కార్తీక్, జ్యోత్స్నను తన స్టాల్‌లో పని చేయిస్తాడు. జ్యోత్స్న మొదట్లో ఇబ్బంది పడినా, నెమ్మదిగా పరిస్థితులకు అలవాటు పడుతుంది.
Karthika Deepam 2 Serial Today June 1st: కార్తీకదీపం సీరియల్: సూరజ్ పక్కనే.. సూరజ్ స్టాల్‌లో.. జ్యోత్స్న! కార్తీక్ అలా.. జ్యో ఇలా.. ఇది కదా కావాల్సింది!
Karthika Deepam 2 Serial Today June 1st: కార్తీక్ జ్యోత్స్నని సూరజ్ స్టాల్ దగ్గరకు తీసుకెళ్లి పని చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 1న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూరజ్ స్టాల్‌లో జ్యోత్స్న..
సూరజ్ స్టాల్ దగ్గరకు జ్యోత్స్నని కార్తీక్ తీసుకొని వస్తాడు. అక్కడ నా వల్ల తప్పు జరిగింది.. సూరజ్ స్టాల్‌లో హెల్తీ ఫుడ్ ఉంటుంది అని కటౌట్‌లు పెడతారు. జ్యోత్స్న వాటిని చూసి రగిలిపోతుంది. ఈ షాప్ నీదే అనుకొని అందర్నీ మెప్పించేయ్ అని జ్యోత్స్నకి యాప్రాన్ క్యాప్ పెట్టమని అంటాడు. జ్యోత్స్న పెట్టుకొని వస్తుంది. జ్యోత్స్నని కార్తీక్ అందరితో చూపించి తను మాజీ మిస్ హైదరాబాద్ అని అంటాడు.
Also Read: కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో
ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది...
కార్తీక్ కావాలనే జ్యోత్స్నని ఇరిటేట్ చేస్తాడు. ఈ సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని జ్యోత్స్న అంటే అది మంచిదే ఇంకెప్పుడూ ఇలా చేయరు అని కార్తీక్ అంటాడు. ఇక కస్టమర్లు ఆర్డర్ వేస్తుంటే జ్యోత్స్న చిరాకుగా జ్యూస్‌లు కలుపుతుంది. కార్తీక్ ఫొటోలు తీసి పెద్దాయనకు పంపిస్తాడు.
Also Read: బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
ఇంటి వారసురాలకి ఈ పరిస్థితా...
పెద్దాయన ఫొటోలు చూసి బాధ పడుతూ ఈ ఇంటి వారసురాలికి ఎలాంటి పరిస్థితి వచ్చింది చూశారా.. ఇలాగా నేను నా వారసురాలిని చూడాలి అనుకుంది.. నాకు ఇష్టం లేకపోయినా తను మారుతుందని పంపాను.. నా మనవరాలు ఏంటి ఇలా ఎవడో అనాముఖుడి షాప్ ముందు జ్యూస్‌లు అమ్మడం ఏంటి అని బాధ పడతాడు. దీప పెద్దాయనతో అంత పెద్ద గొడవ జరిగానా అతను ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు.. మర్యాదగా తన కోరిక చెప్పాడు.. అని అంటుంది. అందరూ జ్యోత్స్న తప్పు చేసింది తనకు ఇలాంటి శిక్ష పడాలి.. అప్పుడే తను మారుతుందని అందరూ అనుకుంటారు.
Also Read: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!
బావ ఓ ఆట ఆడుకుంటాడు..
