Karthika Deepam 2 Serial Today May 26th: కార్తీకదీపం సీరియల్: దక్షిణామూర్తిని కాపాడిన శివనారాయణ.. జ్యోత్స్నకు పెద్ద అవకాశం దొరికిందా!
Karthika Deepam 2 Serial Today may 26th: కార్తీక్, దీపలు శివనారాయణ శత్రువుని కాపాడిన విషయం ఇంట్లో చెప్పేయాలని జ్యోత్స్న అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కార్తీక్, దీపలు కలిసి గుడికి వెళ్లడానికి జ్యోత్స్న పర్మిషన్ ఇవ్వడం.. కార్తీక్ దీప సరదాగా బయటకు వెళ్లడం.. తదితర ఆసక్తికర సీన్స్‌తో సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది.. ఈ రోజు(మే 26న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సుమిత్ర తండ్రికి యాక్సిడెంట్..
కార్తీక్, దీప సరదాగా గుడికి వెళ్లి వస్తుంటారు. దారిలో సుమిత్ర తండ్రి దక్షిణామూర్తి కారు చెడిపోవడంతో రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో దక్షిణామూర్తి అటుగా వెళ్తున్న కార్తీక్‌ని చూసి కాంచన కొడుకు అని గుర్తు పట్టి కార్తీక్ అని పరుగులు తీస్తాడు. కార్తీక్ వాళ్లు చూసి స్కూటీ ఆపి తాత పిలుస్తున్నాడు ఇప్పుడేం చేస్తాం అని అనుకుంటాడు. ఇంతలో ఓ కారు స్పీడ్‌గా వచ్చి దక్షిణామూర్తిని ఢీ కొడుతుంది. దాంతో ఆయన పక్కకి పడిపోవడంతో తలకి బలంగా గాయమవుతుంది. దీప, కార్తీక్ వెళ్లి చూసే సరికి విపరీతంగా రక్తం వస్తుంది. దాంతో ఇద్దరూ పెద్దయన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.
కండీషన్ సీరియస్..
డాక్టర్ దక్షిణామూర్తి తలకి తగిలిన గాయం చూసి కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని అంటారు. తాత కుటుంబానికి విషయం చెప్పాలి అని కార్తీక్, దీప తాత కుటుంబం గురించి డ్రైవర్‌ని అడుగుతారు. అవన్నీ నాకు తెలీవు నేను కొత్త డ్రైవర్ని అని ఆయన చెప్తారు.
శ్రీధర్‌కి ఆపరేషన్ చేయాల్సిందే..
కార్తీక్, దీపలు దక్షిణామూర్తిని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌లోనే శ్రీధర్‌ని చూపించడానికి శివనారాయణ తీసుకొస్తాడు. శ్రీధర్‌కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ అంటారు. దాంతో శివన్నారాయణ షాక్ అయిపోతారు. మామయ్యగారు నాది చాలా గట్టి గుండె ఏం కాదు.. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది ఎప్పుడు సర్జరీ చేయాలో నేను చెప్తాను అని శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు.
ఇద్దరూ ఇంకా రాలేదేంటి..
కార్తీక్, దీపలు ఇంకా రాలేదు అని జ్యోత్స్న కార్తీక్‌కి కాల్ చేస్తుంది. ఇంకా రాలేదు ఏంటి అని అడిగితే తెలిసిన మనిషికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్‌కి తీసుకొచ్చాం అని కార్తీక్ అంటాడు. కహానీలు వద్దు బావ అని జ్యోత్స్న అంటే నీకు బుద్ధుందా అని కార్తీక్ అరుస్తాడు. తర్వాత జ్యోత్స్న పారుతో ఎవరికో బాలేదు అంట హాస్పిటల్‌లో ఉన్నారు అని చెప్తుంది.
కార్తీక్, దీపల్ని చూసేసిన శివనారాయణ, శ్రీధర్..
కార్తీక్ దీపలు దక్షిణామూర్తికి ఏం అవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో శివనారాయణ, శ్రీదర్ ఇద్దరూ కార్తీక్ వాళ్లని చూసేస్తారు. మీరు ఇక్కడేంటి అని అడుగుతారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన బతకడం చాలా కష్టం. అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని అంటారు. కార్తీక్ శివనారాయణ వాళ్లతో తెలిసిన వాళ్లు అని చెప్తాడు.
