అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today May 30th: కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!

Karthika Deepam 2 Serial Today May 30th: జ్యోత్స్న సూరజ్ చెప్పినట్లు చేయడానికి అంగీకరించడకపోవడం పెద్దాయన మాత్రం చేయాల్సిందే అని తేల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. జ్యోత్స్న చేసిన పనికి సూరజ్ ఇంటికి రావడంతో శివన్నారాయణ ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జ్యోత్స్న చేసిన అవమానంతో తన పరువు పోయిందని సూరజ్ ఇంటికి వచ్చి న్యాయం చేయమని కోరుతాడు. అందుకు డబ్బులు అవసరం లేదు, నా గౌరవం తిరిగి కావాలి" జ్యోత్స్న సారీ చెప్పి తన షాప్ ముందు ఫ్లెక్సీ  పట్టుకొని నిల్చొని గంట సేపు జ్యూస్ సర్వ్ చేయాలని కండీషన్ పెడతాడు.. జ్యోత్స్న అలా చేస్తేనే ప్రజలకు తన షాప్‌లో కల్తీ లేదని, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని అర్థమవుతుంది సూరజ్ అంటాడు. సూరజ్ పెట్టిన కండీషన్‌కి జ్యోత్స్న ఒప్పకుంటుందా.. ఇంట్లో వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ రోజు(మే 30న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారుగా..

జ్యోత్స్న తన షాప్ ముందు గంట సేపు జ్యూస్‌లు అమ్మాలి.. ఫ్లెక్సీ పెట్టాలి అని సూరజ్ చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. ఈ నిర్ణయానికి నేను ఒప్పుకోను అని జ్యోత్స్న అంటుంది. కానీ కార్తీక్ మాత్రం చాలా తెలివిగా నువ్వు పెద్ద సెలబ్రిటీవి.. "నీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు అక్కడ జ్యూస్ సర్వ్ చేస్తే అది అవమానం కాదు. మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని అంటాడు. 

Also ReadUpcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

 
కార్తీక్ ఆ బాధ్యత నీదే..

శివనారాయణ జ్యోత్స్న తల్లిదండ్రులతో ఏం చేద్దాం అని అంటే నా కూతురు తప్పు చేసింది ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని అంటారు. దాంతో శివన్నారాయణ సూరజ్‌కి సపోర్ట్ చేస్తాడు. సూరజ్ కోరినట్టే జరగాలని నిర్ణయించి  ఆ ఏర్పాట్ల బాధ్యతను కార్తీక్‌కి అప్పగిస్తాడు.

ఇప్పుడేం చేద్దాం బావ..

పెద్ద సార్ ఆర్డర్ చేశారు ఇప్పుడేం చేస్తాం బావ అని దీప అడుగుతుంది. దానికి కార్తీక్ రేపటి కార్యక్రమానికి ఇప్పుడు ఫొటో షూట్ చేద్దాం అని అంటాడు. అందుకు జ్యోత్స్నని బయటకు తీసుకెళ్లి ఖాళీ ఫ్లకార్డు పట్టుకొని ఫొటోలు తీస్తాడు. జ్యోత్స్న ఇరిటేటింగ్‌గా ఫొటోలకు ఫోజులిస్తుంది. 

బాగా మొండోడురా..

కార్తీక్ ఆ అబ్బాయి వెళ్లిపోయాడా.. చాలా మొండోడిలా ఉన్నాడురా.. ఆత్మాభిమానం కోసం ఇంత చేశాడు.. ఇలాంటి వాడు మన ఆఫీస్‌లో ఉండాలిరా అని శివనారాయణ అంటాడు.

నువ్వు అరటి పండు తింటే నా పళ్లు ఊడుతున్నాయ్..

జ్యోత్స్న పారుతో అసలు ఇదంతా నీ వల్లే జరుగుతుంది. అందరికీ నువ్వు లేని పోని ఆలోచనలు ఇస్తున్నావ్. నువ్వు అరటి పండు తింటే నా పళ్లు ఊడుతున్నాయ్.. అయినా నేను ఫ్లెక్సీలు పట్టుకుంటే వాడి పరువు నిలబడుతుంది అంట కదా.. నేను వెళ్తే కదా అసలు వాడి బిజినెస్ డెవలప్ అవ్వడానికి.. నాకే  తల పొగరు అంటే వాడికి డబుల్ ఉంది.. ఏం చేస్తే నా ఇగో హర్ట్ అవుతుంది అదే చేశాడు అని అంటుంది. రేపు వాడు ఉండడు.. వాటి స్టాల్ ఉండదు.. మన లాంటి డబ్బున్న వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తా అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న మాటలు వింటే ఏదో ప్రమాదకరమైన ప్లాన్ చేస్తోందేమో అన్న భావన కలుగుతుంది.

