Karthika Deepam 2 Serial Today May 18th: కార్తీకదీపం సీరియల్: దీప, కార్తీక్‌లను విడదీసేసిన జ్యోత్స్న! 2 వారాలు జ్యో, దీపలకు కొత్త బాధ్యతలు!
Karthika Deepam 2 Serial Today May 18th: జ్యోత్స్న, దీపలకు సమానంగా ఓటింగ్ రావడం.. జ్యోత్స్న కండీషన్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode | దీప, జ్యోత్స్నలలో సీఈఓగా ఎవరిని చేయాలి అనే విషయం మీద ఇద్దరికీ పోటీ పెడతారు. జ్యోత్స్న ఓట్లు లెక్కిస్తుంది. చివరి ఓటు దీప అని వస్తే దీప సీఈఓ అయిపోతుంది. ఇది దీప పేరు వస్తే నా పరువు పదవి రెండూ ఒకే సారి చేయి జారిపోతాయని జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది. టెన్షన్ పడుతూనే చివరి ఓటు చూస్తుంది. అందులో జ్యోత్స్న అని ఉంటుంది. ఇద్దరికీ సమానంగా వచ్చాయ్ ఇప్పుడేం చేస్తాం అని శివనారాయణ అడుగుతారు. దానికి కార్తీక్ ఇద్దరూ సీఈఓలు అవుతారు అని అంటాడు. ఇద్దరు ఉండటం కుదరదు అని జ్యోత్స్న అంటే ఇద్దరూ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇద్దరూ అవుతారు.. కానీ కంపెనీని ఎవరు సమర్ధవంతంగా నిడపగలరో వాళ్లే సీఈఓ అవుతారు అని శివనారాయణ అంటారు.
జ్యోత్స్న తాతతో అలా ఎలా ఇద్దరిలో ఒకరిని చేస్తారు అంటే.. మన దగ్గర నష్టాల్లో ఉన్న రెండు రెస్టారెంట్లు ఇద్దరికీ చెరో ఒకటి ఇస్తాం.. ఇందుకు వారం రోజులు గడువు.. ఇద్దరిలో ఎవరు కస్టమర్లు రాని రెస్టారెంట్‌కి కస్టమర్లు తెస్తారో.. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్‌ని లాభాల్లోకి తెస్తారో వాళ్లే సీఈవో అంత వరకు ఇద్దరూ సీఈఓల్లా ఉంటారు.. రోజు ఆఫీస్‌కి వచ్చి మీ రెస్టారెంట్‌ని ఎలా డెవలప్ చేసుకుంటారో మీ ఇష్టం అని అంటారు. నాకు ఓకే అని దీప అంటుంది. న్యాయమైన పోటీ అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న తనకు కూడా ఓకే అని కాకపోతే నువ్వు పాత సీఈఓ కాబట్టి ఈ రెండు వారాలు నువ్వు దీపకు సలహాలు ఇవ్వకూడదు.. అని అంటుంది. కార్తీక్ సరే అంటాడు. ఇక జ్యోత్స్న రెండో పాయింట్ అని నువ్వు, దీప విడిపోవాలి అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఈ రెండు వారాలు బావ దీప ఒకే ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో బావ ఉండొచ్చు.. దీప తన సొంత తెలివి తేటలతో గెలవాలి.. అలా గెలవలేను అని దీప చెప్తే బావని దీపకి తోడుగా ఉండనిస్తా కానీ తనకు చేతకాదు అని ఒప్పుకోవాలి.. నాకు సామర్థ్యం ఉంది.. సమర్థత ఉంది.. నాతో పోటీ పడే సత్తా దీపకి ఉంటే ఒంటరిగా పోటీలో దిగమనండి.. లేదంటే తప్పుకోమని చెప్పు అని అంటుంది. దీప ఒప్పుకుంటున్నా అని జ్యోత్స్న కండీషన్‌కి ఒప్పుకుంటుంది.
