అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!

Karthika Deepam 2 Serial Today may 23rd: దీప కార్తీక్‌లు జ్యోత్స్నని బుజ్జమ్మా అంటూ బుగ్గలు గిల్లేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న " కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. దీప జ్యోత్స్న ఇంట్లోనే ఉండటం.. దీపని తన తల్లికి దూరంగా ఉంచాలని జ్యోత్స్న ప్రయత్నించడం.. సుమిత్ర దీపని ఒకటి చేయాలని కార్తీక్ ప్రయత్నించడం తదితర ఆసక్తికర సీన్స్‌తో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. ఈ రోజు(మే 23న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇద్దరూ నాకు సమానమే..

జ్యోత్స్న దీప వాళ్లు తమతో పాటు తినడానికి కుదరదు అని చెప్తుంది. ఇప్పుడు కూడా మమల్ని పనివాళ్లలాగే చూస్తున్నావా  అని కాంచన జ్యోత్స్నని అడుగుతుంది. జ్యోత్స్నని మాట్లాడనివ్వు కాంచన అని పారు అంటే.. మనం తర్వాత తిందాం అని కాంచన అంటుంది. ఎందుకు తర్వాత తినాలి ఇది నా తాత ఇల్లు కాదా అని కార్తీక్ అంటాడు. నువ్వు పనోడివి కదా అని పారు అంటే ఎవరికి నీకా.. నువ్వు నా కొడుకు కూతురివి.. వాడు నా కూతురి కొడుకు.. నాకు అందరూ సమానమే.. ఆఫీస్‌ గొడవలు ఆఫీస్‌లో చూసుకోండి.. అని అందరూ తిందాం అని శివన్నారాయణ చెప్తాడు. కాంచన కార్తీక్‌తో ఇది మరీ ఇంత శాడిస్ట్‌లా తయారైందేంటి అని అంటుంది. 

మేం రసమే వండుకొని తిని బతుకుతున్నామే..

అందరూ కలిసి భోజనాలు చేస్తుంటారు. దీప పాపకి రసం తినమని అంటే ఒక్క చారుతో తినే వాళ్లకి కూరలు  గురించి ఏం తెలుస్తుంది అని జ్యోత్స్న అంటుంది. తర్వాత శౌర్య కార్తీక్‌తో నాన్న మనం ఎక్కడ పడుకుంటాం అని అంటే నా దగ్గరే అని కార్తీక్ అంటాడు. సారీ బావ పోటీ పూర్తి అయ్యే వరకు నీ దగ్గర ఎవరూ ఉండకూడదు అని అంటుంది. దానికి దశరథ్ సుమిత్ర పాపని నీ దగ్గర పడుకోపెట్టుకో అని అంటాడు. దీప కూడా నాతోనే పడుకోవచ్చు అని అంటుంది. దశరథ్, కార్తీక్, శివనారాయణ గదిలో పడుకుంటామని అంటారు. జ్యోత్స్న దగ్గర కాంచన పడుకుంటా అని అంటుంది. జ్యోత్స్న చిరాకుగా వెళ్లిపోతుంది. జ్యో వెనకాలే దీప వెళ్తుంది. 

కాశీ హనీమూన్‌కి వెళ్దామా..

స్వప్న కాశీ దగ్గరకు వెళ్లి హనీమూన్‌కి వెళ్దామా అంటుంది. ఇప్పుడు వద్దు మామయ్య గారికి బాలేదు కదా.. మనం వెళ్తే ఎలా అని అంటాడు. అమ్మానాన్నలే వెళ్లమని చెప్పారు అని స్వప్న అంటే వాళ్లు అలాగే అంటారు మనం వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలని అంటాడు. మనం వెళ్తే వాళ్లకి ఏమైనా అయితే మనం చూసుకోవాలి కదా.. అని అంటాడు. దాంతో సరే అని ఇద్దరూ అనుకుంటారు. 

జ్యోత్స్న బుగ్గలు గిల్లేసిన కార్తీక్, దీప

జ్యోత్స్న దగ్గరకు దీప వెళ్లి థ్యాంక్స్ బుజ్జమ్మా అని బుగ్గలు గిల్లేస్తుంది. ఇప్పుడు తనని బుజ్జమ్మకి థ్యాంక్స్ ఎందుకు అని కార్తీక్ అంటే ఈ బుజ్జమ్మ వల్లే నాకు మా అమ్మతో ఉండే అవకాశం వచ్చిందని దీప అంటుంది. అన్నీ బుజ్జమ్మ వల్లే అవుతున్నాయి.. బుజ్జమ్మ వల్లే మనం ఈ ఇంటికి వచ్చాం.. తన వల్లే 5వ తరగతి చదివిన నేను ఈసీఓ రేస్‌లో ఉన్నా అందుకు థ్యాంక్స్ చెప్పాలి.. నీ చిన్న మరదలి పుణ్యమా అని కుటుంబం మొత్తం కలిశాం.. కలిసి భోజనం చేశాం.. ఇద్దరం కలిసి గట్టిగా థ్యాంక్స్ చెప్పాలి అని బుగ్గలు గిల్లేస్తారు. 