దీప మనసులో జ్యోత్స్న ఓ కిలాడీ.. దాని సంగతి మీకు తెలీదు.. బావ మాత్రం దాంతో ఓ ఆట ఆడుకుంటాడు అని దీప మనసులో అనుకుంటుంది. ఇక జ్యోత్స్న మిక్సీలు జ్యూస్‌లు అంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కార్తీక్, పారు జ్యూస్ తాగుతూ ఉంటారు. పారు దీపని చూసి బాధ పడితే ఏంటి పార్టీ మార్చేసినట్లు ఉన్నావ్ అని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్నతో అంత సైలెంట్‌గా ఉంటావేంటి మేడం.. కస్టమర్లను ఆకట్టుకోవాలి అని కార్తీక్ అంటాడు. నేను చేయను అని జ్యోత్స్న అంటే సాయంత్రం వరకు ఇక్కడే సర్వీస్ చేయాలి అని సూరజ్ అంటాడు. సాయంత్రం వరకు అంటే కష్టం అని పారు అంటుంది. ఒక్క కస్టమర్ అయినా రావాలి లేదంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావని సూరజ్ అంటాడు.
మీరు సిద్ధమేనా..
జ్యోత్స్న చిరాకుగా నవ్వుతూ.. సూరజ్ ఆర్గానిక్స్ హెల్దీ అని చెప్పి జ్యూస్ తాగండి అని అంటుంది. ఓ కస్టమర్ వచ్చి జ్యూస్ చేసివ్వమని అడుగుతాడు. కస్టమర్ విసిగించడంతో జ్యోత్స్న తెగ ఇరిటేట్ అయిపోతుంది. కార్తీక్ మాట్లాడటం చూసి మీరు ఎవరు అని అడిగితే నా డ్రైవర్ అని జ్యోత్స్న అంటుంది. అంత లేదు ఆ బాబు గొప్పింటోడిలా ఉన్నాడు అని అంటాడు. జ్యోత్స్నని మాత్రం పని పిల్ల అని అంటాడు. జ్యోత్స్న ఇరిటేట్ అయి కొట్టడానికి వెళ్లిపోతుంది. నీ కోసం స్పెషల్ జ్యూస్ చేసి ఇస్తా అని అతనికి అన్నీ రకాల పళ్లు కలిపేసి చెత్త చేసి ఇచ్చే టైంలో సూరజ్ అది పడేసి మీకు వేరే జ్యూస్ ఇస్తా సార్ అని మంచి జ్యూస్ ఇస్తాడు. అతను జ్యోత్స్న చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతాడు.
కావాలనే చేశా..
సూరజ్ జ్యోత్స్నతో ఏంటి మేడం జ్యూస్ పడిపోయింది అనుకున్నారా.. నేనే జ్యూస్ పడేశా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. నేనేంటి నా రేంజ్ ఏంటి అని జ్యోత్స్న అంటే శివన్నారాయణ మనవరాలు అనే ట్యాగ్ తీసేస్తే అతను చెప్పినట్లు మీరు పని మనిషే అని సూరజ్ అంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మేడం.. ఈ రోజు మీది రేపు నాది ఎప్పుడూ నా జోలికి రావొద్దు గుడ్ బాయ్ అని సూరజ్ చెప్తాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
ఈరోజు కార్తీకదీపం 2 ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది?
జ్యోత్స్న ఎందుకు స్టాల్‌లో పని చేయాల్సి వస్తుంది?
కార్తీక్, జ్యోత్స్న చేసిన తప్పుకు ఆమెను శిక్షించడానికి ఆమెను తన స్టాల్‌లో పని చేయిస్తాడు. ఆమె తన తప్పును తెలుసుకొని మారాలని కార్తీక్ కోరుకుంటాడు.
పెద్దాయన జ్యోత్స్న పరిస్థితి చూసి ఏమనుకుంటారు?
పెద్దాయన తన మనవరాలి పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. ఇంటి వారసురాలైన ఆమె ఇలా జ్యూస్‌లు అమ్మడం చూసి ఆయనకు చాలా కష్టంగా ఉంటుంది.
కస్టమర్లతో జ్యోత్స్న ప్రవర్తన ఎలా ఉంటుంది?
జ్యోత్స్న మొదట్లో కస్టమర్లతో చిరాకుగా ప్రవర్తిస్తుంది. ఒక కస్టమర్ ఆమెను పనిమనిషితో పోల్చడంతో జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















