుస్తాడు. ఒక్క వారం రోజులు అమ్మకి దూరంగా ఉండాలి రౌడీ అని నాన్న చెప్పినట్లు వినమని అంటాడు.
అనసూయ కాంచనతో కార్తీక్ పాపని తన ఫ్రెండ్ ఇంట్లో వదిలిపెడతా అంటే ఎందుకు ఒప్పుకున్నావ్ అని అడుగుతుంది. కార్తీక్ ఏం చేసినా అందులో మరోవ్యక్తికి మంచే ఉంటుందని అందుకే వాడిని ఏం అడగను అంటుంది. దాంతో అనసూయ తన కొడుకు గురించి ఆలోచించి ఎంత తేడా అనుకుంటుంది. శౌర్యని ఫ్రెండ్ ఇంట్లో పెట్టడానికి కారణం ఏంటో తెలీదు అంటే దానికి అనసూయ పాపని గుండె సమస్య ఉంది శౌర్యని తీసుకెళ్లి డబ్బు కూడా తీసుకెళ్లారంటే ఏదో అనుమానంగా ఉందని కార్తీక్ కూడా నవ్వు లేకుండా ఉన్నాడని చెప్తుంది. దాంతో కాంచన మందులతో తగ్గిపోతుంది అన్నాడు కదా అంటే మనతో అబద్ధం చెప్పొచ్చని అనసూయ అంటుంది. దాంతో కాంచన కార్తీక్ వచ్చిన తర్వాత దీపకి తెలీకుండా అడుగుతానని అంటుంది.
కార్తీక్ పాపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. కాశీ కూడా అక్కడే ఉంటాడు. కార్తీక్ పాపని కాశీ దగ్గర ఉంచి డబ్బు కట్టడానికి వెళ్తాడు. తర్వాత నర్స్ కార్తీక్‌కి రూం చూపిస్తుంది. హాస్పిటల్‌కి ఎందుకు తీసుకొచ్చావ్ అని కార్తీక్‌ని శౌర్య అడుగుతుంది దానికి కార్తీక్ వారం నువ్వు ఇక్కడే ఉంటావని చెప్తాడు. రోజూ నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నావ్ కదా అందుకే డాక్టర్‌కి చెప్పాను దాంతో నీకు టెస్టులు చేస్తారని అప్పుడు మందులు వేసుకోవడం అవసరం లేదని అంటాడు. ఇక కార్తీక్ అక్కడే ఉంటాను అని తాను లేనప్పుడు కాశీ ఉంటాడని దీపకి ఈ విషయం తెలిస్తే బాధ పడుతుందని అమ్మతో చెప్పొద్దని ప్రామిస్ వేయించుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!