Karthika Deepam 2 Serial Today May 21st: కార్తీకదీపం సీరియల్: మెయిల్ ఐడీ అడిగితే ఓటర్ ఐడీ చూపించిన దీప! క్లాస్ వర్సెస్ మాస్.. సీఈఓ అయ్యెదెవరు?
Karthika Deepam 2 Serial Today may 21st: దీప, జ్యోత్స్న ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode దీప, జ్యోత్స్న ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తారు. జ్యోత్స్న సీఈఓగా ఫైల్ మీద సంతకం పెట్టి.. దీపకి ఇస్తుంది. నువ్వు చదువుకోలేదు కదా అని అంటే దీప 5 వరకు చదువుకుందని చెప్తాడు. ఏదో ఎంబీబీఎస్ అన్నట్లు చెప్తున్నావ్ బావ అని జ్యో అంటే రిచ్‌గా ఉంటే లక్షలు ఖర్చు పెట్టి చదవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన తను చదువుకుంది.. తండ్రి కష్టం చూసి ఆపేసింది అని అంటాడు. కే దీప అని దీప సంతకం పెడుతుంది. కే అంటే అని జ్యోత్స్న అంటే కార్తీక్ బావే నా చిరునామా అని అంటుంది. ఇక జ్యోత్స్న, దీపలకు కొత్త ప్లేస్‌లు చూపిస్తారు. మీకు ఫుల్‌గా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి.. పెండింగ్ ఫైల్స్ మీ టేబుల్స్ మీద ఉన్నాయి అని అంటారు.
దీప, జ్యోత్స్నలకు వారి స్థానాలు చూపిస్తారు. దీప బోర్డు చూసి కార్తీక్ తుడిస్తే నువ్వు తుడవకు బావ షర్ట్ పోతుందని దీప అంటే నువ్వు ఉతకవు కదా అని జ్యోత్స్న అంటే నువ్వు ఉతుకుతావా అని దీప అడుగుతుంది. మా ఇంట్లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి అని జ్యోత్స్న అంటే నేను అయితే చేతితోనే ఉతికి ఆరేస్తా అని దీప అంటుంది. జ్యోత్స్నకి పంజాగుట్టలోని రెస్టారెంట్ అప్పగిస్తారు. దీపని కార్తీక్ అడిగితే ఇంగ్లీష్‌లో ఉంది బావ అని దీప అనడంతో ఇంగ్లీష్ రాదు కదా అని జ్యోత్స్న నవ్వుతుంది. కార్తీక్ చూసి మైత్రీవనం ఇక్కడ కాంపిటేషన్ ఎక్కువ కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని కార్తీక్ అంటాడు. దీపని నేను గెలవనివ్వును అని జ్యోత్స్న అనుకుంటుంది.
శౌర్య కాంచనతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. నానమ్మ కళ్లు క్లోజ్ చేయ్ తాత అని శౌర్య చెప్తుంది. శ్రీధర్ వెళ్లి కళ్లు మూయాలని చూసి ఆగిపోతాడు. పారు చూసి ఏంటి అల్లుడు గారు కళ్లు మూయడానికే భయపడుతున్నారు అని అంటుంది. చంటి దానా ఎప్పుడు వచ్చావ్ అని పారు అడిగితే తాత తెచ్చారు అని అంటుంది. జ్యో గ్రానీ మనం ఆఫీస్‌కి వెళ్దామా అని శౌర్య అంటే మనం ఎందుకే మనం ఆడుకుందాం అని పారు అంటుంది. జ్యోత్స్న కార్తీక్‌కి ఫైల్ చదవమని ఇస్తే కార్తీక్ చదువుతున్నట్లు దీపకి లైన్ వేస్తాడు. జ్యో చూసి బావ ఏం చేస్తున్నావ్ అని అంటే మా ఆవిడకు సైట్ కొడుతున్నా అని అంటాడు. మా ఆవిడను ఈ రోజు నుంచే ప్రేమిస్తున్నా అని అంటాడు. నువ్వు వెళ్లి తాత దగ్గర కూర్చో బావ అని జ్యోత్స్న అంటే నేను వెళ్లను నాకు ఇక్కడే బాగుంది.. ఇలా ఇద్దరి మరదళ్ల మధ్య కూర్చొంటే పాపి కొండలు మధ్య బోటింగ్‌కి వెళ్లినట్లు ఉంది అని అంటాడు. క్యాంటీన్‌కి వెళ్దాం అని కార్తీక్ అనడంతో దీప వెళ్తుంది.
జ్యోత్స్న అక్కడికి వస్తే ప్రైవసీ ప్లేస్‌లోకి రావడం ఏంటి అని కార్తీక్ అంటే తప్పదు రావాలి బావ అని జ్యోత్స్న అంటుంది. ఇది నీది అనే మాట నుంచి తనది అనే మాట త్వరలోనే వస్తుంది మరదలా.. దీప అంటే ఏంటో తను తలచుకుంటే ఏం జరుగుతుందో నీకు ముందు ముందు తెలుస్తుందని కార్తీక్ అంటాడు. దీప జ్యోత్స్నతో కూతురి జోలికి వస్తేనే ఊరుకోలేదు.. కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని దీప అంటుంది. ఇక దీపకి ల్యాప్‌టాప్ ఇస్తారు. ఇదంతా ఏంటిఅని దీప అంటే ఇప్పటి నుంచి అన్నీ ఇందులోనే చేయాలి అని మేనేజర్అంటాడు. కార్తీక్ దీపకి చెప్పబోతే జ్యోత్స్న అడ్డుకొని నువ్వు ఒక్క సలహా ఇచ్చిన నేను తాతకి చెప్పేస్తా అని అంటుంది. మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి అని అంటే దీప దానికి నా దగ్గర ఓటర్ ఐడీ మాత్రమే ఉందని అంటుంది. జ్యోత్స్న పెద్దగా నవ్వుతుంది. ఆఫీస్‌లో అందరూ నవ్వుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















