Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప రెస్టారెంట్‌లో కూరగాయలు కట్ చేస్తూ గౌతమ్ గురించి ఆలోచిస్తుంది. కార్తీక్ దీప దగ్గరకు వచ్చి ఏంటి సీరియస్‌గా ఉన్నావ్ అని అడుగుతాడు. ఆడదాని మనసు తెరిచిన పుస్తకం అంటారు కదా చదువుకోండి అని దీప అంటుంది. ఆడదాని మనసు చదవాలి అంటే ప్రేమ భాష తెలియాలి నేర్పిస్తావా  అంటాడు.  

కార్తీక్: నిన్ను కోనేటి దగ్గర హగ్ చేసుకోవాలి అనిపించింది దీప. ఇక్కడ ఎవరూ లేరులే. హగ్ అంటే తప్పుగా అనుకోవద్దు. ప్రేమగా హగ్ చేసుకో. గులాబి ఇచ్చి తలలో పెట్టుకోమంటాడు.దీప: ఎందుకుకార్తీక్: రోజుకో పువ్వు ఇస్తా.దీప: ఎవరికికార్తీక్: నా భార్యలో ఉన్న ప్రాణ దాతకి ప్రాణదాతలో ఉన్న నా భార్యకి.కావేరి: కార్తీక్ నేను దీపతో మాట్లాడాలి. జ్యోత్స్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు. తనే నీతో ఆపించింది దీప. సత్తిపండుతో కూడా తనే నిజం చెప్పకుండా చేసింది. నిశ్చితార్థం ఆపడం పెద్ద అబద్ధం. కార్తీక్ జీవితంలోకి మళ్లీ రావాలి అనుకుంటుంది. మళ్లీ పెళ్లికి ఒప్పుకుంది. ఇదంతా నీ కోసం పన్నిన కుట్ర. అని దీపకు మొత్తం చెప్తుంది.

జ్యోత్స్న దగ్గరకు దీప..

చిన్నత్త మాటలకు దీప షాక్ అయిపోతుంది. గౌతమ్‌ని  రెచ్చ గొట్టి నీ మీదకు పంపింది కూడా జ్యోత్స్ననే. చివరకు బకరా అయ్యేది వాడే. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్ అని చెప్తుంది.  వంటలక్క ఆవేశంతో రెచ్చిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటుంది. వెంటనే నీ పరుగును ఆపాలి వస్తున్నా జ్యోత్స్న అని బయల్దేరుతుంది. 

పెళ్లి ఇండియాలో కాదు..

శివన్నారాయణ పారుతో జ్యోత్స్నని ఎక్కడకి తీసుకెళ్లావని అడుగుతారు. దాసు ఇంటిక వెళ్లడం తగ్గించు అని చెప్తారు. పెళ్లికి పిలవను అని చెప్తుంది. దాంతో ఆయన వాడు రాడులే పెళ్లి ఇండియాలో కాదు అని అంటారు. పెళ్లి ఫారిన్‌లో అయితే నా పని అయిపోతుందని జ్యోత్స్న తన ఇంటిలోనే పెళ్లి జరగాలి అని అదే తన కోరిక అని అంటుంది. వచ్చే వారమే పెళ్లి ఏంటి అని అంటుంది. నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందామని తాత జ్యోత్స్నతో చెప్తారు. 

మా నాన్నని నేను బతిమాలుతా.. 

దీప ఇంటికి వెళ్లి మొత్తం కాంచనకు చెప్తుంది. నా మేనకోడలు ఇలా తయారైందేంటి అని కాంచన అంటుంది. దీప ఇంటికి వెళ్లి చెప్తానంటే కాంచన ఆపుతుంది. అనసూయని తీసుకొని కాంచన తన ఇంటికి వెళ్తానని అంటుంది. నాన్న కాళ్ల మీద పడి అయినా పెళ్లి ఆపమని చెప్తానని అంటుంది. దీప ఆపినా వినకుండా కాంచన వెళ్తుంది. 

అపశకునం వచ్చింది..

శివన్నారాయణ కోడలితో గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్తానని చెప్తాడు. ముందుగానే పెళ్లి పెట్టించేద్దామని జ్యోత్స్నని నేను ఒప్పిస్తానని అంటాడు. పారుతో ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి జ్యోత్స్నకి అస్సలు తెలీకూడదు అని చెప్తారు. ఇక సుమిత్రకు ఎదురు రమ్మని అంటారు. పారు నేను వస్తాను అని అంటే వద్దని తిడతాడు. సుమిత్ర ఎదురొస్తుంది. ఇంతలో కాంచన ఇంటికి వస్తుంది. కొందరు ఎదురైతే ఆ రోజు ఆ పని ఆపుకోవాలి అంటాడు. కాంచన పెద్దాయనతో నేను నీ కోసమే వచ్చానని అంటుంది. 

ఈ పెళ్లి ఆపేయ్ నాన్న..

గౌతమ్ మంచోడు కాదని పెళ్లి చేస్తే మీ కూతురి గొంతు కోసినట్లే అని అంటుంది అనసూయ. దాంతో పెద్దాయన మీరంతా నా మనవరాలి గొంతు ఎప్పుడో కోసేశారు అంటారు. కాంచన గౌతమ్ మంచోడు కాదని జ్యోత్స్న జీవితం నాశనం చేయొద్దని అంటుంది. నన్ను తిట్టినా పర్లేదు ఈ పెళ్లి ఆపండి అంటుంది. నీ కొడుకు నీ ఇష్టప్రకారం జరిగింది నా మనవరాలి పెళ్లి కూడా నీకు ఇష్టం వచ్చినట్లే కావాలా అని అడుగుతారు. ఈ పెళ్లి ఆగదు అని పెద్దాయన అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!