Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపలు ఫ్యామిలీతో బయటకు వచ్చేస్తారు. ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. కార్తీక్ దీపతో నీ మెడలో తాళి కట్టాను కానీ ఏడు అడుగులు వేయలేదు ఇప్పుడు వడ్డీతో సహా వేస్తున్నాను అని అంటాడు. ఇంత జరిగినా మీకు బాధ లేదా అని దీప ఏడుస్తూ కార్తీక్‌ని అడుగుతుంది.
దీప: నాది ఎలాగూ నడిరోడ్డు మీద జీవితమే. నాకు ఆశ్రయం ఇచ్చి మీరు నడిరోడ్డు మీదకు వచ్చారు ఇది నాకు కత్తికోతలా ఉంది. నేను లేకపోయి ఉంటే మీరు ఇదే రోడ్డు మీద కారులో తిరిగేవాళ్లు ఇప్పుడు మండుటెండలో ఇలా కాలినడకన తిరుగుతున్నారు. డబ్బులో బతకడం తేలికే కానీ డబ్బు లేకుండా పేదరికంలో బతకడం చాలా కష్టం బాబు. ఆ రోజు నా చేయి వదిలేసి ఉంటే ఇప్పుడు మీకు ఈ దుస్థితి వచ్చేది కాదు.
కార్తీక్: తోడుగా నువ్వుంటే చాలు దీప అనుకున్నది సాధించవచ్చు. నాకు నీతో పాటు మరో ముగ్గురు తోడు ఉన్నారు నేను ఎందుకు బాధ పడాలి ఎందుకు భయపడాలి.
శౌర్య: నాన్న నేను ఇంక నడవలేను కాళ్లు నొప్పి వస్తున్నాయ్ ఎక్కడైనా కాసేపు కూర్చొందామా.
కార్తీక్: రౌడీ అక్కడో గుడి ఉంది వెళ్లి కూర్చొందాం పదండి.
కార్తీక్ ఫ్యామిలీని గుడిలో చెట్టు నీడన కూర్చొపెట్టి మంచి నీరు తీసుకొచ్చి అమ్మ భార్యకి ఇస్తే వాళ్లు వద్దు అనేస్తారు. ఇక శౌర్య వాష్ రూమ్ అంటే అనసూయ తీసుకెళ్తుంది. ఇక మనం ఎక్కడ ఉంటాం అని కాంచన అడుగుతుంది. దానికి దీప కడియం బాబాయ్‌కి చెప్తామని అంటుంది. బయట వాళ్లకి వద్దని కాంచన అంటుంది. దీప మీ చెల్లికి చేయండి అంటే కాంచన దానికి వద్దు కానీ దాసు అన్నయ్యకి చేయమని అంటుంది. కార్తీక్ కాల్ చేస్తే స్వప్న, కాశీ, దాసులు గుడికి వస్తారు. ఏమైందని స్వప్న అడిగితే శౌర్య మేం ఊరు వెళ్తున్నాం కారు కూడా వదిలేసి వచ్చాం అని అంటుంది. అనసూయ పాపని తీసుకొని గుడిలోకి వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ జరిగిందంతా స్వప్న వాళ్లకి చెప్తాడు. సవాలు చేసి బయటకు వచ్చానని అంటాడు. ఎంత పని చేశావ్ అల్లుడు అదంతా నీదే కదా అని అంటాడు. నాది కానిది నాకు వద్దని కార్తీక్ అంటాడు. ఇక స్వప్న మంచి పని చేశావ్ అన్నయ్య పద మన ఇంటికి వెళ్లామని అంటుంది. కార్తీక్ వద్దని అంటాడు. ఇక కాంచన అద్దెకు ఓ ఇళ్లు కావాలని అంటే దాసు సరే అని అందర్ని తీసుకొని బయల్దేరుతారు. ఇక దీపని చూసి సొంత మనవరాలినే శివన్నారాయణ రోడ్డున పడేశాడని అనుకుంటాడు.
ఇక సుమిత్ర కాంచనను నేను బతిమాలుతా వెళ్లి తీసుకొస్తా అని అంటుంది. దానికి శివనారాయణ ఒప్పుకోడు వాళ్లంతట వాళ్లు వస్తే ఓకే కానీ నేను వెళ్లను అంటాడు. నేను వెళ్తా అని సుమిత్ర అంటే దానికి పెద్దాయన నేను అంటే నా ఫ్యామిలీ అంటాడు. ఇక సుమిత్ర భర్తని కూడా బతిమాలు తుంది. నా చెల్లి నా మాట కూడా వినలేదని మెడలో తాళి తప్ప అన్నీ తీసేసి వెళ్లిపోయిందని చెప్తాడు. ఇక సుమిత్ర దీనంతటికి కారణం నువ్వే అని జ్యోత్స్నతో అంటుంది. మన ప్రేమ ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదని అంటుంది. నువ్వు అసలు నా కూతురేనా అంటే దానికి జ్యోత్స్న నేను నీ కూతురు కాదు ఆ దీపే నీ కూతురు అని అంటుంది. పారిజాతం జ్యోత్స్నని తీసుకొని వెళ్లిపోతుంది. దీప తెలివిగా ఫ్యామిలీని తీసుకెళ్లిపోయిందని అంటుంది. దానికి జ్యో బావ ఇలా చేస్తాడని అనుకోలేదు అంటుంది. దానికి పారిజాతం దీప మెడలో తాళి కట్టినందుకు వాడు అనుభవించి నీ విలువ తెలుసుకుంటాడని అంటుంది.
కార్తీక్ వాళ్లని దాసు ఓ అద్దె ఇంటి దగ్గరకు తీసుకొస్తాడు. శౌర్య ఇళ్లు చిన్నది నచ్చలేదు అంటే నీకు నచ్చుతుంది లోపలికి వెళ్లి చూడు అని పంపుతాడు. ఇక దాసు ఓనర్ని కార్తీక్‌కి పరిచయం చేస్తాడు. 20 వేలు అద్దె మూడు నెలలు అడ్వాన్స్ ఇమ్మని అంటాడు. అందరూ నోరెళ్ల బెడతాడు. ఎంతైనా కట్టగలను అనే స్థాయి నుంచి నేను అంత కట్టలేను అనే స్థితికి వచ్చారు కార్తీక్ బాబు అని దీప ఫీలవుతుంది. ఇక కార్తీక్ రెండు నెలల అడ్వాన్స్ ఇస్తానని చెప్పి మనసులో అందరి ముందు ఆ డబ్బు కూడా లేదు ఎలా అనుకుంటాడు. ఇక కార్తీక్ స్వప్న వాళ్లకి వెళ్లిపోమని అంటాడు. స్వప్న భోజనం తీసుకొస్తా అంటే కార్తీక్ వద్దని అంటాడు. స్వప్న ఏడుస్తుంది. కార్తీక్ ఇంటికి వచ్చాక పెడుదువులే అని పంపేస్తాడు. దాసు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కార్తీక్ దీప వాళ్లని కూడా లోపలికి పంపేసి అడ్వాన్స్‌గా ముబైల్ ఇస్తాడు. డబ్బు ఇచ్చి ఫోన్ తీసుకుంటా అంటాడు. అది దీప చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పట్నం చేరుకున్న త్రినేత్రి బామ్మ.. ఇంట్లో రచ్చ చేస్తున్న వల్లభ!