ఇది నా ఇల్లు.. వేషాలు వేయకు..

జ్యోత్స్న అరిస్తే దీప అరుస్తావేంటి అని అంటుంది. ఇది నా ఇల్లు అని జ్యోత్స్న అంటే నీ ఇల్లు ఏంటి ఇది నా ఇల్లు.. వేషాలు వేయకు అనిఅంటుంది. నెల రోజుల్లో నీ పెళ్లి అయిపోతుంది బుజ్జమ్మా.. నీది భష్మాసుర జాతకం నీ నాశనం నువ్వే చేసుకుంటావ్ అని అని కార్తీక్ అంటాడు. నన్ను ఎంత ఇబ్బంది పెడితే నువ్వు అంత ఇబ్బంది పడతావ్.. జాగ్రత్త ఆవేశంతో నాశనం అయిపోతావో ఆలోచించి జాగ్రత్త పడతావో నీ ఇష్టం అని అంటాడు. 

అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోమ్మా..

సుమిత్ర శౌర్యని ఒడిలో పడుకో పెట్టుకొని జో కొడుతుంది. దీప వచ్చి కింద పరుచుకుంటూ ఉంటే పైన పడుకోమని సుమిత్ర అంటుంది. నేను కిందే పడుకుంటా అని దీప అంటే నీ కడుపులో బిడ్డ ఉంది కదా అని శౌర్య అంటుంది. దీప నీ కూతురు పెద్దది అయిపోయింది.. నేను చెప్పాల్సిన మాటలు తను చెప్తుంది అని అంటుంది. దీపని బెడ్ మీదకు రమ్మని అంటుంది. దీప కూర్చొని తన కూతురు తల్లి ఒడిలో పడుకోవడం చూసి నేను అలా అమ్మ ఒడిలో పడుకోవాలి అనుకున్నా పోనీలే నా కూతురికి ఆ అదృష్టం దక్కింది అని అనుకుంటుంది. ఏంటి దీప అలా చూస్తున్నావ్ అమ్మ ఒడిలో పడుకొని కథలు వింటూ పడుకోవాలని ఉందా అని అంటుంది. దీప ఏడుస్తూ అవునమ్మా అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలని ఉందని ఏడుస్తుంది. రా దీప నన్నే మీ అమ్మ అనుకో  అని సుమిత్ర పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

దీపని సుమిత్ర తన ఒడిలో పడుకో పెట్టుకోవడం.. జ్యోత్స్న పక్కన కాంచన పడుకొని జ్యోత్స్నకి చుక్కలు చూపించడం ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

జ్యోత్స్న, కాంచన ఎందుకు కలిసి పడుకోవాలని అనుకున్నారు?

జ్యోత్స్నకి చుక్కలు చూపించడానికి కాంచన ఆమె పక్కన పడుకోవాలని అనుకుంది.

కార్తీక్, దీప జ్యోత్స్నకి ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?

జ్యోత్స్న వల్లే దీపకి తన తల్లితో ఉండే అవకాశం వచ్చిందని, కుటుంబం మొత్తం కలిసిందని వారు భావించారు.

స్వప్న, కాశీ హనీమూన్ కి ఎందుకు వెళ్లలేదు?

మామయ్య గారికి బాగోలేకపోవడం వల్ల, వారిని చూసుకోవడానికి స్వప్న, కాశీ హనీమూన్ కి వెళ్ళలేదు.

సుమిత్ర దీపకి ఏమని చెప్పింది?

సుమిత్ర దీపను తన తల్లిగా భావించి, తన ఒడిలో పడుకోమని చెప్పింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today June 17th: కార్తీకదీపం 2 సీరియల్: బొక్కాబోర్లా పడిన జ్యోత్స్న..! సూరజ్ చేసిన పనికి నవ్వులే నవ్వులు!
కార్తీకదీపం 2 సీరియల్: బొక్కాబోర్లా పడిన జ్యోత్స్న..! సూరజ్ చేసిన పనికి నవ్వులే నవ్వులు!
Godavari Serial Today June 17th: 'గోదావరి' సీరియల్: దస్తగిరి కూడా సింహాద్రి మనిషేనా.. జానుకి నిరాశ! తోట విషయంలో అసలేం జరుగుతుంది?
'గోదావరి' సీరియల్: దస్తగిరి కూడా సింహాద్రి మనిషేనా.. జానుకి నిరాశ! తోట విషయంలో అసలేం జరుగుతుంది?
Nindu Manasulu Serial Today June 17th: నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
Podarillu Serial Today June 17th: బాధతో బార్‌కు వెళ్లి మందు ఆర్డరిచ్చిన చక్రి...అక్కడ ఏం జరిగింది..? మందు తాగాడా లేదా..?
పొదరిల్లు: బాధతో బార్‌కు వెళ్లి మందు ఆర్డరిచ్చిన చక్రి...అక్కడ ఏం జరిగింది..? మందు తాగాడా లేదా..?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Letter to Kishan Reddy: ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Kishan Reddy: మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Embed widget