శత్రువుకి సాయం చేస్తున్న శివనారాయణ..
దక్షిణామూర్తికి ప్రమాదం అని తెలియని శివనారాయణ ఆయనకు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు. కార్తీక్ వద్దని చెప్పిన ఆయన ఎవరో నాకు తెలీదు కదా ఒక ప్రాణం కాపాడటం మంచిది కదా అని అంటాడు. శివనారాయణ వెళ్లగానే ఏం అవుతుందో అని కార్తీక్ టెన్షన్ పడతాడు. అంత టెన్షన్ ఎందుకురా అని శ్రీధర్ అడుగుతాడు. ఏం లేదు అని కార్తీక్ అనేస్తాడు.
దక్షిణామూర్తిని చూసేసిన శ్రీధర్..
యాక్సిడెంట్ ఎవరికి అయిందో చూద్దాం అని శ్రీధర్ చూడటానికి వెళ్తాడు. అక్కడ దక్షిణామూర్తిని చూసి బిత్తరపోతాడు. వెంటనే బయటకు వచ్చి ఎంత పెద్ద తప్పు చేశారురా.. మీ తాత ఎవరినైనా ద్వేషిస్తారు అంటే అది ఒక్క దక్షిణామూర్తి మాత్రమే.. ఆయనకు రక్తం ఇచ్చి కాపాడుతున్నాను అని తెలిస్తే మీ తాత ఊరుకోడు.. పెను ప్రమాదం జరగకముందే తాతకి నిజం చెప్పేయ్ అని అంటాడు. శివనారాయణ బయటకి రాగానే కార్తీక్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని శ్రీధర్ అంటాడు. తర్వాత చెప్తాడులే అని ఆయన ఎవరు ఎక్కడ ఉన్నారు అని అడిగితే శ్రీధర్ గది చూపిస్తాడు. కరెక్ట్‌గా శివనారాయణ దక్షిణామూర్తిని చూసే టైంకి ఫోన్ రావడంతో వెనక్కి వచ్చేస్తాడు.
త్వరగా వెళ్లిపోదాం కాంచన..
శ్రీధర్ ఇంటికి వెళ్లి కాంచన త్వరగా ఇంటికి వెళ్లిపోదాం పద కాసేపట్లో మీ నాన్నకి నీ కొడుకుకి గొడవ అవుతుందని అంటాడు. అంత కంగారు పడుతున్నారు ఏమైంది అని కాంచన అడిగితే దక్షిణామూర్తి యాక్సిడెంట్ నుంచి శివనారాయణ బ్లడ్ ఇవ్వడం వరకు మొత్తం చెప్తాడు. కాంచన గుండె పట్టుకుంటుంది. జ్యోత్స్న, పారు మొత్తం వినేసి ఈ అవకాశం వాడుకోవాలని అనుకుంటారు.
నా చావు కోరుకున్నవాడు నన్ను కాపాడాడా..
దక్షిణామూర్తి కోలుకోగానే కార్తీక్, దీపలు కలవడానికి వెళ్తారు. తాత నిన్ను కాపాడింది రక్తం ఇచ్చింది మా తాత అని కార్తీక్ చెప్తాడు. నా చావు కోరుకున్నవాడు నన్ను కాపాడాడా నేను నమ్మలేకపోతున్నా అని అంటారు. దీప పెద్దాయనతో మీ వాళ్లు ఎక్కడున్నారు తాత.. డ్రైవర్‌ని అడిగితే ఏం తెలీదు అన్నారు అంటుంది. దాంతో దక్షిణామూర్తి శివనారాయణ అడ్రస్ చెప్పి అక్కడ నా కూతురు ఉంది.. తనని తీసుకొస్తారా అని అంటాడు. కుదిరితే తనని తీసుకురండి.. తను రాదు.,. మీరు ఇక్కడే ఉంటే మిమల్ని తిడతారు. వెళ్లిపోండి అని దీప, కార్తీక్‌లను పంపేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
శివనారాయణ కాపాడింది దక్షిణామూర్తినే అని తెలుసుకున్న జ్యోత్స్న పారు ఇంట్లో రచ్చ చేయాలని అనుకోవడం.. ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