Also ReadPeddi Pre Release Event - విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

అల్లుడు ఉద్యోగం చేయడా..

కాశీ మీ నాన్న దగ్గర డ్రైవర్‌గా చేశాడు ఇప్పుడు మీ నాన్న సీఈఓ కాదు కదా ఇంకేమైనా చూసుకుంటే బాగున్న అని కావేరి జ్యోత్స్నతో అంటుంది. ఆ మాటలు విన్న కాశీ హర్ట్ అయిపోయాడని స్వప్న అనుకుంటుంది. కానీ కాశీ మాత్రం మా అమ్మ అయినా ఇలాగే అంటుంది కదా.. కాకపోతే నేను ఉద్యోగం చేయకుండా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నా అని అంటాడు. ఏం చేద్దాం అని స్వప్న అంటే హెల్దీ ఫుడ్ డెలివరీ చేద్దాం అని చెప్తాడు. ఐడియా సూపర్ అని స్వప్న పొంగిపోతుంది. 

ఎపిసోడ్ చివర్లో అసలు హైలైట్..

 జ్యోత్స్న శివన్నారాయణతో "నేను సూరజ్ దగ్గరకు వెళ్లను. తను చెప్పినట్లు చేయను.. మీరు మాట వెనక్కి తీసుకోండి.. రేపు తనకి డబ్బు పంపేయండి" అని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. శివనారాయణ, దశరథ్ ఒప్పుకోరు. ఈ ఒక్క కారణంతో నువ్వు సీఈఓ పదవికి అనర్హురాలివి.. సీఈవో కావాలంటే డబ్బు, అందం మాత్రమే సరిపోవు. మనుషుల్ని గౌరవించడం తెలుసుకోవాలి. నీలో ఆ లక్షణం కనిపించడం లేదు.. నాకు మనవరాలిగా మాత్రమే ఉంటావా.. నా ఆస్తికి వారసురాలిగా ఉంటావో నువ్వే నిర్ణయించుకో అని అంటారు. దాంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. మీ తాత గురించి అయినా నువ్వు వెళ్లాల్సిందే అని పారు జ్యోత్స్నతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

జ్యోత్స్న నిజంగా సూరజ్ షాప్‌కి వెళ్తుందా? లేక తన ప్లాన్ అమలు చేస్తుందా? ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది?  ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today June 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్రేమలో ఇందు – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్రేమలో ఇందు – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
Karthika Deepam 2 Serial Today June 13th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి ఐలవ్‌యూ చెప్పిందా! సూరజ్ ఎవర్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు? ఒకే ఇంట్లో 'జ్యోరజ్'
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి ఐలవ్‌యూ చెప్పిందా! సూరజ్ ఎవర్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు? ఒకే ఇంట్లో 'జ్యోరజ్'
Godavari Serial Today June 13th: 'గోదావరి' సీరియల్: జానుతో తిరుగుతున్నావ్ అంట ఏంటి సంగతి! తోట విషయంలో ఏదో తేడా కొడుతుందన్న జాను!
'గోదావరి' సీరియల్: జానుతో తిరుగుతున్నావ్ అంట ఏంటి సంగతి! తోట విషయంలో ఏదో తేడా కొడుతుందన్న జాను!
Nindu Manasulu Serial Today June 13th: నిండు మనసులు: అర్ధరాత్రి.. ఐస్‌క్రీమ్.. పక్కనే లవర్ బాయ్.. అదిరిపోయిందమ్మా ప్రేరణ! అల్లరి మామూలుగా లేదుగా!
నిండు మనసులు: అర్ధరాత్రి.. ఐస్‌క్రీమ్.. పక్కనే లవర్ బాయ్.. అదిరిపోయిందమ్మా ప్రేరణ! అల్లరి మామూలుగా లేదుగా!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Wamiqa Gabbi : వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
MrBeast 500 Million YouTube Subscribers:యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
Embed widget