Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప దశరథ్‌ని కాల్చేసిందని కార్తీక్ కాంచన, అనసూయలకు చెప్తాడు. దీపని అరెస్ట్ చేశారని చెప్తారు. అన్నయ్యకి ఎలా ఉందిరా నేను వెళ్తానురా తీసుకెళ్లరా అంటే మనల్ని తాత చూడొద్దు అన్నారు అని చెప్తాడు. ఆయన ఎవర్రా రావొద్దు అనడానికి మా అన్నయ్యరా అని కాంచన అంటుంది. అనసూయ కూడా హాస్పిటల్‌కి వెళ్లి దశరథ్‌ని చూసి తర్వాత దీప దగ్గరకు వెళ్దామని అంటారు.
కార్తీక్ ఇద్దరినీ ఆపుతాడు. నీ భార్య వల్లే నా భర్తకి ఈ పరిస్థితి వచ్చింది అని అత్త తిట్టింది.. దయచేసి ఇక్కడికి రావొద్దు అని తాత పేరు పేరున చెప్తాడు. వద్దమ్మా అని కార్తీక్ అంటాడు. ఇందాక అందుకే గుండె దడగా అనిపించి కళ్లు తిరిగి పడిపోయాను అని ముందే నాకు తెలిసిపోయిందని కాంచన ఏడుస్తుంది. దీప కాల్చలేదు అంది కానీ తన చేతిలో గన్ ఉండటం చూశానని కార్తీక్ అంటాడు. దీపని వెళ్లకుండా ఆపాల్సిందని అనసూయ ఏడుస్తుంది. ఇద్దరినీ ఏడుపు ఆపమని కార్తీక్ చెప్తాడు. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్తాను మీరు ఏం తెలీనట్లు ఉండండి అని కార్తీక్ అంటాడు.
హస్పిటల్ దగ్గర అందరూ ఏడుస్తుంటారు. ఇంతలో డాక్టర్ రావడంతో అందరూ దశరథ్‌కి ఎలా ఉందని అడుగుతారు. దాంతో డాక్టర్ బులెట్ హార్ట్‌కి దగ్గరగా తగిలింది ఆయన కళ్లు తెరిచే వరకు ఏం చెప్పలేం అని అంటారు. తర్వాత శివన్నారాయణ ఒక్కరినే పిలుస్తారు. సుమిత్ర మామయ్యని ఆపి మిమల్ని ఒక్కర్నే రమ్మంటున్నారు అంటే నాకు ఏదో భయంగా ఉందని అంటుంది. నేను నా భర్తని చూడాలి ఆయనకు ఏదో అయింది అని ఏడుస్తుంది. ఆ గుండెకు ఏమైనా అయితే నా గుండెకు ఆగిపోతుంది అంటారు. అందరూ ఏడుస్తారు. ఇక పెద్దాయన డాక్టర్ దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే దశరథ్ గారు బతకడం చాలా కష్టం అని చెప్తారు. శివన్నారాయణ షాక్ అయి ఏడుస్తారు. ఆడవాళ్లకి ఏం చెప్తాం తట్టుకోలేరు అని మీకు చెప్తున్నా అంటారు. వెంటిలేటర్ మీద పెట్టామని చెప్తారు. ఎంత సేపు బతుకుతారో తెలీదు అంటారు. 48 గంటల్లో ఆయన కళ్లు తెరిస్తే సరే లేదంటే మీ ఫ్యామిలీని మెంటల్‌గా ప్రిపేర్ చేయండి అని అంటారు.
శివన్నారాయణ కుప్పకూలిపోయి ఏడుస్తారు. అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని ఎందుకు ఏడుస్తున్నారు అంటే పెద్దాయన కళ్లు తుడుచుకొని వాడికి ఏం కాదు వాడికి ఏం కాదు అని ఏడుస్తారు. పెద్దాయన్ని చూసి అందరూ ఏడుస్తారు. ఆ దీప మనల్ని బతకనిచ్చేలా లేదని ఎవరికీ దశరథ్ ఏమైనా అయితే దీపని బతనివ్వకూడదు అంటుంది. మనం కార్చే ప్రతి కన్నీటికి దీప సమాధానం చెప్పాలి అని జ్యోత్స్న అంటుంది.
జైలులో పోలీస్ దీపతో దశరథ్ గారికి ఆపరేషన్ జరిగిందని అతను బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారని బులెట్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కి పంపామని ఆయనకు ఏమైనా అయితే నీకు యావజ్జీవశిక్షి పడుతుందని అంటారు. దీప ఏడుస్తుంది. దశరథ్‌కి ఏం కాకూడదు అని కోరుకుంటుంది. ఉదయం శౌర్య దిగులుగా గుమ్మం దగ్గర నిల్చొని ఉంటుంది. కార్తీక్ అనసూయ వాళ్లతో బస్ వస్తే పాపని స్కూల్‌కి డ్రాప్ చేయమని చెప్తాడు. కార్తీక్ పని ఉందని బయటకు వెళ్తానని అంటాడు. అమ్మ ఎక్కడుందని శౌర్య అడుగుతుంది. ఎప్పుడొస్తుందో చెప్పమని అంటుంది. నాన్న ఏం చేసినా నీ కోసమే అని కార్తీక్ పాపకి సర్దిచెప్తాడు.
డాక్టర్ దశరథ్‌ని చెక్ చేస్తారు. జ్యోత్స్న తల్లికి ఇంటికి వెళ్లి రెస్టు తీసుకోమని నాన్న దగ్గర నేను ఉన్నానని అంటుంది. ఆయన కళ్లు తెరిచే వరకు నాకు నిద్ర పట్టదు అని సుమిత్ర ఏడుస్తుంది. ఇంతలో శివన్నారాయణ వస్తే డాక్టర్లు ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. పెద్దాయన ఏడుస్తారు. పారు మనసులో ముసలోడి వాలకం చూస్తుంటే దశరథ్ టపా కట్టేస్తాడేమో అని అనుకుంటుంది. జ్యోత్స్న తాతతో డాడీకి ఏం కాదు నా పెళ్లి డాడీ చేతుల మీదగా జరగాలి డాడీ లేస్తారు. డాడీ లే డాడీ అని ఏడుస్తుంది. ఇంతలో శివన్నారాయణకి ఎస్‌ఐ గారు కాల్ చేసి పోలీస్ స్టేషన్‌కి రమ్మని అంటారు. దీపకి బైల్ కోసం బావ ప్రయత్నిస్తున్నాడేమో అని జ్యోత్స్న అంటే దీప బయటకు రాకూడదు అని సుమిత్ర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!