Karthika Deepam 2 Serial Today May 20th: కార్తీకదీపం సీరియల్: దీప, జ్యోత్స్నలకు మొదలైన పోటీ! సూరజ్ పట్ల దారుణంగా ప్రవర్తించిన జ్యో! నడిరోడ్డు మీదే అంతా నాశనం!
Karthika Deepam 2 Serial Today may 20th: జ్యోత్స్న సూరజ్ స్టాల్ చూసి అధికారులకు ఫోన్ చేసి దాన్ని నాశనం చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode కాంచన దీపని తీసుకొని పుట్టింటికి వస్తుంది. పారుతో చెప్పి బయట ఉన్న బ్యాగ్ తీసుకొని రమ్మని అంటుంది. ఇంత పెద్ద బ్యాగ్ ఏంటి కాంచన అని పారు అడిగితే నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్‌కి వెళ్లాడు.. అనసూయ అక్క, శౌర్య ఊరు వెళ్లారు.. నేను నా కోడలు ఇంట్లో ఇద్దరమే ఉండలేక నా పుట్టింటికి కోడల్ని తీసుకొని వచ్చా.. నా కొడుకు తిరిగి వచ్చే వరకు నేను నా కోడలు నా పుట్టింటిలోనే ఉంటాం అని కాంచన చెప్తుంది. దెబ్బకి జ్యోత్స్న షాక్ అయిపోతుంది.
కాంచన ఈ ఇంట్లో ఉండటానికి అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. నేను ఒప్పుకోను అని జ్యోత్స్న అంటే కార్తీక్‌ని తెచ్చినప్పుడు మేం ఏమైనా అన్నామా అని సుమిత్ర అంటుంది. నాకు దీపకు పోటీ జరుగుతుందని జ్యో అంటే పెద్ద మేడం గారు దానికి దీనికి సంబంధం ఏంటి.. వాళ్ల కొడుకు లేడు అని వాళ్లు పుట్టింటికి వచ్చారు.. అని కార్తీక్ అంటాడు. ఇక కాంచన కార్తీక్‌తో వెటకారంగా బాబు నీకు ఫ్యామిలీ లేదా అని అడుగుతుంది. ఉంది మేడం గారు కానీ మా పెద్ద మేడం గారు కొన్ని కండీషన్లు పెట్టి ఇక్కడే ఉంచేశారు అని అంటాడు. పోనీ మీ ఫ్యామిలీని కూడా తీసుకొని ఇక్కడే ఉంచొచ్చు కదా అని అంటే.. లేదు మేడం నేను పెద్ద మేడం గారి గీత దాటను అని అంటాడు.
శివనారాయణ దశరథ్ దగ్గరకు వెళ్లి థ్యాంక్స్‌రా.. కాంచన ముఖం చూడలేను ఏమో అనుకున్నా కానీ కార్తీక్ ఐడియాతో ఆ బాధ పోయింది అని అంటారు. ఇక జ్యోత్స్న జరిగిన దానికి పారుతో మనం వికెట్ తీద్దాం అనుకుంటే వాళ్లు సిక్స్ మీద సిక్స్ కొట్టేశారు అని అంటుంది. ఇంటికి వెళ్లి మీ మేనత్తని రెచ్చగొట్టడం వల్లే ఇదంతా అయిందని పారు అంటుంది. ఆ దీప ఇంట్లో ఉంటే నేను గెలవలేను గ్రానీ అని జ్యో అంటుంది. దీపని నువ్వు ఆఫీస్‌లో చూసుకో.. నేను ఇంట్లో చూసుకుంటా అని పారు అంటుంది. కాంచన దశరథ్‌ని పక్కకి తీసుకెళ్లి దక్షిణామూర్తి గురించి అడుగుతుంది. వాళ్ల గురించి ఎందుకమ్మా వదిలేయ్ అని దశరథ్ అంటాడు. ఇక దశరథ్ దీప, జ్యోత్స్నలకు దేవుడికి దండం పెట్టి బయల్దేరమని అంటాడు. దీప కాంచన ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత సుమిత్ర ఆశీర్వాదం తీసుకుంటే ఏమని దీవించాలో తెలీయడం లేదు అని సుమిత్ర అంటుంది. దానికి జ్యో నీ కూతురి మీద గెలవాలి అని నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుందమ్మా అని జ్యో అంటుంది.
సుమిత్ర ఆశీర్వదించు అని పారు అంటే నువ్వేదో తేడాగా ప్రవర్తిస్తున్నావ్ పారు అని అంటాడు. వీడికి అనుమానం వచ్చేసిందని పారు అనుకుంటుంది. ఇక సుమిత్ర దీపని దీవిస్తుంది. తర్వాత జ్యోత్స్న కూడా ఆశీర్వదించమని అంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కాలి అని సుమిత్ర అంటుంది. తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ వృథా కాదు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. దానికి కార్తీక్ అవును పెద్ద మేడం గారు.. కన్న తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ వృథా కాదు అని అంటాడు. ఇక జ్యోత్స్న కార్తీక్ కారులో వెళ్తారు. దారిలో జ్యోత్స్న సూరజ్‌ని చూసి కారు ఆపుతుంది. సూరజ్ రోడ్డు పక్కన హెల్దీ ఫుడ్ స్టాల్ పెట్టి బిజినెస్ చేస్తుంటే ఈ ఫ్లాట్ ఫాం గాడా నన్ను అవమానించింది అని కారు దిగి సూరజ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. దాంతో అధికారులు వచ్చి స్టాల్ ఖాళీ చేయమని సూరజ్‌కి చెప్తారు. అన్నీ పడేస్తారు. సూరజ్ ఎంత బతిమాలినా వినరు.. కార్తీక్ చూసి కంప్లైంట్ ఇచ్చింది నువ్వా.. ముందు అది ఆపించు అని అంటాడు. అధికారులు మొత్తం నేలపాలు చేసి స్టాల్ తీసేస్తారు. ఆ టైంలోనే సూరజ్‌కి కార్తీక్ జ్యోత్స్న బావ అని తెలుస్తుంది.
కార్తీక్ సూరజ్‌తో అసలు మీ మధ్య ఏం జరిగిందో అంటే గతంలో జరిగిన గొడవ మొత్తం చెప్తారు. మంచోళ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావ్ అని కార్తీక్ అంటాడు. వీడు పొగరు బోతు బావ అని అంటుంది. ఇక సూరజ్ చేతిలో గతంలో సూరజ్ ఇచ్చిన వంద నోటు ఇచ్చి ఇప్పుడు నీకు ఇది చాలా అవసరం.. నువ్వు ఇచ్చిందే.. డబ్బున్నోళ్లతో పెట్టుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుందని జ్యోత్స్న అంటుంది. బ్రదర్ నేను నీకు సాయం చేస్తా అని కార్తీక్ అంటాడు. ఏం పర్లేదు సార్ మీరు వెళ్లండి అని సూరజ్ అంటాడు. కార్తీక్ జ్యోత్స్నతో నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకుంటావా లేదా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