దీప ప్రెగ్నెంట్ ఈ టైంలో భర్త అవసరం ఉంటుందని శ్రీధర్ అంటాడు. దీప ఒప్పుకుంది కదా అని జ్యోత్స్న అంటుంది. శివనారాయణ దీపతో జ్యోత్స్న కండీషన్ నాకు నచ్చలేదు.. నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే మరో దారి చూసుకుందాం అని అంటారు. దశరథ్ కార్తీక్‌తో దీపని జ్యోత్స్న రెచ్చగొడుతుంది. ఆపరా అంటే నిర్ణయం నా చేతిలో నుంచి జారిపోయింది మామయ్య అని కార్తీక్ అంటాడు. నిర్ణయం వెనక్కి తీసుకునేదే లేదు అని దీప అంటుంది. శ్రీథర్ దీప అని అంటే నేను ఈ పోటీలో గెలుస్తాను మామయ్య గారు అని దీప అంటుంది. అగ్రిమెంట్లో అన్నీ క్లియర్‌గా రావాలి.. బావ, దీప కలిసి ఉండకూడదు అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న కార్తీక్‌తో ఈ రోజు ఈ క్షణమే నువ్వు మా ఇంటికి వచ్చేయాలి బావ అని అంటుంది.
శ్రీధర్ ఇంటికి వెళ్తే కాంచన భర్తతో సీఈఓ పోస్ట్ ఎవరికి ఇచ్చారు..ఆ పోస్ట్ ఆ జ్యోత్స్నకి ఇచ్చేస్తే ఆఫీస్‌లో ఉంటుందని అంటుంది. ఇంతలో జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. జ్యోత్స్న మాట్లాడుతున్నా కాంచన కోపంగా జ్యోత్స్నని ఇంటి నుంచి వెళ్లిపోమని అంటుంది. మేనకోడలా నువ్వు కాసేపు బయట ఉంటే నేను కాంచనతో మాట్లాడుతా అని శ్రీధర్ అంటాడు. మామయ్య నువ్వేం మాట్లాడుతావో అది చెప్పాలనే నేను వచ్చా అని కార్తీక్ చేయి పట్టుకొని పద బావ అని అంటుంది. కాంచన పెద్దగా అరుస్తూ ఏయ్ నా కొడుకు చేయి వదలవే అని అంటుంది. దెబ్బకి జ్యోత్న్న చేయి వదిలేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నావే.. రేయ్ అది తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తాన్నావ్‌రా అని అంటుంది.
రెండు వారాలు బావ పూర్తిగా మా ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇంటికి రాడు.. దీప మా ఇంటికి రాదు.. సో వీళ్లిద్దరి ఈ రెండు వారాలు కలవరు.. అని జ్యోత్స్న చెప్తుంది,. రేయ్ ఏం మాట్లాడుతుందిరా ఇది,, మతి పోయిందా దీనికి అని కాంచన అంటుంది. సీఈఓ పదవి కోసం తనకు పోటీగా దీపని పెట్టారని జ్యోత్స్న మొత్తం చెప్తుంది. ఈ పోటీలు మీకు అవసరమా..ఇప్పటికి ఉన్న దరిద్రాలు సరిపోవు అన్నట్లు ఈ దరిద్రం తగించుకొని వచ్చారా అని కాంచన అంటుంది. బావ రెండు వారాలు మా ఇంట్లోనే ఉంటాడు.. దానికి దీప ఒప్పుకుంది అని జ్యోత్స్న అంటుంది. నువ్వు అందరి కోసం జీవితాలు త్యాగం చేస్తున్నావ్‌రా.. ఇప్పుడే మా అన్నయ్యకి కాల్ చేసి ఈ గాడిదని మా ఇంటి మీదకు ఎందుకు వదిలేశావ్ అని అడుగుతా.. నా కొడుకు కోడల్ని విడదీయడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చార్రా అని అంటుంది. నీ కొడుకు కోడలే ఇచ్చారు అని జ్యోత్స్న అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















